Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21
ఈరోజు తాజా వార్తలు
విశాఖ: భారత బాక్సింగ్ జట్టు కోచ్ ఎన్.ఉషకు ధ్యాన్‌చంద్ అవార్డు
విశాఖ డీజిల్ లోకో షెడ్‌లో పని చేస్తున్న ఎన్.ఉషకు ధ్యాన్‌చంద్ అవార్డు
2004-10 మధ్య 6 సార్లు సీనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న ఉష
అంతర్జాతీయ పోటీల్లో ఉషకు 4 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు
జాతీయ స్థాయిలో తొమ్మిది బంగారు, మూడు కాంస్య పతకాలు
గుంటూరు:
- తమ కుమారుడు 3 నెలలుగా కనిపించడం లేదంటు చిరంజీవి తండ్రి సుబ్బారావు ఈ నెల 13 న చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...
- సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో విస్తుపోయే బయట పడ్డ నిజాలు...
- మొదటి భార్యతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న చిరంజీవి....
- శిరీష అనే యువతితో సహజీవనం చేస్తున్న చిరంజీవి....
- చిరంజీవిని హత్య చేసిన శిరిష ప్రియుడు భానుప్రకాష్ ....
- చిరంజీవి ని చంపేసి ఇంట్లోనే శవాన్ని పూడ్చి పెట్టిన శిరిష్ ప్రియుడు భానుప్రకాష్....
- 3నెలలుగా శవాన్ని ఇంట్లో పూడ్చిపెట్టిన శిరీష్ భాను ప్రకాష్...
- శిరిష్ ,భానుప్రకాష్ 12,లక్షల 20వేలు నగదు మర్డర్ చేశారు...
- ఆతర్వాత శిరీష,భానుప్రకాష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు...ఆడబ్బుతో జల్స చేశారు...
- శిరీష, భానుప్రకాష్ విచారణ కోసం దర్యాప్తు చేస్తున్న చెరుకుపల్లి వీఆర్వోతో వచ్చి లోంగిపోయారు....
- తప్పు చేస్తున్న దోరకములే అనుకుంటే...తప్పు....
- ఈకేసులో శిరీష, భానుప్రకాష్ అరెస్ట్ చేశాం రిమాండ్ కు తరలిస్తాం....
- గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ
తూర్పుగోదావరి జిల్లా:
కొత్తపేట: కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద వరద ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్,BC వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,,స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి,అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అధికారులు
అమరావతి:
- జగన్ రెడ్డి రాజకీయ గురువు కేసీఆర్ గిఫ్ట్ గా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేసిన విషయం మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మర్చిపోయారా..?
- తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన కాంట్రాక్ట్ లకు ఆశపడి ఆయన చుట్టూ తోక ఊపుకుంటూ తిరుగుతున్న మీకు చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత లేదు.
- ఓట్ల కోసం జలదీక్ష చేసిన జగన్ తరువాత కేసీఆర్ మెప్పు కోసం కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి రాయలసీమ ప్రజలను మోసం చేయలేదా?
- కేసీఆర్ కు అమ్ముడుపోయింది మీరు కాదా?
- పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ ఒప్పుకున్నారని కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెబితే ప్రశ్నించలేకపోయింది మీరు కాదా?
- కేసీఆర్ మీద ఉన్న ప్రేమతో 5 కోట్ల ప్రజలకు చెందిన ఏపీ ఆస్తులను తెలంగాణకు ధారాదత్తం చేశారు.
- నదీ జలాల వ్యవహారంలో రాష్ట్రానికి కేసీఆర్ ఇంత అన్యాయం చేస్తున్న కనీసం ఆయనను ప్రశ్నించే దమ్ము లేక వత్తాసు పలకడం సిగ్గుచేటు.
- చంద్రబాబు నాయుడు ఎవరికి భయపడరు.
- భయపడాల్సిన అవసరం లేదు.
- భయపడటం, లాలూచీలకు పాల్పడం జగన్ వెన్నతో పెట్టిన విద్య.
విజయవాడ:
- రమేష్ హాస్పిటల్ చైర్మన్ రామమోహనరావు కోడలు రాయపాటి శైలజను విచారణ కు హజరుకావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు.
