East Godavari updates: పిఠాపురం పదవ శక్తిపీఠం పాదగయా క్షేత్రం వద్ద టిడిపి నేతల నిరసన..
తూర్పుగోదావరి :
మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ..
-హిందు దేవాలయాలపై దాడులకు నిరసనగా ఆందోళనలో పాల్లొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ..
-రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, దేవతా మూర్తుల ధ్వంసం కేసులను సీబీఐ తో దర్యాప్తు చేయించాలి..
-దేవాలయాల పై దాడులు, వాటి ఆస్తుల కబ్జాలు పెరిగిపోయాయి..
-పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం కేసును తప్పుదారి పట్టించారు..
-ఆలయాల వద్ద భద్రత ఏర్పాటు చేయాలి..
GVL Narasimha Rao Comments: ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లుపై మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు..
జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ..
-ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందింది
-గత ఆరేళ్ల కాలంలో ఈ రంగం 118% శాతం పురోగతిని సాధించింది
-యూపీఏ-2 హయాంలో 54% శాతం మాత్రమే పురోగతి ఉంది
-దేశీయ విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది
-అంతర్జాతీయ విమానయానంలో 4-5 స్థానాల్లో ఉంది
-శరవేగంగా విమానయానం పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది
-వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం ర్యాంకింగ్ 65 నుంచి 34కు ఎగబాకాం
-విమానయానం దేశప్రజలకు అందుబాటు ధరలో, సురక్షిత, ఆనందదాయక ప్రయాణం కావాలని ప్రధాని ఆకాంక్ష
-ఉడాన్-ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్ పేరుతో సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేసేలా పథకం అమలవుతోంది
-విజయవాడ-కడప మార్గంలో కేవలం రూ. 800 చెల్లించి నేను ప్రయాణం చేయగలిగాను
-థర్డ్ ఏసీ ట్రైన్ ధరతో విమానప్రయాణం చేయగలిగే పరిస్థితి ఏర్పడింది
-2024 నాటికి మరో 100 విమానాశ్రయాలను అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం
AP MLA Anil Kumar: తప్పు చేశారు కాబట్టే.. భయపడుతున్నారు: మంత్రి అనిల్ కుమార్
అమరావతి: అమరావతిలో ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పై నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేశాయి..
అమరావతి విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యింది..
సబ్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చాం.. ఏసీబీ విచారణ ప్రారంభం అయింది..
ఎవరెవరు అవినీతి చేశారో అందరి పేర్లు ఉంటాయి..
తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ వెయ్యమని కేంద్రానికి లేఖ రాయండి..
ఏ విచారణ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేష్ కు లేదు..
తప్పు చేశారు కనుకే టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు..
మేము సీబీఐ వెయ్యలని కేంద్రాన్ని కోరాం.. విచారణలో అన్ని తేలుతాయి..
తప్పు చేసినవారి పేర్లు అసెంబ్లీ లో బుగ్గన చదివి వినిపించారు..
సినీ పరిశ్రమలో అందరూ డ్రగ్స్ వినియోగించరు: రవి కిషన్, బీజేపీ ఎంపీ
జయబచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ (నటుడు) రవికిషన్
నా వ్యాఖ్యలను జయాబచ్చన్ సమర్థిస్తారని అనుకున్నాను.
పరిశ్రమలో అందరూ డ్రగ్స్ ఉపయోగించడం లేదు.
కానీ డ్రగ్స్ వినియోగించేవారు బాలీవుడ్ సినీ పరిశ్రమను అంతం చేయాలన్న ప్రణాళికతో ఉన్నారు
నేను, జయాబచ్చన్ పరిశ్రమలోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావు
ఇప్పుడు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది: 👆 రవి కిషన్, బీజేపీ ఎంపీ (రేసుగుర్రం ఫేమ్ మద్దాలి శివారెడ్డి)
Vijayawada updates: కోవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు లేవు....సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు..
విజయవాడ..
రౌండ్ టేబుల్ సమావేశం..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మధు
-కేసులు పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది
-ప్రభుత్వం అన్ని ప్రైవేటు వైద్య సంస్ధల సహకారం తీసుకోవాలి
-వైద్యరంగాన్ని ఎమర్జెన్సీగా ప్రకటించాలి
-సిబ్బందిని అవసరమైనంత వరకూ ప్రభుత్వం నియమించడం లేదు
-గుంటూరు జిల్లా కలెక్టర్ విధానాలు సరిగా లేవు
-విధానాలపై ప్రశ్నించిన డాక్టర్ ని సస్పెండ్ చేసి స్టేషనుకు తీసుకెళ్ళారు గుంటూరు జిల్లా కలెక్టర్
-సీపీఎం కార్యాలయాలన్నీ ఐసొలేషన్ కేంద్రాలుగా వినియోగించమని కోరాం
-21 నుంచీ సినిమాహాళ్ళు, విద్యాలయాలు ప్రారంభించడంతో మరిన్ని కోవిడ్ కేసులు వస్తాయి
Ambedkar Statue: విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
అమరావతి: విజయవాడ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్‌మైదాన్‌లో 125 అడుగుల బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు – పార్క్ అభివృద్ది మాస్టర్ ప్లాన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష
పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్, ఇరిగేషన్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు
MOdi Birthday celebrations: ఏడు రోజుల పాటు మోడీ జన్మదిన కార్యక్రమాలు
గుంటూరు: ప్రధాన మంత్రి మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మొక్కలు నాటిన బిజెపి నేతలు.
- లాడ్జి సెంటర్ లో మొక్కలు నాటిన బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ,బిజెపి నేతలు.
- ప్రధాని మోడీ డెబ్బైవ జన్మదినం సందర్భంగా మొదటి రోజు దివ్యాంగులకు అవసరమైన వస్తువులను అందించాం.
- పర్యావరణ పరిరక్షణ,పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
- ఏడు రోజుల పాటు బిజెపి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
- సేవా సప్తాహ కార్యమానికి పార్టీ పిలుపు నివ్వడం మంచి పరిణామం..
Amaravati updates: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు..
అమరావతి..
-రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భాగస్వామి అయ్యారన్న ఏసీబీ
-భూముల కొనుగోళ్లలో ఏజీగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అబియోగం
-పదవిని అడ్డుపెట్టుకుని బంధువులకు భూములిప్పించారని ఏసీబీ కేసు
-2015, 2016లో రాజధానిలో భూములు కొన్నట్లు ఏసీబీ అభియోగాలు
-తన పేరిట, భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ భూముల కొనుగోళ్లు
-ఇప్పటికే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన దమ్మాల పాటి
Srisailam Project Updates: శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,09,970 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 25,242 క్యూసెక్కులు హుంద్రి నుండి 2000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరిక
- 9 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,50,614 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల
- టోటల్ ఇన్ ఫ్లో 1,37,212 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో 3,00,000 క్యూసెక్కులు
- Ap పవర్ హౌస్ 30474క్యూసెక్కుల
- స్పిల్ వే(9×10) 2,50,614క్యూసెక్కుల
- పోతిరెడ్డిపాడు 16,583క్యూసెక్కుల
- హంద్రినివా 1688క్యూసెక్కుల
- కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 800 క్యూసెక్కుల
- ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులు
- పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు
- ప్రస్తుత నీటి నిల్వ 212.9198 టిఎంసిలు.
Weather Updates: కోస్తాంధ్రకు వర్ష సూచన
వెదర్ అప్ డేట్
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో “తీవ్ర అల్పపీడనం”
- దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం...
- ఇది ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి వుంది...
- వీటి ప్రభావంతో కోస్తాంధ్ర లో వర్షాలు...
- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు
- మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు