తూర్పుగోదావరి - రాజమండ్రి
కోరుకొండ మం మధురపూడిలో సామూహిక అత్యాచార బాధిత కుటుంబానికి 2లక్షల ఆర్ధికసాయం ప్రకటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు
ఆ మొత్తాన్ని రాజమండ్రి- లో చెక్ రూపంలో బాధిత కుటుంబానికి అందచేసిన మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుయువత ఆదిరెడ్డి వాసు,దళిత నేత కాశినవీన్
అమరావతి
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
యథా ముఖ్యమంత్రి,తథా వాలంటీర్లు.ఆయన లక్షల కోట్లు స్కాంలు చేస్తుంటే... వీళ్లు వేలల్లో చేతివాటం స్కీమ్ లో కొట్టేస్తున్నారు.
విజయవాడ
తిన్న దానికి డబ్బులు అడిగినందుకు పాత ప్రభుత్వాసుపత్రి క్యాంటీన్ మహిళలను బెదిరించిన ప్రభుత్వ ఉద్యోగి
పాత ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ హోచ్ మెన్ పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు
క్యాంటీన్లో పనిచేస్తున్న మహిళలను ఫోటోలు తీస్తూ బెదిరిస్తున్న హోచ్ మెన్
తీసిన ఫోటోలు నెట్ లో పెట్టి మీ బతుకులు నాశనం చేస్తానంటూ వేధింపులు
అసభ్య పాదజాలంతో దుషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మహిళలు
కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు
తూ.గో జిల్లా.... మామిడికుదురు (మం) అప్పనపల్లి బాడవ...
నిన్న సాయంత్రం పాడి పశువులు కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న గడ్డం చిన బాబురావు.
కుటుంబ సభ్యులు స్థానిక తాసిల్దార్ ఫిర్యాదు.
మామిడికుదురు తాసిల్దార్ ఆదేశాల మేరకు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఫైర్ సిబ్బంది & నగర పోలీసు వారు.
ములుగు జిల్లా.
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, ముళ్ళకట్ట, మంగపేట పుష్కర ఘాట్ ల వద్ద మళ్లీ పెరుగుతున్న వరద ఉదృతి గోదావరి నీటిమట్టం.
రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 6 గంటలకు 7.760మీటర్లుగా నమోదయిన నీటిమట్టం.
ప్రస్తుతము క్రమేపీ పెరుగుతూ 8.500 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం.
మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి నీటి ప్రవాహం.
తూ.గో జిల్లా.... రాజమండ్రి-
నిన్న సాయంత్రం పాడి పశువులు కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న గడ్డం చిన బాబురావు.
మామిడికుదురు (మం) అప్పనపల్లి బాడవ...లో వైనతేయ గోదావరిలో ఘటన
ఆందోళన తో కుటుంబ సభ్యులు స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు.
మామిడికుదురు తాసిల్దార్ ఆదేశాల మేరకు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఫైర్ సిబ్బంది మామిడికుదురు నగర పోలీసులు.
Heavy Rains: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు..
ప.గో:
- జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు..
- పోలవరం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి..
- వరద నీటిలోనే కమ్మరిగూడెం, పాత పోలవరం గ్రామాలు
- పోలవరం ఏజెన్సీ గ్రామాల్లో కొనసాగుతున్న వరద..
- ఎతైన కొండలపైన తలదాచుకున్న 19గ్రామాల గిరిజనులు
- వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో వదలని వరద..
- వరద ప్రభావిత గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..
అమరావతి
- న్యాయమూర్తుల ఫోన్స్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ న్యాయవాది శ్రావణ్ కుమార్
- హైకోర్టులో ధాఖలు చేసిన పిల్ పై
- నేడు జరుగనున్న విచారణ.
- ప్రతి న్యాయమూర్తి కదలికలను పోలీసులతో మోనిటరింగ్ చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన పిటిషనర్
- ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని నియమించారన్న పిటిషనర్
- మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలన్న ధర్మాసనం
- అఫిడవిట్ రూపంలో ధాఖలు చేసిన పిటిషనర్
Amaravati: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.
*అమరావతి*
- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.
- గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల మొదటి నోటిఫికేషన్లో సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన తదుపరి రెండో నోటిఫికేషన్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలి.
- మీరు అధికారంలోకి వచ్చిన తదుపరి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు.
- హార్టీకల్చర్ విభాగం నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హతలను సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మార్పులు చేయడంవల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన చాలామందికి అభ్యర్థులకు వయోపరిమితి పూర్తవుతున్నది.
- వీరికి మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
- గ్రామ/వార్డు సచివాలయ మొదటి నోటిఫికేషన్ ద్వారా అర్హత సాధించి, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తయి, శిక్షణ పూర్తి చేసుకున్న వేలాదిమంది అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
- హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఎఎన్ఎం నర్సు పోస్టులను కూడా భర్తీ చేయండి.
👆రామకృష్ణ.
Ananthapur: తుంగభద్ర కు క్కనసాగుతున్న వరద ప్రవాహం.
అనంతపురం:
తుంగభద్ర కు క్కనసాగుతున్న వరద ప్రవాహం.
డ్యామ్ కు ఇన్ ఫ్లో: 69,031 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో: 66,707 క్యూసెక్కులు.
డ్యాం లో నీటి నిల్వ: 97.777 టీఎంసీలు.
డ్యాం పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.
డ్యాం లో నీటి మట్టం: 1632.2 అడుగులు.
పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.