Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-14 01:43 GMT
Live Updates - Page 3
2020-08-14 10:45 GMT

శానిటైజర్లు తాగి మృతి చెందడం బాధాకరం

తిరుపతి:

- శానిటైజర్లు తాగి మృతి చెందడం బాధాకరం

- పేదవారే మృత్యువాత పడుతున్నారు.

- మద్యానికి బానిసలు కావడం వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి.

- గ్రామ వాలంటీర్ల ద్వారా మద్యానికి బానిసైన వారిని గుర్తించి వారిని డీఅడిక్షన్ కేంద్రాలకు పంపి మార్పును తీసుకురావాలనుకుంటున్నాం

- మద్యాపానం వద్దని చెప్పాల్సిన వేళ ధరలు తగ్గించాలని మాట్లాడటం హాస్యాస్పదం

- జగన్ ప్రభుత్వం క్రమంగా మద్యపాన నిషేదం వైపు అడుగులు వేస్తోంది

- ఆలోపే మద్యానికి బానిసైన వారిని కూడా మార్చే ప్రయత్నం జరుగుతోంది

- రఘురామ కృష్ణమరాజు జగన్ కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకుని గెలిచాడు

- ఆయన సామాజిక వర్గాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు

- చంద్రబాబు కోవర్టు అంతకన్నా ఏమి మాట్లాడుతారు

- రాజీనామా చేసి గెలవమనండి, నిజంగా ప్రజల్లో ఏ ఫీలింగ్ ఉందో ప్రజలే నిర్ణయిస్తారు.

- 50మంది రెడ్లు గెలిస్తే నలుగురే మంత్రి పదవుల్లో ఉన్నారు

- మనస్సాక్షిగా చెబుతున్నా మేమంతా స్వతంత్రంగా శాఖలు నిర్వర్తిస్తున్నాము

- మా శాఖలో మాతో మాట్లాడనిదే ముఖ్యమంత్రి ఏ నిర్ణయమూ తీసుకోవట్లేదు

- అసలైన సామాజిక, ఆర్థిక,రాజకీయ రిజర్వేషన్ ఫలాలు జగన్ ప్రభుత్వంలోనే అందుతున్నాయి

- హెచ్ ఎం టి వితో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి

2020-08-14 10:41 GMT

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసులకు ప్రెసిడెంట్ మెడల్స్ అవార్డులు

జాతీయం:

ఏపీ పోలీసులకు రెండు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ , 14 ఉత్తమ సేవా పోలీస్ మెడల్స్

ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ కు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్

తెలంగాణ పోలీసులకు రెండు శౌర్య పోలీస్ మెడల్స్ , రెండు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ , పది ఉత్తమ సేవా పోలీస్ మెడల్స్

ఎస్ ఐ వెంకటేశ్వర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ మెహరోజు ద్దీన్ లకు శౌర్య పోలీస్ మెడల్స్

తెలంగాణ ఐజి ప్రమోద్ కుమార్, ఎస్ ఐ తోట సుబ్రహ్మణ్యం లకు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్

2020-08-14 09:33 GMT

ఈ నెల 27 వరకు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: పాలనా వికేంద్రీకరణ , CRDA రద్దు బిల్లులను సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో జరిగిన విచారణ లో జాప్యం..

కరోనా నేపథ్యంలో వర్చువల్ గా జరిగిన విచారణలో పలుమార్లు అంతరాయం.

సాంకేతిక సమస్యలతో రెండు గంటల ఆలస్యంగా విచారణ

ఈనెల 27 న నేరుగా విచారణ జరుపుతామని పేర్కొన్న ధర్మాసనం

- 27 వరకు స్టేటస్ కో ని పెంచింది.

 

2020-08-14 09:29 GMT

ఆదోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా

కర్నూలు జిల్లా: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, కరెంట్ చార్జీలు, పెంచడంపై బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన

ఆదోని ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా

మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, జనసేన నాయకులు మలిశెట్టి రేణు వర్మ ఆధ్వర్యంలో ఆర్డిఓ కు వినతి పత్రం అందజేత

2020-08-14 09:27 GMT

ఆ కేసుల్లో నస తప్ప.. పసలేదు: రఘురామకృష్ణంరాజు

 రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో వేసిన కేసులో నస తప్ప పసలేదు. ఇది అంతంకాదు ఆరంభం. ఇక ముందు కూడా కోర్టులలో ఎదురుదెబ్బలు తగులుతాయి.

పేదలకు ఇళ్ల నిర్మాణాలకు లక్ష 50 వేలు తన వంతు వాటాగా చెల్లించింది. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదు. కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు.

ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేని వారు, మూడు రాజధానులు ఎలా కడతారు?

నాకు ఒక సామాజిక వర్గం నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ధైర్యం ఉంటే నా ఇంటిదగ్గరకు వచ్చి చూడండి, నా భద్రత సిబ్బంది కాల్చి పారేస్తారు.

