Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-18 01:23 GMT
Live Updates - Page 5
2020-08-18 07:03 GMT

రాజకీయాల్లో గెలుపోటములు సహజం: పంచుమర్తి అనురాధ, టీడీపీ అధికార ప్రతినిధి

అమరావతి: పంచుమర్తి అనురాధ, టీడీపీ అధికార ప్రతినిధి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయానికి వైసీపీ నేతలు తానా అంటే తందానా అంటున్నారు.

బుర్రతో ఆలోచించే శక్తి వైసీపీ నేతలకు ఉందా లేదా?

ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతోంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలకు చీమ కుట్టినట్టు లేదు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.

ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి సేవ చేయాల్సిన బాధ్యత లేదా?

అమరావతిలో నిర్మాణాలను ఏం చేయాలో ఆలోచిస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్ధరహితం.

సీనియర్ మంత్రిగా ఆయన అలా మాట్లాడ్డం సరికాదు.

తల్లిదండ్రులను చంపేసి తద్దినం బాగా చేస్తానన్నట్టు బొత్స వ్యాఖ్యలు ఉన్నాయి

అమరావతిని చంపేసి ఆ నిర్మాణాలను ఏం చేయాలో ఆలోచిస్తారా?

ఉత్తరాంధ్రకు రాజధాని ఇస్తే కష్టాలు తొలగిపోతాయా?

ఉత్తరాంధ్ర అభివృద్దికి టీడీపీ హయాంలో అన్ని చర్యలు తీసుకోవడం వల్ల వలసలు ఆగాయి.

విశాఖలో చంద్రబాబు పరిశ్రమల కోసం కట్టిన బిల్డింగ్ లలో రాజధాని పెడతామని చెప్పడమేంటి?

అలా చెప్పుకోడానికి సిగ్గుగా అనిపించడంలేదా?

టీడీపీ హయాంలో విశాఖలో మూడు సమ్మిట్ లు పెట్టాం.

మీరు ఏడాదిన్నరలో ఏం చేశారు? ఒక్క కేంద్రమంత్రి విశాఖ వచ్చారా?

నాడు చంద్రబాబు కేంద్రమంత్రులను రప్పించి అభివృద్ధిలో భాగస్వాములను చేశారు.

విశాఖపై మీకు ప్రేమ ఉంటే అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలను ఎందుకు వెళ్లగొట్టారు?

2020-08-18 06:57 GMT

ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం ఏరియల్‌ సర్వే

అమరావతి: వరద బాధిత ప్రాంతాలను హెలికాఫ్టర్లో పరిశీలించనున్న సీఎం

ఈ మధ్యాహ్నం ఏరియల్‌ సర్వే

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ను కుదించిన అధికారులు

ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల అధికారులతోనే స్పందన వీడియో కాన్ఫరెన్స్‌

2020-08-18 06:54 GMT

చంద్రబాబు విశాఖ పై విషం క‌క్కుతే ఊరుకోం: ఎమ్మెల్యే కరణం

విశాఖ: చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ కామెంట్స్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు జనరంజిక పాలన అందిస్తున్నారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 59,425 కోట్లు రూపాయిలు సంక్షేమానికి ఖర్చు చేశారు.

గతం ప్రభుత్వం అన్ని రంగాలకు అభివృద్ధి చేశామని చెబుతున్న ఐదు ఏళ్లలో 44,534 కోట్లు రూపాయిలు సంక్షేమానికి ఖర్చు చేశారు.

సంక్షేమ పథకాల పేరుతో గత ప్రభుత్వం లో స్కాములు చూసారు.

గతంలో న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు.

న్యాయమూర్తుల ఫోన్లు ట్రాప్ చేస్తున్నాం అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు.

30 లక్షలు మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుడితే చంద్రబాబు మోకాలు అడ్డుపెడుతున్నారు.

చంద్రబాబు విశాఖ పై విషం చిమ్మేటే ఊరుకునే ప్రసక్తే లేదు.

2020-08-18 06:50 GMT

భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణాజిల్లా: నూజివీడు మండలం గొడుగువారిగుడెం గ్రామంలో సరిహద్దు వివాదంలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితి ఉద్రిక్తం

కత్తులు,కర్రలతో భూమికి వచ్చిన 30 మంది వ్యక్తులు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు పరిస్థితి ఉద్రిక్తత

నలభై సంవత్సరాలుగా భూ యజమానులను కాదని నకిలీ పత్రాలతో భూమి మాధి అంటూ భూమి లోకి ప్రవేశించిన ల్యాండ్ మాఫియా

2020-08-18 06:47 GMT

తూర్పుగోదావరి క‌లెక్ట‌రేట్‌లో వ‌ర‌ద‌లపై సమీక్షా సమావేశం

తూర్పుగోదావరి: వరద పరిస్థితి, సహాయ పునరావాస చర్యలపై కాకినాడ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సమీక్షా సమావేశం..  

2020-08-18 06:44 GMT

మురముళ్ళ పుష్కర ఘాట్ సమీపంలో నీట మునిగిన ఇళ్ళు..

 తూర్పుగోదావరి: మురముళ్ళ పుష్కర ఘాట్ సమీపంలో ఉన్న మత్సకారుల ఇళ్ళ లోనికి చేరిన వరద నీరు.

నీట మునిగిన సుమారు 30 ఇళ్ళు..

2020-08-18 06:01 GMT

వైసీపీ మీద అయ్యన్నపాత్రుడు ఫైర్

అమరావతి: ట్విట్టర్ లో టిడిపి నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు...

వంద కోట్లు లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకొని న్యాయ వ్యవస్థని బ్రష్టు పట్టించాలని ప్రయత్నించి సీబీఐ కి అడ్డంగా దొరికిపోయిన గాలి దొంగలు,16 నెలలు చంచల్ గూడా ఊచలు లెక్కపెట్టిన గజ దొంగలు ఇప్పుడు న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.

సాయిరెడ్డి గారు, ఒక దొంగ పోలీస్ పై నిఘా పెట్టినట్టు ఉంది మీ జగన్ రెడ్డి గారి ట్యాపింగ్ తంతు.



2020-08-18 05:53 GMT

నెల్లూరులోని మెడికవర్ కోవిడ్ సెంటర్ లో దారుణం.

నెల్లూరు : 

-- నెల్లూరులోని మెడికవర్ కోవిడ్ సెంటర్లో దారుణం.

-- కోవిడ్ లక్షణాలు తో బాధపడే మహిళను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిన నిర్వాహకులు.

-- తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితురాలు.

-- ఇప్పటికే కుటుంభలో భర్త, చిన్నపిల్లలకు కోవిడ్ లక్షణాలు. 

2020-08-18 05:51 GMT

బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని మంత్రి ఆదేశం.

తూర్పు గోదావరి: అమలాపురం గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పర్యటన...

అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం లో నీట మునిగిన మత్స్యకారుల గృహాలను పరిశీలించిన మంత్రి విశ్వరూప్...

బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని మంత్రి ఆదేశం...

బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చిన మంత్రి విశ్వరూప్...

2020-08-18 04:17 GMT

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

కర్నూలు జిల్లా శ్రీశైలం

- శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

- ఇన్ ఫ్లో : 3,30,733 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు

- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

- ప్రస్తుతం : 875.30 అడుగులు

- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

- ప్రస్తుతం : 165.1436 టిఎంసీలు

- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Tags:    

Similar News