తూర్పుగోదావరి
రాజమండ్రి: గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న వరద రెండో ప్రమాద హెచ్చరిక
- 16లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
- బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 15.70 అడుగులు
- దేవీపట్నం ,కోనసీమ లంకల్లో కొనసాగుతున్న జలదిగ్భంధం
- ఇంకా ఉధృతంగానే వశిష్ట.వైనతేయ, గౌతమీ పాయలు ..
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిగా అదుపులోకి వచ్చిన వరద
విజయవాడ:
- ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిగా అదుపులోకి వచ్చిన వరద
- 36,250 క్యూసెక్కులు ఔట్ ఫ్లో, 41వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- 4,500 క్యూసెక్కుల వరద నీటిని కాలువలకు విడుదల
Rajahmandry: ఆకస్మికంగా వరదలో పడి మునిగిన భర్తను ధైర్యంగా రక్షించిన భార్య
తూర్పుగోదావరి:
రాజమండ్రి: ఆకస్మికంగా వరదలో పడి మునిగిన భర్తను ధైర్యంగా రక్షించిన భార్య
- పి.గన్నవరం మం లంకలగన్నవరంలోని డొక్కా సీతమ్మకాలనీలో ఘటన
- ఇక్కడి నాగాబత్తుల వెర్రియ్యకు చెందిన ఇల్లు ముంపు వరదజలదిగ్దం బారినపడింది.
- అదే కాలనీలో సురక్షిత ప్రాంతం నుంచి భర్త వెర్రియ్య, భార్య కళావతి ముంపునీటిలో ఇంటిని చూసుకునేందుకు దిగి వెళ్లారు.
- ఆ సమయంలో వెర్రియ్యఅదుపుతప్పి వరదలో మునిగిపోయాడు.
- వెంటనే భార్య కళావతి స్పందించి రక్షించింది.
- అస్వస్థతకు గురైన వెర్రియ్యను పి.గన్నవరంలోని ఆసుపత్రికి స్థానికుల సహకారంతో తరలించి ప్రాణాలు కాపాడారు.
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం..
విశాఖ:
- బంగాళాఖాతంలో అల్పపీడనం..
- ఒడిశ్శా ఉత్తర ప్రాంతం వద్ద తీవ్ర అల్పపీడనం గా కొనసాగుతుంది..
- 24 గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం వుంది..
- వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 23 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుంది.
- అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో వర్షాలు...
Ananthapur: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం:
- జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
- కరోనా తో పరీక్షల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
- మొత్తం తొమ్మిది బాలికల, ఆరు బాలుర పాఠశాలలో 480 సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారుల వెల్లడి
Guntur: అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..
గుంటూరు:
- అమరావతి రాజధాని కోనసాగించాలంటు రైతులు ఆందోళనలు..
- 246వరోజుకు చేరుకున్న రైతులు, నిరసనలు
Ananthapur: జిల్లాలో రెండు వందల ఇరవై రెండు మంది వీఆర్ఏలకు విఆర్వోలు గా పదోన్నతులు
అనంతపురం:
- జిల్లాలో రెండు వందల ఇరవై రెండు మంది వీఆర్ఏలకు విఆర్వోలు గా పదోన్నతులు
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ గంధం చంద్రుడు