ఆ కేసుల్లో నస తప్ప.. పసలేదు: రఘురామకృష్ణంరాజు

 రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో వేసిన కేసులో నస తప్ప పసలేదు. ఇది అంతంకాదు ఆరంభం. ఇక ముందు కూడా కోర్టులలో ఎదురుదెబ్బలు తగులుతాయి.

పేదలకు ఇళ్ల నిర్మాణాలకు లక్ష 50 వేలు తన వంతు వాటాగా చెల్లించింది. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదు. కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు.

ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేని వారు, మూడు రాజధానులు ఎలా కడతారు?

నాకు ఒక సామాజిక వర్గం నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ధైర్యం ఉంటే నా ఇంటిదగ్గరకు వచ్చి చూడండి, నా భద్రత సిబ్బంది కాల్చి పారేస్తారు.

నాకు ఫోన్ చేసే వెధవలకు చెబుతున్నాను, రాజీనామా చేసే ప్రసక్తేలేదు. నా రాజీనామా కోరి ప్రభుత్వంలో ఉన్నవారు రాజీనామా చేసే పరిస్థితి కొనితెచ్చుకోవద్దు. ఎన్నికలలో నా బొమ్మమీద గెలిచాను.

ఈ రోజు సుప్రీంకోర్టు లో ప్రశాంత్ భూషణ విషయంలో కోర్టు దిక్కరణ తీర్పు.... రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసే వారికి కనువిప్పు కావాలి.

Update: 2020-08-14 09:27 GMT

Linked news