డిచ్ పల్లి 7వ పోలీస్ బెటాలియన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
నిజామాబాద్ జిల్లా : డిచ్ పల్లి 7వ పోలీస్ బెటాలియన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
జాతీయ పతాకాన్ని ఎగరవేసిన బెటాలియన్ కమాండెంట్ యస్.వి సత్య శ్రీనివాస్..
బెటాలియన్ నందు ఉత్తమ సేవలందించిన 55 మంది సిబ్బందికి ప్రశంప పత్రాలను అందజేసిన కమాండెంట్...
బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. స్వాతంత్య్ర వేడుకలు
నిజామాబాద్ :బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే షఖిల్ ఆమెర్.
కోవిడ్ టెస్టులు చేసే వాహనాన్ని ప్రారంభించి, టెస్టు చేయించుకున్న ఎమ్మెల్యే షఖిల్
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
ఏసీబీ అప్డేట్స్: ఇంకా తహశీల్దార్ ఇంట్లో , కార్యాలయాల్లో, బంధువుల ఇండ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
ఇప్పటి వరకు నాగరాజు ఇంట్లో దాదాపు 28 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.
బ్యాంక్ లాకార్లను పరీశీలిస్తున్న ఏసీబీ..
160 కోట్ల విలువైన భూమిని కాజేయలని చూసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు...
దయరా లోని 44 ఎకరాల భూమిని ముస్లింల కు noc ఇచ్చిన కలెక్టర్ బలేరావ్...
ముస్లిం ల వద్ద నుండి భూమిని కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించాలని తహసీల్దార్ తో డీల్..
2 కోట్ల డీల్ కుదుర్చుకున్న తహశీల్దార్ నాగరాజు...
మరో వైపు హైకోర్టు లో కొనసాగుతున్న భూ వివాదం..
హైకోర్టు లో కేసు కొనసాగుతుండగానే బయట సెటిల్ మెంట్ కు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కుట్ర...
సాయంత్రం వరకు పూర్తి వివరాలను ప్రకటించనున్న ఏసీబీ....
ఘట్కేసర్ ఏ ఎస్సై ఆత్మహత్య ప్రయత్నం.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పి ఎస్ ఏ ఎస్సై రామకృష్ణ ఆత్మహత్య ప్రయత్నం..
అధికారుల వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్..
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం...
స్థానిక క్యూర్ వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ రామకృష్ణ..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో .. మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య....
స్వాతంత్య్ర వేడుకల్లో కాంగ్రెస్ నేతలు
74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాయకులు షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వి. హనుమంతరావు, వంశీ చంద్ రెడ్డి, అనిల్ యాదవ్, మల్లు రవి, తదితరులు,
వరదలో కొట్టుకుపోయిన బస్సు
వరంగల్ రూరల్ జిల్లా: దామెర మండలం కంఠత్మకూర్ గ్రామలో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్న ప్రైవేటు బస్సు వరద తాకిడికి కొట్టుకుపోయింది.
బస్సులో ఎంతమంది ఉన్నది పూర్తి వివరాలు తెలియాలి.
ఊరకుక్కల బీభత్సం.
ములుగుజిల్లా: తాడ్వాయి మండలం కాటాపూర్ లో ఊరకుక్కల భీభత్సం....
మాజీ సర్పంచ్ ముజాఫర్ మేకలదొడ్డిపై అర్దరాత్రిదాడిచేసి 27 మేకలను గొంతుకొరికి చంపిన ఊరకుక్కలు
గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి
ములుగు జిల్లా: ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద 8.040 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటి మట్టం.
మండలంలోని ముళ్ళకట్ట,మంగపేట పుష్కర ఘాట్ ల వద్ద ఉదృతంగా ప్రవహిస్తూ
క్రమ క్రమ గా పెరుగు తున్న గోదావరి.