Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-17 02:07 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-17 17:13 GMT

నెల్లూరు స్క్రోలింగ్స్: జిల్లాలో కొనసాగుతున్న కరోనా విలయం..

కొత్తగా 481 మందికి సోకిన మహమ్మారి మరో ఇద్దరు బలి.

ఇప్పటి వరకు జిల్లాలో 18,164కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

2020-08-17 17:10 GMT

తిరుపతి: తిరుమల విజిలెన్స్, నిఘాభద్రతా విభాగంలో ఎవియస్ ఓ వి మహేశ్వరరావు కన్నుమూత

కరోనాతో చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ మృతి

2020-08-17 17:08 GMT

విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు

1.25లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు

7వేల క్యూసెక్కుల నీరు కాలువలకు వదులుతున్నారు

రేపు ఉదయానికి కృష్ణానది వరద తగ్గే అవకాశం

2020-08-17 16:53 GMT

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ డిజిపి లేఖ. 

మీరు ఈ రోజు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో పేర్కొన్న ఫోన్ టాపింగ్ వంటి పలు అంశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఎటువంటి సాక్ష్యాధారాలలైన ఉంటే మాకు అందజేయగలరని కోరుతున్నాను..

రాష్ట్రంలోని పౌరులకు రక్షణ కల్పించడం, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా దృడ సంకల్పంతో ఉన్నామని తమరికి తెలియజేస్తున్నాను

మాకు పూర్తిస్థాయిలో సహకరించి పౌరుల హక్కులను కాపాడేందుకు, రూల్ ఆఫ్ లా ను అమలు పరచేందుకు సహకరించగలరని కోరుతున్నాను

2020-08-17 16:31 GMT

అమరావతి: ట్విట్టర్ లో సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

దొంగే... దొంగా.. దొంగా అని అరిస్తే ఎలా ఉంటుందో తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయంటూ చంద్రబాబుగారు చేస్తున్న ఆరోపణలు కూడా అలానే ఉన్నాయి.

తాను అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు.

వీటి ఆధారాలను కోర్టులకీ ఇచ్చాం.

ప్రజల్లోనుంచి వచ్చిన నాయకుడు కాదుకాబట్టి కుట్రలుచేయడం, క్యాంపు రాజకీయాలు నడపడం, అడ్డదారుల్లో నడవడం బాబుగారికి అలవాటు.

జగన్ గారిది ముక్కుసూటి రాజకీయం.

ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం.ఏంచేసినా రాజమార్గమే.

2020-08-17 15:57 GMT

 విజయవాడ: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ అరుణకుమారి

- సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల

- cfw.ap.nic.in పోర్టల్ లో జాబితా (http://cfw.ap.nic.in/index.html

- అభ్యంతరాలున్న వారు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలి, ఏపీ లో 

2020-08-17 15:28 GMT

విజయవాడ: మాజీమంత్రి అచ్చెన్నాయుడు ను ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు

రమేష్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ కరోనా పాజిటివ్ బారిన పడ్డ అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి పై నివేదిక సమర్పించిన రమేష్ ఆసుపత్రి

రిపోర్ట్ ఆధారంగా ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి అని హైకోర్ట్ ఆదేశం

2020-08-17 15:24 GMT

అనంతపురం : తాడిపత్రి లో విషాదం.

మానస దాల్ మిల్ & పోర్ మిల్ లో ప్రమాదవశాత్తు మిషన్ లో పడి శమీన్( 34) అనే వివాహిత మృతి.

భార్య మృతదేహం చూసి గుండె ఆగి చనిపోయిన భర్త జిలాన్ భాష.

తల్లిదండ్రుల మరణం తో అనాథలు గా మారిన పిల్లలు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

2020-08-17 14:39 GMT

తూర్పుగోదావరి : మామిడికుదురు మం. పెదపట్నం వద్ద గోదావరి ప్రధాన కరకట్ట నుంచి వరదనీరు లీకేజీ..

గండి పడుతోందన్న భయాందోళనలలో కరకట్ట దిగువన ఉన్న గ్రామాల ప్రజలు..

వైనతేయ పాయ కుడివైపు 9.8 కిలోమీటర్ వద్ద కరకట్ట లీకేజీ..

ఇసుక బస్తాలతో లీకేజ్ ను అరికట్టేందుకు యత్నిస్తున్న స్థానికులు ఇరిగేషన్ అధికారులు..

లీకేజ్ జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు..

2020-08-17 14:37 GMT

గుంటూరు: అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం గ్రామంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ..

పోలంగట్టు వివాదం లో వాలంటీర్‌ మరోవర్గం వివాదం...

సముదాయించడానికి వచ్చిన వారిపై రాళ్ళదాడి....

ముగ్గురుకి తీవ్రగాయాలు,సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు...

Tags:    

Similar News