తూర్పుగోదావరి :... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తూర్పుగోదావరి :
దేవిపట్నం..
దేవిపట్నం మండలం చిన్నరమణయ్యపేటలో వరద పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ..
హెచ్ఎంటివితో ఎస్పీ నయీం అస్మీ,
మూడవ ప్రమాద హెచ్చరిక పై అప్రమత్తం చేశాము, ఏజెన్సీలో 23 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించాం..
రెండు మూడు రోజుల్లో మరింత వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి..
ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద వస్తుంది, మహారాష్ట్ర చత్తీస్ ఘఢ్ ల ను ఎక్కువ మోతాదులో వరద వస్తోంది..
రెండు రోజుల్లో 50 గ్రామాలను ఖాళీ చేయిస్తాం.. రెవెన్యూ, పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం,.
ఎటపాక, రంపచోడవరం, కోనసీమల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి,.
గ్రామ వలంటీర్లు ముంపు గ్రామాల ప్రజలను తరలించే క్రమంలో కీలకంగా పని చేస్తున్నారు..
ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిధ్ధంగా ఉన్నాము..
Update: 2020-08-17 10:05 GMT