Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-15 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-15 12:33 GMT

-టి. కృష్ణాబాబు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ

-చర్చలు బస్సులు నడవడం పై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధం

-ఇద్దరు ఎండీల సమావేశం జరిగింది. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.

మా సూచనలు చెప్పాము.

రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ రన్ చేసింది.

విభజన తరువాత 2.65 కిలోమీటర్లకు తగ్గించం.

71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుంది.

1.1లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది.

మేము 50 వెల కిలోమీటర్లు తగ్గుస్తాం. మీరు పెంచండి అని తెలంగాణ వాళ్ళను కోరాం.

1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వెల కిలోమీటర్లు వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చింది.

అంతకు మించి పెంచే సామర్ధ్యం మాకు లేదు. లాభదాయకంగా వుండదని తెలంగాణ చెబుతోంది.

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉంది.

ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదు.

మేము ప్రపోజల్ ఇచ్చాము.

ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయో చూడాలి. మరోసారి మీటింగ్ కావాలని భావిస్తున్నాము.

70 వేళా కిలోమీటర్లు మేర 260, 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని భావించము.

సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రయివేట్ కు లాభం చేకూరుతుంది.

2020-09-15 12:19 GMT

-జాతీయ విద్యా విధానం–2020 పై సానుకూల స్పందన

-5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4 విధానం అమలుకు సూత్రప్రాయ నిర్ణయం

-విద్యా రంగంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి

-స్కూళ్లు, కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి, లేని పక్షంలో కఠినచర్యలు

-గ్రామ, వార్డు సచివాలయాల సేవలూ వినియోగించుకోవాలి

-ఆ మేరకు అవసరమైన విధి, విధానాలతో ఎస్‌ఓపీ

-దాంతో పాటు, అవసరమైన యాప్‌ రూపొందించాలి

-సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

-వచ్చే విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం

-ఇందుకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ

-ఉపాధ్యాయులకూ శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి

-విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా బదిలీలు

-ఉపాధ్యాయుల ‘రీ అపోర్షన్‌మెంట్‌’ కు సీఎం ఆదేశం.

2020-09-15 12:01 GMT

అమరావతి..

-విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర,

-పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు,

-హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి,

-ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డితో పాటు,

-విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు.

2020-09-15 11:35 GMT

అమరావతి..

నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి..

-వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు   తెరపైకి తెచ్చారు.

-విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు చేసిన భూములపై ఎందుకు విచారణ జరపడం లేదు?

-టీడీపీపై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.

-సీఆర్డీఏ హద్దులకు ఆవలఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములని విషప్రచారం చేస్తున్నారు.

2020-09-15 10:56 GMT

అమరావతి...

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.....

-అమరావతి పెద్ద స్కాం అని మేము ముందునుండీ చెప్తున్నాం..

-అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది..

-బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు..

-ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది..

-ఈ భారీ కుంభకోణంలో త్వరలోనే ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయి..

-చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారు..

-ఈ స్కాం పై సీబీఐ విచారణ వెయ్యమని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది..

-తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరండి..

-తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదు..?

-ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీ లకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్లు స్కాం కు పాల్పడ్డారు..

-ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి..

-24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టే..

2020-09-15 10:47 GMT

కర్నూల్ జిల్లా..

-ఆస్పరి భూముల వివాదం పై మంత్రి గుమ్మనూర్ జయరాం కామెంట్స్...

-ఆస్పరిలో భూములు కొన్నమాట వాస్తవం

-మంజునాథ అనే వ్యక్తి నాకు భూములు అమ్మాడు.

-ఆలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో విచారించగా క్లియర్ టైటిల్ అనటంతో భూములు కొన్నాను .

-నేను దౌర్జన్యం చేయలేదు.నా జీవితంలో కబ్జా చేయటం అలవాటు లేదు.

-నాపై ఆరోపణలు చేసిన మను అనే వ్యక్తి మంజునాథ్ లు బాబాయ్ అబ్బాయిలు

-ఆరోపణలు చేసిన మను అనే వ్యక్తి నన్ను కలిసాడు..విచారణ జరిపించి న్యాయం చేస్తానని చెప్పాను

-టిష్యూ పేపర్లో వచ్చే వార్తలు పట్టించుకోనవసరం లేదు

-అసత్య ఆరోపణలు చేస్తే పరువు నష్ఠం దావా వేస్తాను

-నన్ను కబ్జా దారుడని నిరూపిస్తే ...రాజకీయ సన్యాసం తీసుకుంటాను

2020-09-15 10:37 GMT

కర్నూలు...

-పాములపాడు(మం) చెలిమిల్ల,ఇస్కాల గ్రామాలలోని ముంపుకు గురైన కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లాఎస్పీ        పకీరప్ప..

-కొత్తపల్లి మండలంలోని పలు ముంపు ప్రాంతాలను, వరద ఉధృతికి తెగిపోయిన గువ్వల గుంట్ల చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే       ఆర్థర్, జిల్లాఎస్పీ పకీరప్ప..

2020-09-15 10:37 GMT

కర్నూలు...

-పాములపాడు(మం) చెలిమిల్ల,ఇస్కాల గ్రామాలలోని ముంపుకు గురైన కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లాఎస్పీ        పకీరప్ప..

-కొత్తపల్లి మండలంలోని పలు ముంపు ప్రాంతాలను, వరద ఉధృతికి తెగిపోయిన గువ్వల గుంట్ల చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే       ఆర్థర్, జిల్లాఎస్పీ పకీరప్ప..

2020-09-15 10:24 GMT

అమరావతి..

-వంగలపూడి అనిత తెలుగుమహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు

-వైఎస్సార్ ఆసరా కాదు, జగనన్న టోకరా

-ప్రతిపక్షంలో, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను పదేపదే టీడీపీ ఆయనకు గుర్తుచేయాల్సి వస్తోంది.

-అధికారంలోకి వచ్చాక ఏంచేసినా, ఎలా చేసినా అడిగేవాడు లేడన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నాడు.

-చంద్రబాబు హాయాంలో డ్వాక్రా మహిళలకు రూ.5లక్షల వరకు ఉన్న రుణపరిమితిని, రూ.7లక్షలకు పెంచుతానని, ఆమొత్తానికి వడ్డీ లేకుండా చేస్తానని జగన్   తన మేనిఫెస్టోలో చెప్పాడు.

-అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.3లక్షలకే పరిమితం చేశాడు.

-జగన్ ఇస్తున్న సొమ్ము డ్వాక్రామహిళలు చెల్లిస్తున్న వడ్డీకే సరిపోవడం లేదు.

-ప్రభుత్వం ఇస్తున్న ఆసరా సొమ్ముతోనే మహిళలంతా బతుకుతున్నట్లు వైసీపీ నేతలు నృత్యాలు చేస్తున్నారు.

-దిగజారుడుపార్టీలో ఉంటూ, దిగజారుడుతనానికి మారుపేరైన వైసీపి మహిళానేత తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన చంద్రబాబుని విమర్శించడం కంటే     దిగజారుడుతనం మరోటి లేదు.

-బీజేపీకి భయపడే ప్రభుత్వం అంతర్వేధి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

2020-09-15 10:14 GMT

గుంటూరు ః.....

-నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో పలు కార్యక్రమాలకు అభిమానులు ఏర్పాట్లు.

-కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డంకులు.

-కోడెల తనయుడు శివరాం పోలీసులు నోటీసులు.

-కోవిడ్ నేపద్యంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలులేదని నోటీస్ లో పేర్కొన్న పోలీసులు.

-పోలీసుల తీరు పై కోడెల శివరాం ఆగ్రహం.

Tags:    

Similar News