- శైలజను గుంటూరు లోని తన నివాసానికి విచారించేందుకు వస్తామన్న పోలీసులు.
- ఇంటి వద్దకు విచారణ వద్దు గుంటూరు లోని రమేష్ బాబు హాస్పిటల్ కు వస్తాన్న శైలజ.
- శైలజ ను విచారించేందుకు విజయవాడ నుండి గుంటూరుకు బయలు దేరిన ప్రత్యేక పోలీస్ బృందం.
- అమరావతి మహిళ జేఏసి లో కీలక పాత్ర పోషిస్తున్న శైలజ.
- రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె శైలజ.
నెల్లూరు:
- వింజమూరు(మం) చింతలపాలెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం బోల్తా.
- వాహనం లో వెళుతున్న బాలుదొర(42)అనే వ్యక్తి మృతి.
- గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం
- మైనర్ బాలికను కిడ్నాప్ చేసి యువకుల అత్యాచారం....
- ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన తెనాలి పోలీసులు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.....
- తెనాలి ముత్యంసెట్టిపాలెంకు చెందిన 14 ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసిన కర్లపాలెంకు చెందిన నూతలపాటి నవీన్ కుమార్...
- కుమార్తె అదృశ్యంపై వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లి
- బాలికపై అత్యాచారం చేసి తెనాలి వైకుంఠపురం సమీపంలో వదిలి వెళ్లిపోయిన నవీన్ కుమార్
- తల్లిదండ్రులకు భయపడి అర్ధరాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు పేరేచర్ల చేరుకున్న బాలిక
- బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన పేరేచర్ల కు చెందిన హోంగార్డు అశోక చక్రవర్తి, స్నేహితుడు దుర్గారావు
- బాలికను గదిలో బంధించి రెండు వారాల పాటు అత్యాచారంకు పాల్పడిన హోంగార్డు అశోక చక్రవర్తి, దుర్గారావులు...
- గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక చక్రవర్తి...
- ఈ నెల 13న వారి చర నుండి తప్పించుకుని తెనాలి చేరుకున్న బాలిక
- తల్లితో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడించిన బాలిక
- బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం..
- మహిళలు బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం
- తెనాలి డిఎస్పి శ్రీలక్ష్మి
అమరావతి:
- ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తున్న పరిశ్రమల్లో థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం
- ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ కి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్.
అమరావతి:
- సచివాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో రాష్ట్ర యువజన, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) సమీక్షా సమావేశం
- పర్యాటక శాఖ లో పెండింగ్ లో పనులకు తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశం
- సెప్టెంబర్ మొదటి వారం నాటికి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతించాలన్నమంత్రి
- ఈ నెల 20న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పర్యాటక శాఖపై రివ్యూ
- సీఎం చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీ ప్రారంభం
- సెప్టెంబర్ మొదటి వారంలో శ్రీశైలం దేవస్థానంలో ప్రసాద్ పథకం కింద పూర్తయిన పనుల ప్రారంభం
- త్వరలో సింహాచల దేవస్థానంలో ‘ప్రసాద్‘ పథకం పనులకు శంకుస్థాపన చేస్తామన్న మంత్రి
- త్వరలో సీఎం చేతుల మీదుగా కొండపల్లి ఫోర్టు, బాపూ మ్యూజియంలు ప్రారంభం
- తొట్లకొండలో బుద్ధిస్ట్ మ్యూజియం, మెడిటేషన్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం
- పీపీఈ పద్ధతిలో రాష్ట్రంలో 3 ఇంటర్నేషనల్ స్టేడియాల నిర్మాణం
- జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఈ ఏడాది కూడా వైఎస్సార్ ప్రతిభా క్రీడా పురస్కారాలు అందజేస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్
తూర్పుగోదావరి:
- ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠాణేలంక లో పడవ బోల్తా..
- సమీపంలో మరో పడవ ఉండటంతో తప్పిన ప్రమాదం..
- బోల్తా పడిన పడవలో ఉన్న వారిని సురక్షితం గా ఒడ్డుకు చేర్చిన మత్సకారులు..