GVL Narasimha Rao Comments: ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లుపై మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు..
జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ..
-ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందింది
-గత ఆరేళ్ల కాలంలో ఈ రంగం 118% శాతం పురోగతిని సాధించింది
-యూపీఏ-2 హయాంలో 54% శాతం మాత్రమే పురోగతి ఉంది
-దేశీయ విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది
-అంతర్జాతీయ విమానయానంలో 4-5 స్థానాల్లో ఉంది
-శరవేగంగా విమానయానం పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది
-వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం ర్యాంకింగ్ 65 నుంచి 34కు ఎగబాకాం
-విమానయానం దేశప్రజలకు అందుబాటు ధరలో, సురక్షిత, ఆనందదాయక ప్రయాణం కావాలని ప్రధాని ఆకాంక్ష
-ఉడాన్-ఉడే దేశ్ కీ ఆమ్ నాగరిక్ పేరుతో సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేసేలా పథకం అమలవుతోంది
-విజయవాడ-కడప మార్గంలో కేవలం రూ. 800 చెల్లించి నేను ప్రయాణం చేయగలిగాను
-థర్డ్ ఏసీ ట్రైన్ ధరతో విమానప్రయాణం చేయగలిగే పరిస్థితి ఏర్పడింది
-2024 నాటికి మరో 100 విమానాశ్రయాలను అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం