Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2021-02-20 00:57 GMT
Live Updates - Page 2
2021-02-20 04:43 GMT

YCP MP Vijayasaireddy Padayatra Live Updates

* విజయసాయి రెడ్డి చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రలో వైసీపీ నేతలు, పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొసాగుతుందంటున్న ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్

2021-02-20 04:36 GMT

Andhra Pradesh Live Updates: తూర్పుగోదావరి

తూర్పుగోదావరి:

కొత్తపేట

* కొత్తపేట మండలం బొరుసువారి సావరంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హుండి చోరీ..

2021-02-20 04:35 GMT

Andhra Pradesh Live Updates: నెల్లూరు

నెల్లూరు:

* చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో ప్రధాన రహదారిపై ఆటో , లారీ ఢీ

* ఒకరు మృతి.. పలువురికి గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలింపు.

2021-02-20 04:33 GMT

Andhra Pradesh Live Updates: గుంటూరు

గుంటూరు:

* ముప్పాళ్ల మండలం ధమ్మాలపాడు లో వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ

* ప్రచారానికి వెళ్లిన జనసేన కార్యకర్తల పై రాళ్ళ దాడి చేసిన వైసీపీ వర్గీయులు

* అధికార పార్టీ తీరుపై నిన్న ఈసీ కి ఫిర్యాదు చేసిన జనసేన

2021-02-20 04:22 GMT

YCP MP Vijayasaireddy Padha Yatra live Updates

విశాఖ:

-డైమాండ్ పార్కు వద్దకు చేరుకున్న విజయసాయి రెడ్డి పాదయాత్ర

2021-02-20 04:14 GMT

YCP MP Vijayasaireddy Padayatra live Updates

విశాఖ:

- ఆసీల్ మెట్ట సెంటర్ వద్దకు చేరుకున్న విజయసాయి రెడ్డి పాదయాత్ర

2021-02-20 03:40 GMT

Andhra Pradesh Live Updates: విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర

విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రారంభం అయింది. 

ఈ సందర్భంగా జీవిఎంసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన ఎం.పి విజయసాయిరెడ్డి,మంత్రులు అవంతి శ్రీనివాస్,ధర్మాన కృష్ణదాసు,ఎమ్మెల్యేలు

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్

- స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కితీసుకునే వరకు మా పోరాటం ఆగదు.

- కొంతమంది కావాలనే ఈ రోజు పాదయాత్రపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

- త్వరలోనే డిల్లి వెళ్ళి కేంద్రం పై ఒత్తిడి తీసుకువస్తాం.

- 32 మంది త్యాగాలను వృధా కానివ్వం.

2021-02-20 03:31 GMT

Andhra Pradesh live updates: అమరావతి

అమరావతి:

-అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ సోము వీర్రాజు - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ.

-హిందుత్వాన్ని పక్కన పెట్టేందుకు విశాఖ ఉక్కు ఉద్యమం తీసుకువచ్చారని చెప్పడం అవివేకం.

-ఢిల్లీలో సోము వీర్రాజుకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

-మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు.

-ప్రధాని అధ్యక్షతన ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగిన విషయం వాస్తవమా కాదా?

-ఆ మీటింగ్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

-విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ కుట్రలను ప్రజలు క్షమించరు.  -రామకృష్ణ.

2021-02-20 03:29 GMT

Andhra Pradesh live Updates: కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా:

-నూజివీడు బైపాస్ రోడ్డులో యస్ఈబి అధికారుల తనిఖీలు

-పంచాయితీ ఎన్నికలు నాలుగవ విడత నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాపై తనిఖీలు

-ఎస్ఈబీ ఎక్సైజ్ కమిషనర్ వివేక్, అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు

2021-02-20 03:24 GMT

Andhra Pradesh live Updates: కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా:

-జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం

-బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా అకాల వర్షం తో ఆందోళనలో అన్నదాతలు

-కొత కు సిద్దంగా వున్న శనగ, మిరప, జొన్న, పంటలు

-అనుకొని వర్షానికి పంట తడిచి పోవటం తో తీవ్ర ఆవేదన చెందుతున్న రైతులు

Tags:    

Similar News