Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-18 01:23 GMT
Live Updates - Page 6
2020-08-18 04:17 GMT

తూర్పుగోదావరి :

- పిఠాపురం వై జంక్షన్ వద్ద బెండపూడి నుంచి మండపేట కు అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం, ఐషర్ వ్యాన్ సీజ్ చేసిన పోలీసులు..

2020-08-18 04:16 GMT

కడప :

- రైల్వేకోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లె సమీపంలో డాబా వద్ద నిలబడి ఉన్న లారీని ఢీ కొన్న మరో టెంపొ

- ఇద్దరు మృతి , వెనుక భాగాన లారీని ఢీకొన్న టెంపో

- ఐదుగురికి స్వల్ప గాయాలు ఆస్పత్రికి తరలింపు

2020-08-18 04:16 GMT

కోనసీమ లంక గ్రామాలను భయపెడుతున్న అమావాస్య..

తూర్పుగోదావరి :

- అమావాస్య సమయంలో వచ్చే ఆటుపోట్లు కారణంగా సముద్రం వేగంగా ప్రవహించని వరద నీరు..

- బ్యాక్ వాటర్ రూపంలో వరద నీరు వెనక్కి వచ్చే అవకాశం..

- బ్యాక్ వాటర్ వస్తే మరో మూడు రోజుల పాటు జలదిగ్బంధంలో కొనసాగనున్న లంక గ్రామాలు..

2020-08-18 04:15 GMT

తూర్పుగోదావరి :

- నేడు కోనసీమ లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పర్యటన..

- కోనసీమ లో పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మంత్రి కృష్ణ దాస్..

2020-08-18 04:15 GMT

తూర్పుగోదావరి :

- వరద నీటిలో మామిడికుదురు మం. అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం.

- 1986,2006 తరువాత అత్యధిక స్థాయిలో ఆలయంలో ప్రవేశించిన వరద నీరు..

2020-08-18 04:14 GMT

తూర్పు గోదావరి :

- ముమ్మిడివరం మం. గోవలంక, పళ్ళ వారి లంక, మామిడికుదురు మండలం పెదపట్నం లంక వద్ద బలహీనంగా ఉన్న ఏటి గట్లు..

- దిగువ గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఏటి గట్టు లీకేజీ లు..

- ఇసుక బస్తాలతో లీకేజీ లను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోన్న స్థానికులు..

2020-08-18 04:13 GMT

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

- గోదావరికి మరింత వరద ఉధృతి

- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక

- ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 22,90,000 క్యూసెక్కులు

- గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు

2020-08-18 01:32 GMT

ప.గో:

- ఇవ్వాళ పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పార్టీ నాయకులు...

- ఉదయం 10 గంటలకు పోలవరంలో రింగ్ బండ్ గట్టు పాత పోలవరం బిక్కుబాబా గుడి వద్ద గట్టు పరిశీలన.

- కడెమ్మ సలూయిజ్ వద్ద గట్టు పరిశీలన..

-  పోలవరం గ్రామం వైపు ముంపుకి గురి అయిన వరి పొలాలు పరిశీలన..

2020-08-18 01:31 GMT

ప.గో:

- నేడు కొవ్వూ రు మండలం మద్దూరు లంక గ్రామంలో

- వరద ప్రభావిత ప్రాంతంలో మంత్రి తానేటి వనిత పర్యటన..

- ఉదయం 10.30 గంటలకు వరద ముంపు ప్రాంతాలను పరిశీలి న..

- ఉదయం 11 గంటలకు మద్దూరు లో ఏర్పాటు చేసిన పు నరావాస కేంద్రాలను పరిశీలిస్తారు.

- ఉదయం 11.30 గంటలకు గోష్పాద క్షేత్రం లో వరదను మంత్రి వర్యులు పరిశీలిస్తారు.

2020-08-18 01:31 GMT

ప.గో:

- నేడు వేలేరుపాడులో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ,జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని ..

- వరద ముంపు ప్రాంతంలో సహాయ చర్యలు ,వరద

- తీవ్రతను పరిశీలించనున్న మంత్రులు..

Tags:    

Similar News