ప్లాస్మా దానం చేయండి: ఏపీ గ‌వ‌ర్న‌ర్‌

రాజ్ భవన్ ప్రెస్ నోట్: కోవిడ్ నుండి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలి

- 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ గారి సందేశం

“74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేక అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే రోజు.

స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావంతో, దేశ పురోగతికి ధృడ నిశ్చయంతో పునరంకితమయ్యే రోజు.

కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న విషయం మీ అందరికి తెలిసిందే.

కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు అపారమైన నష్టాన్నికలిగించింది. సాధారణ జన జీవన విధానానికి భంగం కలిగించింది.

అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.

సాధ్యమైనంతవరకు ఇళ్ళల్లోనే ఉండాలి, అనవసర ప్రయాణాలు మానుకోవాలి. సామాజిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చు అని విశ్వసిస్తున్నాను.

కోవిడ్ -19 వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకున్న వారందరికీ, వారి ప్లాస్మాను దానం చేసి, వైరస్ సంక్రమణతో పోరాడుతున్న రోగులకు సహాయం చేయమని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

కోవిడ్ వైరస్ ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి.

"ఇంటిలోనే ఉండండి సురక్షితంగా ఉండండి” కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని మరోసారి ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.”: గవర్నర్ విశ్వ భూషణ్ హరిచం దన్

*

Update: 2020-08-14 09:22 GMT

Linked news