Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-15 01:49 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం 

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-15 17:31 GMT

 ములుగు జిల్లా: ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద 8.450 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటిమట్టం.

క్రమ క్రమంగా పెరుగుతున్న గోదావరి. రాత్రికి మరింత పేరిగే అవకాశం.

ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

ప్రమాద హెచ్చరిక విడుదల.

2020-08-15 17:26 GMT

వరంగల్ రూరల్ జిల్లా: పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులోని గొడ్ల అంగడి వద్ద ఇద్దరు వ్యక్తులు అక్రమంగా అంబర్ ప్యాకెట్లను అమ్ముతుండగా వారి వద్ద 15 వెల రూపాయల విలువగల అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు.

2020-08-15 12:36 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

- ప్రస్తుత సామర్థ్యం 117.88 మీటర్లు

- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

- ప్రస్తుత సామర్థ్యం 8.304 టీఎంసీ

- ఇన్ ఫ్లో 1,99,988 క్యూసెక్కులు

- ఓట్ ఫ్లో 1,99,988 క్యూసెక్కులు

2020-08-15 12:35 GMT

కొమరం భీం జిల్లా:

- చింతలమానేపల్లి మండలం గూడెం ఎగువున కురుస్తున్న వర్షల కారణంగా ఉద్రిక్తతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత. పెనుగంగలు .

- జల దిగ్బంధంలో దిందా గ్రామం రెండురోజులనుండి రాకపోకలు బందు...

2020-08-15 12:34 GMT

హైదరాబాద్: 

- ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడే అవకాశం ఉన్నందున శిధిలావస్థకు చేరిన భవనాలు,ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ సూచన

- వాతావరణ శాఖ నుండి వస్తున్న హెచ్చరికలు, కాల్ సెంటర్, వాట్సాప్ లు, కంట్రోల్ రూమ్ నుండి అందే ఫిర్యాదులకు తక్షణమే స్పందించుటకు అందుబాటులో ఉండాలని అధికారులు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డి ఆర్ ఎఫ్ బృందాలకు ఆదేశాలు

- శిథిలావస్థకు చేరిన భవనాలను తనిఖీ చేసి, చాలా ప్రమాదకరంగా వున్న నిర్మాణాలలో నివసిస్తున్న ప్రజలను తక్షణమే ఖాళీ చేయించి, దానిని సీల్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు

- ప్రమాదకరంగా వున్న సెల్లార్లను భవన నిర్మాణ, శిధిల వ్యర్ధాలతో నింపించాలి

- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఏటవాలు,కొండ ప్రాంతాలలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ప్రజలు, ప్రమాదకరంగా వున్న ప్రహరీలకు ఆనుకుని వేసుకున్న షెడ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించుటకు చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమీషనర్ ఆదేశాలు

2020-08-15 12:34 GMT

కొమురం భీం జిల్లా:

- బేజ్జుర్ మండలం లో సలుగుపల్లి లో ఉద్రతుంగా ప్రవాహిస్తున్నా తీగల ఒర్రె.

- బేజ్జుర్ - పెంచికల్పేట్ మండలాల మధ్య రవాణాకు అంతరాయం

- ఇరవై గ్రామాలకు .నిలిచిన రాకపోకలు.

2020-08-15 12:34 GMT

కొమురం భీం జిల్లా:

- పెంచికల్ పెట్ మండల్ వరద లో చిక్కుకున్న ఎల్లూరు గ్రామానికి చెందిన రైతులు .రైతు కూలీలు

- ఉదయం పొలం పనులకు వెళ్లగా ఉదయం నుండి కురుస్తున్న ఎడతెరని వర్షానికి సమీపంలో ని బొక్కి వాగు మత్తడి పొంగిపొర్లడంతో 60 మందికి పైగా వరదల్లో చిక్కుకున్న రైతులు

- . స్థానికుల సహాయం తో వరద ప్రవాహాన్ని దాటిన రైతులు.

2020-08-15 12:33 GMT

మహబూబ్ నగర్ జిల్లా :

- జడ్చర్ల మండలం భురెడ్డిపల్లి మరియు నక్కల బండ గ్రామాలలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిన మూడు ఇళ్లు.

2020-08-15 12:33 GMT

వనపర్తి జిల్లా:

- పాన్ గల్ మండలం గోప్లాపూర్ లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి వేరుశనగ పంట. భారీ నష్టానికి ఆందోళన చెందుతున్న రైతులు..


2020-08-15 12:32 GMT

- ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమెశ్ కుమార్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరియు వరదల నేపధ్యంలో వాటిపై తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో బిఆర్ కెఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

- ఇంకా కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా అధికారులందరు హెడ్ క్వాటర్స్ లోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్ధితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు.

- జిల్లాల్లో రైల్వే లైన్ లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సి.యస్ అప్రమత్తం చేశారు.

- చెరువులు , కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.

- జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్ధితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.

- రాష్ట్ర స్ధాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు అయిందని ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్న (040-23450624) కు కాల్ చేయవచ్చ.

- జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి.

- అదనంగా గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలి.

Tags:    

Similar News