Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-17 02:07 GMT
Live Updates - Page 3
2020-08-17 12:46 GMT

ఆ ఘటనలో పోలీసులకు కోర్టులో ఎదురు దెబ్బ

విజయవాడ: స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో పోలీసులకు కోర్టులో ఎదురు దెబ్బ

నిందితుల కష్టడీ పిటీషన్ ను కొట్టేసిన మూడవ మెట్రోపాలిటన్ ఛీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు

తనమీద నమోదు చేసిన కేసుపై, హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన రమేష్



2020-08-17 12:41 GMT

సీఎం రాజ్యాంగ ఉల్లంఘ‌న‌‌కు పాల్ప‌డుతున్నారు: టీడీపీ మాజీ ఎమ్మేల్యే

విజయవాడ: గుమ్మడి కాయలు దొంగ ఎవ్వ రు అంటే తడుముకున్నట్టు వుంది అంబటి వైఖరి

దొంగే దొంగా దొంగా అన్న విధంగా అంబటి వ్యాఖ్యలు వున్నాయి

రాష్ట్రం లో అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం.. కక్ష సాధింపు కోసం వాడుకొంటుంది

రాష్టం లో మా ఫోన్లు ఎప్పటినుండో ట్యాప్ చేసి వింటున్నారు

ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఫోన్లు ట్యాప్ చేసి వింటున్నారు ఇది ఇప్పుడు బైటపడింది

జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేయబట్టే ప్రధానికి లేఖ  - టీడీపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా

2020-08-17 11:13 GMT

ప్రకాశం: ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి లో దారుణం... చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి బదులుగా వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది.... ఖలీల్ డెడ్ బాడీ ఇది కాదంటూ ఆందోళనకు దిగిన బంధువులు


2020-08-17 11:13 GMT

గుంటూరు ః...


పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరు ఎస్సీ మహిళలు ఆందోళన..


జగనన్న చేయూత పథకానికి అర్హులైన ఎస్సీ మహిళలను టిడిపి వారంటూ తొలగింపు..


పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తామని ఇలా పార్టీ పేరుతో తొలగించటం అన్యాయం అంటూ మహిళ ఆవేదన..


వాలెంటీర్ పై తగు చర్యలు తీసుకుని చేయూత పథకానికి అర్హులైన మహిలందరికీ న్యాయం చేయాలంటూ మండల అధికారులకు వేడుకోలు.


2020-08-17 11:13 GMT

అమరావతి....

ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి కోసం రోడ్లెక్కండి అంటూ హైదరాబాద్ ఇంటిపట్టున ఉండి చెప్తున్నాడు జూమ్ బాబు.

కొరోనాకు భయపడి తన ఇంటికి పార్టీ సీనియర్ నాయకులను కూడా రానివ్వడం లేదు.

నాయకుడంటే ముందుండి నడపాలి బాబు. ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారాకాదు.

2020-08-17 11:12 GMT

విజయవాడ


మిల్క్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న చనుమోలు వెంకటరావు ప్లై ఓవర్‌ బ్రిడ్జి పాడైన రోడ్డును పరిశీలించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌


బ్రిడ్జి వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు జారీ చేస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..


2020-08-17 11:12 GMT

విశాఖ :

ఎస్ రాయవరం తాహశీల్దార్ కార్యాలయం వద్ద పోలవరపు రమణ అనే రైతు ఆత్మహత్యా యత్నం.

భూ వివాదంలో అధికారులు అక్రమాలకు పాల్పాడ్డారు అంటూ ఆరోపణలు. .

తాహిశీల్థార్ ప్రమేయంతో ఆత్మహత్య యత్నం ను అడ్డుకున్న స్థానికులు...

పిర్యాదు చేస్తే విచారణ చేసి న్యాయం చేస్తామని బాదితుడికి హామీ ఇచ్చిన తహసిల్దార్..

2020-08-17 11:12 GMT

అమరావతి


నరహరి వరప్రసాద్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు


పది లక్షలిస్తానని చెప్పి, వరదల పాలు చేశాడు


గోదావరి వరద ఉధృతితో పోలవరం ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు తిండితిప్పలు లేకుండా అల్లాడుతున్నారు.


చలికి వణుకుతూ, చెట్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకునే దుస్థితికి వారు దిగజారినా జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహయక చర్యలు చేపట్టలేదు.


ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10లక్షలిస్తానని చెప్పిన జగన్, ఇంతవరకు ఇవ్వలేదు.


కేంద్ర ప్రభుత్వ బలగాల సాయంతో రాష్ట్రప్రభుత్వం వారిని తక్షణమే కాపాడాలి.


తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆర్థికసాయాన్ని అవహేళన చేసిన జగన్, రూ.10లక్షలిస్తానని చెప్పి వారిని మోసగించాడు.


వరదల పాలైన ప్రతి కుటుంబానికి వెంటనే రూ.10వేలు చెల్లించాలి.


2020-08-17 10:06 GMT

గుంటూరు ః..


వినుకొండ లో మైనర్ బాలిక పై అత్యాచారం.


9 వ తరగతి బాలిక పై మాదవరపు గోపినాధ్ అనే యువకుడు అత్యాచారం.


గోపినాధ్ తల్లి బాలిక ను బలవంతంగా గదిలోకి పంపినట్లు ఫిర్యాదు.


గోపినాధ్, అతని తల్లిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న పోలీసులు.


2020-08-17 10:05 GMT

తూర్పుగోదావరి :


దేవిపట్నం..


దేవిపట్నం మండలం చిన్నరమణయ్యపేటలో వరద పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ..


హెచ్ఎంటివితో ఎస్పీ నయీం అస్మీ,


మూడవ ప్రమాద హెచ్చరిక పై అప్రమత్తం చేశాము, ఏజెన్సీలో 23 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాం..


రెండు మూడు రోజుల్లో మరింత వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి..


ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద వస్తుంది, మహారాష్ట్ర చత్తీస్ ఘఢ్ ల ను ఎక్కువ మోతాదులో వరద వస్తోంది..


రెండు రోజుల్లో 50 గ్రామాలను ఖాళీ చేయిస్తాం.. రెవెన్యూ, పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం,.


ఎటపాక, రంపచోడవరం, కోనసీమల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి,.


గ్రామ వలంటీర్లు ముంపు గ్రామాల ప్రజలను తరలించే క్రమంలో కీలకంగా పని చేస్తున్నారు..


ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిధ్ధంగా ఉన్నాము..


Tags:    

Similar News