Bhatti Vikramarka: నిన్న శాసనసభ లో రెండు లక్షల 68వేల ఇళ్ళు పేదలకు ఇవ్వనున్నాం అని చెప్పారు..భట్టి. విక్రమార్క సీఎల్పీ నేత..
భట్టి. విక్రమార్క సీఎల్పీ నేత..
-ఇప్పటికే లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
-అసెంబ్లీ లో తలసాని గారి ఆహ్వానం మేరకు మేము అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించాం..
-3428ఇళ్ళను ఇప్పటివరకు మాకు చూపించారు..ఇంకా మిగిలిన ఇళ్ళను చూపించాలి..
-నాతోపాటు క్వాలిటీ టీం ను కూడా తీసుకువచ్చా..వారు రిపోర్ట్ ఇచ్చాక డబుల్ బెడ్ రూం ఇళ్ళ గురించి మాట్లాడతాం..
-ఎప్పుడు ఇళ్ళ పంపిణీ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది..
-రాజీవ్ గృహ కల్ప ఇళ్ళ ను మేము పూర్తి చేసినా..వాటిని పంపిణీ చేయలేదు..
-పూర్తైన ఇళ్ళ ను పంపిణీ చేయకపోవడం తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.. అద్దె లు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని మాకు చెప్తున్నారు..
కోవిడ్ పేషెంట్స్ యొక్క CT వాల్యూను RTPCR రిపోర్ట్ లో చూపించడం లేదంటూ హైకోర్ట్ లో పిల్..తీగల రామ్ ప్రసాద్ గౌడ్..
టీఎస్ హైకోర్టు....
-ప్రజా ప్రయోజన వాజ్యం ధాఖలు చేసిన తీగల రామ్ ప్రసాద్ గౌడ్ న్యాయవాది..
-పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ
-తదుపరి విచారణ ఈ నెల 24వ తేదికి వాయిదా వేసిన హైకోర్ట్.
LRS Amendment: LRS సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
LRS సవరణ ఉత్తర్వులు..
-రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రుసుము వసూలు
-2015 నాటి lrs స్లాబ్ లతో క్రమబద్ధీకరణ రుసుం.
-చ. గజం మార్కెట్ ధర. మూడు వేల వరకు 20శాతం క్రమబద్ధీకరణ రుసుం.
-రూ.3001 నుంచి 5 వేల వరకు 30 శాతం క్రమబద్ధీకరణ రుసుం.
-రూ.5001 నుంచి పదివేల వరకు 40 శాతం క్రమబద్దీకరణ రుసుము
-రూ. 10,001 నుంచి 20 వేల వరకు 50 శాతం క్రమబద్దీకరణ రుసుము.
-₹20,001 నుంచి 30 వేల వరకు 60 శాతం క్రమబద్దీకరణ రుసుము.
Nirmal District updates: బైంసా పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
నిర్మల్ జిల్లా..
-తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మర్వో కార్యాలయం పై జాతీయ జెండాను అవిష్కరించడానికి యత్నించిన. బిజెపి కార్యకర్తలు..
-అడ్డుకున్న పోలీసులు
-ముప్పై మంది బిజెపి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
C Venkat Reddy: నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనది: చాడ వెంకట రెడ్డి..
చాడ వెంకట రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
-నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనదని, చట్టం ఆమోదం పొందే ముందు తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.
-విద్యుత్ సవరణ చట్టాన్ని అభిప్రాయ సేకరణ నిమిత్తం అందరికీ పంపారు...
-చాలా పార్టీలు తమతమ అభిప్రాయాలను వ్యక్తపరచాయి...
-అలాగే తెలంగాణ శాసనసభలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీర్మానం చేస్తే తప్పేమిటని సిపిఐ ప్రశ్నిస్తుంది...
-ఈ విద్యుత్ సవరణ చట్టం వలన రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు....
-ప్రజల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుంది....
-అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని సమర్ధిస్తుంది...
-ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఐ విజ్ఞప్తి...
Guntur updates: హిందూ దేవాలయాల పై దాడులు జరగడాన్ని నిరసిస్తూ టిడిపి ధర్మపోరాట కార్యక్రమం..
గుంటూరు...
-విధ్యానగర్ సాయిబాబు గుడి వద్ద నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,టిడిపి నేతలు.
-మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్...
-కులాలను మతాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.
-పదహారు నెలల్లో అనేక దేవాలయాల పై దాడులు జరిగాయి.
-లౌకకి వాదానికి విఘాతం కలిగించేలా పాలన చేస్తున్నారు...
-తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారు.
-దాడుల పై దేవాదాయ శాఖ మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
-మతత్వాన్ని రెచ్చగొట్టేందుకే రధం వివిధ కారణాలతో కాలిపోయిందని చెప్తున్నారు.
-ప్రతి పండగకు దుర్గ గుడిలో రధం బయటకు తీస్తారు.
-అలాంటిది రధం సింహాలు మాయమయ్యాయి.
-దాచిన సింహాలను బయటకు తీయాలి.
-ఇన్సూరెన్స్ వస్తుందని మంత్రి మాట్లాడడం అన్యాయం.
-ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదు.
-ముఖ్యమంత్రి స్పందించకుంటే హిందూ మతాన్ని అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే భావన వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
Hyderabad Latest news: జియాగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సందర్శించిన కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతలు....
-బట్టి విక్రమార్క..
-అక్కడి పరిస్థితి అడిగి తెలుసుకున్న బట్టి...
-జియాగూడ నుంచి గోడ కి కబర బయలుదేరిన నేతలు.
-మాకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చూపిస్తామన్నారు... జియాగూడ లో పాత లబ్ధిదారులు పోను 270 మాత్రమే చూపారు..
-ఈరోజు కొన్ని ప్రాంతాలు చూపే రేపు మరికొన్ని ప్రాంతాల్లో చూపిస్తామని అంటున్నారు.
Telangana Latest news: భారతదేశంలో విలీనం కోసం ఆనాడు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాలు చిరస్మరణీయం":జి. కిషన్ రెడ్డి..
జాతీయం..
- జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
-హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం సందర్భంగా, శ్రీ సోయం బాపురావు, శ్రీ వివేక్ లతో కలిసి నా నివాసంలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించాను.
Warangal District updates: తెలంగాణా విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయని రాజేందర్ ఆధ్వర్యంలో డీసీసీ భవన్ లో జాతీయ జండా ఆవిష్కరణ..
వరంగల్ అర్బన్..
-తెలంగాణ విమోచన దినం సందర్భంగా బీజేపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయం-లో జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మా..
-పాల్గొన్న కార్యకర్తలు..
Mahabubabad District updates:తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగాజాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్...
మహబూబాబాద్ జిల్లా...
-తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లో బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండాను ఎగురవేసిన, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్...