Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-17 01:18 GMT
Live Updates - Page 3
2020-09-17 06:04 GMT

Telangana updates: తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు...

ప్రొ,, కోదండరాం

-తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు...

-తెలంగాణ జన సమితి తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుతోంది..

-ఉద్యమ సమయంలో జేఏసీ గా ఉన్నప్పుడే సెప్టెంబర్17 ను ఎలా చూడాలి అన్నప్పుడు విలీన దినోత్సవం గా జరుపుకోవాలని ఆరోజు అందరం నిర్ణయించాం..

-హైదరాబాద్ భారతదేశం లో అప్పటి పరిస్థితి ల వల్ల ఆలస్యంగా విలీనం జరిగింది...

-పోలీస్ చర్య వల్ల మాత్రమే హైదరాబాద్ విలీనం జరగలేదు అంతకుముందే ఇక్కడ బలమైన ప్రజా ఉద్యమాలు జరిగాయి...

-విలీనం తరువాత కూడా ప్రజా పోరాటాలు జరిగాయి తదనంతరం ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు..

2020-09-17 06:00 GMT

Bhatti Vikramarka: రేపు మీ ఇంటికి వచ్చి తీసుకెళతామని సవాల్ చేసిన తలసాని...

బట్టి విక్రమార్క ఇంటి వద్ద హైడ్రామా....

-నిన్న అసెంబ్లీ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పై సవాలు విసురుకున్నా బట్టి తలసాని... హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని...   అసెంబ్లీలో తెలిపిన తలసాని... లేదు అని వాదించిన బట్టి...

-బట్టి ఇంటికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రామ్మోహన్...

-సాదరంగా ఆహ్వానించిన బట్టి విక్రమార్క.

2020-09-17 05:53 GMT

Telangana Latest news: విలీన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు..

తెలంగాణ..

-విలీన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,   ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు,ఉత్తమ్

-సెప్టెంబర్ 17 కి బీజేపీ..mim కి సంబంధం లేదు

-కానీ బీజేపీ మతపరమైన రాజకీయం చేస్తున్నాయి

-బీజేపీ..mim పాత్ర ఏముంది

-తెలంగాణ ఇచ్చింది... హైదరాబాద్ సంస్థాన విలీనం లో అయినా కాంగ్రెస్ కే సంబంధం

 -తెలంగాణ వచ్చిన తర్వాత..కల్వకుంట్ల కుటుంబం దే పెత్తనం

-దళితున్ని సీఎం చేస్తా అని మాట మార్చారు కేసీఆర్

-కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యం తో పని చేయాలి

 -దుబ్బాకలో గెలిచేలా ప్రణాళిక వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవ్వాలి

2020-09-17 05:47 GMT

Telangana updates: - తెలంగాణ కు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఇదే: లక్ష్మణ్ మాజీ అధ్యక్షుడు..

-లక్ష్మణ్ మాజీ అధ్యక్షుడు..

- ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దారుణం.

- సెప్టెంబర్17 ను అధికారికంగా నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్ వెనుక ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు.

- నిజం నుండి తెలంగాణ స్వేచ్ఛ వాయువు పిలిచిన ఈరోజున తెలంగాణ విమోచన దినంగా జరపాలని కోరుతున్నాము.

- ఆనాడు భారత దేశంలో హైదరాబాద్ విలీనం కాకుంటే ఒస్మానిస్తాన్ గా మారేది.

2020-09-17 04:32 GMT

Telangana updates: భారతదేశం లో హైదరాబాదు విలీన దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన కేటిఆర్..

-భారతదేశం లో హైదరాబాదు విలీన దినోత్సవం ను పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగుర వేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి,పార్టి   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, హాజరైన రాష్ట్రలు హోం మంత్రి మహముద్ అలి,

-మంత్రి పువ్వాడ అజయ్, మేయర్ బొంతు రామ్మోహన్,విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ..నివాస రెడ్డి, నారాదాసు లక్ష్మణ రావు,

-టిఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కార్యకర్తలు, నాయకులు.

2020-09-17 04:25 GMT

Peddapalli district updates: సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేసిన బిజెపి శ్రేణులు..

పెద్దపల్లి జిల్లా :

-సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేసిన బిజెపి శ్రేణులు, తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని   డిమాండ్

-సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ   జెండా ఎగరవేయడానికి ప్రయత్నించిన బిజెపి నాయకులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

2020-09-17 04:19 GMT

Sangareddy district updates: భారీ వర్షాలతో పుల్కల్ మండలం: సింగూర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

సంగారెడ్డి జిల్లా..

-ఇన్ ఫ్లో 45,282 క్యూసెక్కులు..

-ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులు,

-ప్రస్తుత నీటిమట్టం 8.520 టియంసిలు,

-పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టియంసిలు,

-మిషన్ భగీరతకు 40 క్యూసెక్కులు ఈ వప్ ద్వారా 60, క్యూసెక్కులు ఔట్ ఫ్లో పంపిణీ జరుగుతుంది..

-నిన్న ఒక్క రాత్రే 4 టీఎంసీలు వరద జలాలు సింగూరు జలాశయం లోకి వచ్చి చేరాయి.

- జహీరాబాద్ మండలం సత్వర్ గ్రామంలో విషాదం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వరద లో గల్లంతు ఇద్దరి మృతదేహం లభ్యం,మృతులు ఏర్పుల రాజు,    మరొకరు హద్నూర్ రాజులు గా గుర్తింపు..

2020-09-17 04:14 GMT

Nirmal district updates: నిర్మల్ జిల్లా కుబీర్ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..

నిర్మల్ జిల్లా..

-ఖానాపూర్,కడెం మండల కేంద్రంలలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా ప్రకటించాలని జాతీయ జెండాను ఎగురవేసిన   బిజెపి మండల అధ్యక్షులు,నాయకులు....

-గ్రామపంచాయితీ కార్యాలయం పై జాతీయ జెండాను అవిష్కరించిన. బిజెపి కార్యకర్తలు..

-జాతీయ. జెండాను క్రిందికి దించిన పంచాయితీ కార్యదర్శి, టిఅర్ ఎస్ కార్యకర్తలు..

-పంచాయితీ కార్యదర్శి తీరుపై మండిపడుతున్నా బిజెపి నాయకులు..

2020-09-17 04:10 GMT

Adilabad district updates: నేరడిగొండ సిని హీరో అల్లు అర్జున్ కుంటాల జలపాతం సందర్శన పై పోలీసులకు పిర్యాదు..

ఆదిలాబాద్ జిల్లా..

-కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జలపాతం సందర్శించారని పోలీసులకు పిర్యాదు చేసిన సమాచార హక్కు సాదన స్రవంతి ప్రతినిధులు..

-సందర్శనకు అనుమతులు ఉన్నాయా అనే ఆంశం పై విచారణ జరుపుతున్నా పోలీసులు..

2020-09-17 04:04 GMT

Kamareddy district updates: జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాలకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు: జిల్లా కలెక్టర్ శరత్..

కామారెడ్డి :

-ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 73829 28649,73829 29350 నంబర్లకు ఫోన్ చేయాలని 24 గంటల పాటు సహాయ కేంద్రం పనిచేస్తుంది..

-ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్ కు కామారెడ్డి ఆర్డీవో గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ శరత్ ఉత్తర్వులు.

Tags:    

Similar News