Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-15 01:49 GMT
Live Updates - Page 5
2020-08-15 07:25 GMT

జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

నారాయణపేట : కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జండాను ఎగురవేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హాజరైన మక్తల్ MLA రాం మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన, SP చేతన మరియు ఇతర జిల్లా అధికారులు.

జోగులాంబ గద్వాల జిల్లా : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జండాను ఎగరవేసిన ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ శృతి ఓజా, జడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు.

వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు.

2020-08-15 07:16 GMT

ఆ ఘ‌ట‌న‌పై.. హెచ్ ఆర్సీ తో పాటు బాలల హక్కుల కమీషన్ సిరియస్...

నిజామాబాద్: మాల్కాపూర్ (ఏ) గ్రామంలో 12ఏళ్ల బాలుడిని సోంత పెద్దనాన్న కాళ్లు,చేతులు కట్టేసి దారుణంగా కొట్టిన ఘటనలో హెచ్ ఆర్సీ తో పాటు బాలల హక్కుల కమీషన్ సిరియస్...

ఈ ఘటనను సుమోటగా తీసుకోని విచారణకు ఆదేశం...

సిపిసిఆర్ యాక్ట్ 2005ప్రకారం కలెక్టర్ నారయణ రెడ్డితో పాటు కార్మిక శాఖ డిప్యూటి కమిషనర్,ఐసిడిఏస్ పీడికి నోటిసులు జారీ...

బాలుడిని చితక బాదిన ఘటనపై ఏలాంటి చర్యలు తీసుకున్నారో తమకు ఈనెల 20లోగా నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ.....

2020-08-15 07:12 GMT

ఇందల్ వాయి హత్య కేసును చేధించిన పోలిసులు.

నిజామాబాద్: ఇందల్ వాయి హత్య కేసును చేధించిన పోలిసులు..

సోంత బార్య తో పాటు అల్లుడు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు తెల్చిన పోలిసులు...

నలుగురు నిందితులు రిమాండ్ కు తరలింపు...

గంగారం కూతురిని గత పిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకున్న రాజు అనే వ్యక్తి...

ప్రేమ పెళ్లి ఇష్టంలేకపోవడంతో అప్పటి నుంచి రాజు పై కోపంతో ఉన్న గంగారం...

ఇదే క్రమంలో మామను హత్య చేయాలని ప్లాన్ చేసిన రాజు...

ఇద్దరు మిత్రులతో పాటు అత్త సహకారం తీసుకున్న రాజు....

గంగారం పోలం దగ్గర ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారం కాపు కాసి హత్య చేసిన అల్లుడు...

హత్యకు స్నేహితులు సహకరించినందుకు 90వేలు ఇచ్చిన రాజు...

2020-08-15 07:09 GMT

మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి... అదికారులు.

2020-08-15 07:07 GMT

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

మహబూబ్ నగర్ జిల్లా:  జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

ఇన్ ఫ్లో: 1 లక్ష 60 వేల క్యూసెక్కులు

ఔట్ ఫ్లో: 1 లక్ష 65 వేల 173 క్యూసెక్కులు.

పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.

ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.571 టీఎంసీ.

పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

ప్రస్తుత నీటి మట్టం: 317.980 మీ.

2020-08-15 07:06 GMT

వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

వరంగల్ అర్బన్: అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పథకాన్ని ఎగుర వేసి, పోలీస్ వందనన్ని స్వీకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పి చైర్మెన్ , మేయర్ , ఎంపి దయాకర్ , కూడా చైర్మెన్, డిసిసిబి చైర్మెన్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నగర పాలక కమిషనర్ డి సిపి ఎసిపి తదితరులు పాల్గొన్నారు

2020-08-15 07:04 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసన మండలి విప్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు.

జయశంకర్ భూపాలపల్లి : 74 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసన మండలి విప్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అదనపు కలెక్టర్ వైవి గణేష్ , జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, అదనపు ఎస్పీ శ్రీనివాసులు ,అధికారులు.

2020-08-15 06:59 GMT

స్వాతంత్య్ర వేడుక‌ల్లో మంత్రి పువ్వాడ అజ‌య్‌

ఖమ్మం:  జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ జెండా ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

2020-08-15 06:52 GMT

భద్రాద్రి కొత్తగూడెం:  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

2020-08-15 06:48 GMT

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో నిలిచిపోయిన బొగ్గు ఉత్ప‌తి

మంచిర్యాల జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం,

శ్రీరాంపూర్,రామకృష్ణాపుర్, మందమర్రి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో నిలిచిపోయిన 54000 టన్నుల బొగ్గు ఉత్పత్తి,

సుమారు 13 కోట్ల 50 లక్షలు నష్టం

Tags:    

Similar News