నాకు ఫోన్ చేసే వెధవలకు చెబుతున్నాను, రాజీనామా చేసే ప్రసక్తేలేదు. నా రాజీనామా కోరి ప్రభుత్వంలో ఉన్నవారు రాజీనామా చేసే పరిస్థితి కొనితెచ్చుకోవద్దు. ఎన్నికలలో నా బొమ్మమీద గెలిచాను.

ఈ రోజు సుప్రీంకోర్టు లో ప్రశాంత్ భూషణ విషయంలో కోర్టు దిక్కరణ తీర్పు.... రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసే వారికి కనువిప్పు కావాలి.

2020-08-14 09:22 GMT

ప్లాస్మా దానం చేయండి: ఏపీ గ‌వ‌ర్న‌ర్‌

రాజ్ భవన్ ప్రెస్ నోట్: కోవిడ్ నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలి

- 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ గారి సందేశం

“74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేక అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే రోజు.

స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావంతో, దేశ పురోగతికి ధృడ నిశ్చయంతో పునరంకితమయ్యే రోజు.

కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న విషయం మీ అందరికి తెలిసిందే.

కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు అపారమైన నష్టాన్నికలిగించింది. సాధారణ జన జీవన విధానానికి భంగం కలిగించింది.

అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.

సాధ్యమైనంతవరకు ఇళ్ళల్లోనే ఉండాలి, అనవసర ప్రయాణాలు మానుకోవాలి. సామాజిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చు అని విశ్వసిస్తున్నాను.

కోవిడ్ -19 వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకున్న వారందరికీ, వారి ప్లాస్మాను దానం చేసి, వైరస్ సంక్రమణతో పోరాడుతున్న రోగులకు సహాయం చేయమని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

కోవిడ్ వైరస్ ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి.

"ఇంటిలోనే ఉండండి సురక్షితంగా ఉండండి” కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని మరోసారి ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.”: గవర్నర్ విశ్వ భూషణ్ హరిచం దన్

*

2020-08-14 09:16 GMT

తెలుగు రాష్ట్రాల పోలీసుల‌కు 'రాష్ట్ర‌ప‌తి సేవా పుర‌స్కారాలు'

జాతీయం: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసులకు ప్రెసిడెంట్ మెడల్స్ అవార్డులు

ఏపీ పోలీసులకు రెండు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ , 14 ఉత్తమ సేవా పోలీస్ మెడల్స్

ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ కు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్

తెలంగాణ పోలీసులకు రెండు శౌర్య పోలీస్ మెడల్స్ , రెండు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ , పది ఉత్తమ సేవా పోలీస్ మెడల్స్

ఎస్ ఐ వెంకటేశ్వర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ మెహరోజు ద్దీన్ లకు శౌర్య పోలీస్ మెడల్స్

తెలంగాణ ఐజి ప్రమోద్ కుమార్, ఎస్ ఐ తోట సుబ్రహ్మణ్యం లకు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్

2020-08-14 08:58 GMT

స్వ‌ర్ణ ప్యాలెస్ అగ్నిప్ర‌మాదం కేసులో పోలీసుల దూకుడు

విజయవాడ: రమేష్ ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన పోలీసులు

మూడు గంటల నుండి డాక్టర్ మమతను విచారిస్తున్న పోలీసులు

రమేష్ ఆసుపత్రి మేనేజ్ మెంట్ లో సభ్యురాలిగా ఉన్న రాయపాటి కోడలు మమతకు 160 సీ ఆర్ పీ సీ నోటీసులు

విచారణకు సౌత్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన డాక్టర్ మమత

డాక్టర్ మమతనుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ సూర్యచంద్రరావు.

ఉదయం 11 గంటల నుండి విచారిస్తున్న పోలీసులు

పేషంట్ ల నుండి ఎంత వసూలు చేస్తునారనే కోణంలో విచారణ

స్వర్ణప్యాలస్ లో కోవిడ్ కేర్ సెంటర్ నడపడానికి డాక్టర్ మమతా పాత్రను గుర్తించిన పోలీసులు

పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమానుల కోసం ముమ్మర గాలింపు

2020-08-14 08:52 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్ ఘడ్ లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

దంతేవాడ జిల్లాలో 13 మంది కీలక దళ సభ్యులు లొంగిపోయారని ప్రకటించిన దంతేవాడ ఎస్పీ

మావోల లొంగుబాటు తో సవాల్ విసిరిన పోలీసులు

2020-08-14 08:47 GMT

ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ గా అల్లారెడ్డి అనసూయమ్మ నియామకం

నెల్లూరు: ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ గా అల్లారెడ్డి అనసూయమ్మ నియామకం.

-- మంత్రి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించిన అనసూయమ్మ

-- రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం-- మంత్రి గౌతమ్ రెడ్డి

Tags:    

Similar News