Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2021-02-20 00:57 GMT
Live Updates - Page 3
2021-02-20 03:19 GMT

Andhra Pradesh live updates: తిరుమల

తిరుమల సమాచారం:

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 48,541 మంది భక్తులు.

- నిన్న తలనీలాలు సమర్పించిన 18,868 భక్తులు.

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు

2021-02-20 01:58 GMT

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర వివరాలు

విశాఖ:

- స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ ను వ్యతిరేకిస్తూ ఇవాళ విజయ్ సాయిరెడ్డి మహా పాదయాత్ర

- నగరం లోని అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటు రోడ్ మాప్

- సుమారు 25 కిలోమీటర్లు మేర సాగనున్న పాదయాత్ర

- జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నుంచి కూర్మన్న పాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వరకు పాదయాత్ర

- ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పాదయాత్ర, అనంతరం బహిరంగ సభ

- గాంధీ విగ్రహం నుంచి ఆశీల్ మెట్ట జంక్షన్, సంగం, శరత్ ధీయేటర్, కానీ టెంపుల్, తాటి చెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, 104ఏరియా, మర్రిపాలెం, ఎన్ఏడి జంక్షన్, ఎయిర్పోర్ట్, షీలా నగర్, బిహెచ్ విపి, ఓల్డ్ గాజువాక, సింగ్ నగర్, స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర సాగుతుంది

- జివిఎంసి పరిధిలో 98వార్డులను కలుపుకుని వెళ్ళే విధంగా పాదయాత్ర రూపకల్పన

2021-02-20 01:36 GMT

విజయసాయిరెడ్డి పాదయాత్ర 9గంటలకు

 ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పాదయాత్ర. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా విశాఖ లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ చేశారు. 

విజయసాయిరెడ్డి పాదయాత్ర 9గంటలకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభించనున్నారు. 

విజయసాయి రెడ్డి పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది hmtv. ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్ డేట్స్ లో..

2021-02-20 01:23 GMT

విశాఖ ఉక్కుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సోము వీర్రాజు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రాజకీయ వేడి రగులుకున్న తరుణంలో ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.

- స్టీల్ ప్లాంట్ అంశంలో నిరసనలు నిలుపుదల చేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

- స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

- విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనలలో పాల్గొనవద్దని కోరారు.

- ఆందోళన కలిగించేలా వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఉద్యోగులు నమ్మవద్దని సూచించారు.

Tags:    

Similar News