Tirumala updates: టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమనం అమోదం తెలిపిన ప్రభుత్వం..
తిరుమల..
-టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమనం అమోదం తెలిపిన ప్రభుత్వం..
-2019 సంవత్సరానికి సంబంధించిన బ్రహ్మోత్సవ బహుమనం 14000 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
-దాదాపు సంవత్సరం తర్వాత ఆమోదించిన ప్రభుత్వం
Sailajanath Comments: ఇన్ సైడ్ ట్రేడింగ్ అనేది చట్టానికి వ్యతిరేకమా అనేది చట్టం చూస్తుంది..శైలజానాధ్..
విజయవాడ..
ఏపీసీ అధ్యక్షుడు, శైలజానాధ్..
-రాజధాని అనౌన్స్ చేసినప్పుడు జగన్ ఆహ్వానించారు
-రాజధాని భూముల విషయంలో చట్టాన్ని నియంత్రించే పని చేయద్దు
-విశాఖపట్నంలో భూములు లాక్కుంటున్నారని అక్కడి ప్రజలంటున్నారు
-విశాఖపట్నం భూములపై కూడా విచారణ జరపాలి
East Godavari-Peddapuram: గత16 నెలలుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్నదాడులు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.... నిమ్మకాయల చినరాజప్ప..
తూర్పుగోదావరి.. పెద్దాపురం...
-మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...
-వైసిపీ ప్రభుత్వం ఏర్పాటు కాబడినప్పటి నుండి గతించిన 16 నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.
-కానీ ప్రభుత్వం వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది.
-ఈ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ లా & ఆర్డర్ కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైంది.
-ఎక్కడికక్కడ రౌడియిజం... గుండాయిజం పెరిగిపోయాయి. పౌర భద్రత అనేది గాడి తప్పింది.
-రాష్ట్రంలో ఒక సంఘటన మరువకముందే మరో సంఘటన ఆ తరువాత మరో సంఘటన జరుగుతుంది.
-డిజిపి.. ఎవరి దేవాలయాల రక్షణ వారే చేపట్టుకోవాలి..... సిసికెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని చెబుతు చేతులు దులుపుకున్నారు.
-ఎవరి దేవాలయాలు రక్షణ వారే తీసుకోంటే..... మరి ప్రభుత్వ భాద్యత ఏమిటి....? ప్రభుత్వం మత విద్వేష చర్యలపై కఠిన చర్యలు చేపట్టాలి....
Vijayawada updates: కోవిడ్ సమస్యలపై సైంటిఫిక్ పద్ధతిలో మాట్లాడే వారితో ప్రభుత్వం ప్రయత్నించలేదు..ఏపీసీసీ అధ్యక్షుడు..
విజయవాడ..
ఏపీసీసీ అధ్యక్షుడు, శైలజానాథ్
-కరోనా నియమత్రణపై వైద్యరంగ నిష్ణాతులు మాట్లాడితే కేసులు పెడుతున్నారు
-కలెక్టర్లని, పోలీసు అధికారులని కోవిడ్ నియంత్రణకు ఎలా వినియోగిస్తున్నారు
-ప్రభుత్వానికి కోవిడ్ నియంత్రణ చర్యలలో సీరియస్ నెస్ లేదు
-మాటలలో మాత్రమే కోవిడ్ నియంత్రణ జరుగుతోంది
-మొక్క నాటితే కానీ బువ్వ దొరకనివాళ్ళు ఇంట్లో ఉంటే పూట గడవదు
-ఏపీలో ఎంపీలకి కోవిడ్ నెగెటివ్ వస్తే, పార్లమెంటులో కోవిడ్ పాజిటివ్ ఎలా వచ్చింది
-ప్రశ్నిస్తే జైలుకు పంపుతోందీ ప్రభుత్వం
West Godavari updates: HP గ్యాస్ బండల లోడుకు తప్పిన పెనుప్రమాదం..
పశ్చిమగోదావరి జిల్లా..
-పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు లో HP గ్యాస్ బండల లోడుకు తప్పిన పెనుప్రమాదం..
-కరెంట్ స్థంబాని ఢీకొన్న లారీ, టర్నింగ్ సమయంలో స్థంబాని ఢీకొన్న లారీ.. భయాందోళన తో పరుగుల తీసిన జనం
-ఒక్క సరిగా పేలి విద్యుత్ వైర్లతో కుప్పకూలిన 1కెవి ట్రాన్స్ఫార్మర్
-ఫుల్ లోడ్ తో మార్టేరు HP గోడౌన్ కి వెళ్లి వస్తున్న లారీ
-వెంటనే పవర్ సప్లై ఆపడం తో తప్పిన పెనుప్రమాదం ఊపిరిపీల్చుకున్న జనం
-ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు
Vijayawada updates: తెలుగు యువత నాయకుడు నిమ్మగడ్డ సత్యసాయి పై దాడి..
కృష్ణా జిల్లా..
-గుడివాడ ఏలూరు రోడ్డులో ఒక హోటల్ నుండి బయటకు వస్తున్న తెలుగు యువత నాయకుడు నిమ్మగడ్డ సత్యసాయి పై దాడి.
-గత రాత్రి హోటల్లో భోజనం చేసి బయటకు వస్తుండగా సాయి పై దాడి చేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.
-దాడి ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసిన టిడిపి నాయకులు.
Vijayawada Updates: ఇన్సైడ్ ట్రేడింగ్ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు కామెంట్ ని సీపీఎం స్వాగతిస్తుంది..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మధు..
విజయవాడ..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మధు కామెంట్స్..
-కొంతమంది రాజధాని ప్రకటించే ముందే గతంలో దళితుల దగ్గర భూములు కొన్నారు
-దోషులను నిగ్గు తేల్చాలి, దళిత భూములను బలవంతంగా లాక్కున్నారు
-ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ఎంతటి వారున్నా వదలొద్దు
Vijayawada updates: ఇన్సైడర్ ట్రేడింగ్ లో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ..
విజయవాడ..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ
-ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధాని మారుస్తామంటే ఒప్పుకోము
-పోలీసులు ఖాకీ డ్రెస్సులు వేసుకుంది వైసీపీ కి పని చేయడానికా?
-హైకోర్ట్ డిజీపీ పై చేసిన వ్యాఖ్యలకు సీఎం.సమాధానం చెప్పాలి
-ఎక్కడ ఉంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్
-16 నెలల పరిపాలన లో రాష్ట్రలో అరాచక పాలన సాగింది
Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అమరావతి..
-నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
-రైతుల్ని దళారులు నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
-మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
-పుట్టి ధాన్యానికి రూ.8వేలు ధర కూడా లభించడం లేదు.
-పుట్టి ధాన్యానికి రూ.16వేల కనీస మద్దతు ధర కల్పించాలి.
-ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని జగన్ రెడ్డి గారు చెప్తున్న గాలిమాటలు తప్ప, క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం.
Vijayawada updates: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోన నియంత్రణలో విఫలం అయ్యాయి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ..
విజయవాడ..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ
-చప్పట్లు కొట్టండి, కొవ్వుత్తులు వెలిగించండి అని చెప్పారు తప్ప నియంత్రణ చర్యలు తీసుకోలేదు
-కార్పొరేట్ లకు నిదులు కేటాయించారు
-రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందొ లేదో అర్థం కావడం లేదు
-డాక్టర్లు, మెడికల్ సిబ్బంది పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు
-కరోనా కేసుల్లో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందంటే ప్రభుత్వం సిగ్గు పడాలి
-13 జిల్లాలో ఎక్కడ ఆరోగ్య శ్రీ కింద ట్రీట్మెంట్ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి