C Venkat Reddy: నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనది: చాడ వెంకట రెడ్డి..
చాడ వెంకట రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
-నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనదని, చట్టం ఆమోదం పొందే ముందు తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.
-విద్యుత్ సవరణ చట్టాన్ని అభిప్రాయ సేకరణ నిమిత్తం అందరికీ పంపారు...
-చాలా పార్టీలు తమతమ అభిప్రాయాలను వ్యక్తపరచాయి...
-అలాగే తెలంగాణ శాసనసభలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీర్మానం చేస్తే తప్పేమిటని సిపిఐ ప్రశ్నిస్తుంది...
-ఈ విద్యుత్ సవరణ చట్టం వలన రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు....
-ప్రజల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుంది....
-అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని సమర్ధిస్తుంది...
-ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఐ విజ్ఞప్తి...