Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-14 01:43 GMT
Live Updates - Page 2
2020-08-14 11:13 GMT

తూర్పుగోదావరి :

- అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం లో గోడకూలి ఐదేళ్ల బొమ్మిడి బెల్సీ బాలిక మృతి..

2020-08-14 11:13 GMT

గోదావరి వరద ఉగ్రరూపం..

- గోదావరి వరద ఉగ్రరూపం..

- గంట గంటకూ పెరుగుతున్న నీటిమట్టం

- ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద

- 9.90 అడుగులకు చేరిన నీటి మట్టం

- రేపు ఉదయానికి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం

- బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 7లక్షల 75 వేల క్యూసెక్కుల వరద దిగువకు సముద్రంలోకి విడుదల

- వరద భయంలో కోనసీమలోని లంక గ్రామాలు

- జలదిగ్భంధంలో దేవీపట్నం మండలం

- 38 గ్రామాలు జలదిగ్బంధం, నిలిచిపోయిన రాకపోకలు.

- వరద సహాయక ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.

- ముంపు గ్రామాల ప్రజలను తరలించడానికి రంపచోడవరం లో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు...

- బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 15 ఇంజన్ బోట్లను, 2 టూరిజం బోట్లను సిద్ధం చేసిన అధికారులు...

-  ఎ. వీరవరం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

- దేవీపట్నం లో వరద ప్రమాద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న రంపచోడవరం సబ్ కలెక్టరు ప్రవీణ్ ఆదిత్య....

- సుమారు 33 గ్రామాలకు వరద ప్రభావం పూర్తి స్థాయిలో ఉంది....

- వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకు దిగిన రెవిన్యూ, పోలీసు సిబ్బంది....

2020-08-14 11:09 GMT

రాజస్థాన్ అసెంబ్లీ లో మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్ష నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కార్

జాతీయం:

- రాజస్థాన్ అసెంబ్లీ లో మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్ష నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కార్

- ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు చేసిందని బిజెపి ఆరోపణలు చేసిన అశోక్ గెహ్లాట్

- రాజీ ఫార్ములా ఫలించిన అనంతరం రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో భేటీ అయిన మరుసటి రోజు సచిన్‌ పైలట్‌ శుక్రవారం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్ పైలెట్

- రాజస్తాన్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్‌కు దూరంగా విపక్షాలకు దగ్గరగా పైలట్‌కు సీటు కేటాయించడం చర్చనీయాంశం.

- తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై తనదైన శైలిలో స్పందించిన సచిన్ పైలెట్ .

- తనకు బోర్డర్‌లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని వ్యాఖ్యలు

- సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్‌ వ్యాఖ్య

- రాజస్తాన్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష బీజేపీ ప్రకటించగా, పైలట్‌ రాకతో బలోపేతమవడంతో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గెహ్లాట్

- 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్‌ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు

- ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం

-విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు.

2020-08-14 11:07 GMT

ఏలూరులో హత్యకేసు మిస్టరీని చేదించిన టుటౌన్ పోలీసులు..

ప.గో:

- పుష్పలీల నగర్ లో పెయింటర్ ఖండవల్లి శేఖర్ ను దారుణంగా హత్య చేసిన బావమరిది వీరకుమార్..

- సహకరించిన చెల్లి హేమలత అరెస్ట్..

- ఆస్తి తగాదాల కారణంగా హత్య చేసిన నిందితులు.

- ఓ మోటార్ సైకిల్, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్న పోలీసులు...

2020-08-14 11:06 GMT

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస ఘటనలకు నిరసన: సిపిఐ రామకృష్ణ

తూర్పుగోదావరి: 

-  రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస ఘటనలకు నిరసనగా ఈనెల17న విజయవాడ లో ప్రదర్శన

- ఏపీలో పరిపాలన కక్ష పూరితంగా నడుస్తోంది

- ప్రతిప్రక్షాల గొంతును అణగద్రొక్కాలని చూస్తున్నారు

- అన్ని పక్షాలు ఏకమై నిరసన కార్యక్రమం చేస్తాం

- రాజధానిపై కోర్టులో న్యాయం జరుగుతుంది

- తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లో

- శిరో ముందనం ఘటన అమానుషం- పరిపాలకులు తలదించుకునే ఘటన

- ఘటనకు బాద్యులను అరెస్టు చేయడంలో ఎందుకంత ఉదాశీనత

- దళిత బాలికకు అన్యాయం జరిగింది

- శిరోముండనం బాధితుడు ప్రసాద్ , అత్యాచార ఘటనలో దళిత మైనర్ బాలికను పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

- దళితులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడం లేదు

- ఒక్క ఎస్సై ని కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసిన అధికారులు.. మిగిలిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ....

- సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా శిరోముండనం ఘటన వుంది

- శిరోముండనం పై రాష్ట్ర పతి స్పందిచారంటే....రాష్ట్ర ప్రభుత్వం ఏమ చేస్తున్నట్టు

- వైజాగ్ లో కరొనా ట్రీట్మెంట్ కు సౌకర్యాలు లేవంటే దళిత డాక్టర్ ని పిచోన్ని చేసేలా ప్రభుత్వం వ్యవహరించింది

- అదే కరొన సేవలకు వసతులు,సౌకర్యాలు లేవంటే జూనియర్ డాక్టర్లకు స్టయిఫండ్ పెంచారు..

- దళితులపై పెరిగిన దాడులకు నిరసన గా ఈనెల 17న విజయవాడ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్ట బోతున్నాం...

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

2020-08-14 11:04 GMT

ఏపిలో ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్

విజయవాడ:

- ఏపలో ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్

- సెప్టెంబర్ 17 నుండి ఎంసెట్

- 17 నుండి 25 వరకు ఎంసెట్

- సెప్టెంబర్ 14 న ఈ సెట్

- సెప్టెంబర్ 10, 11 న ఐ సెట్

- ఏ పి జి ఈ సెట్ సెప్టెంబర్ 28,29,30

- ఎడ్ సెట్ (ఉదయం), లా సెట్ (మధ్యాహ్నం) అక్టోబర్ 1

- అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్

2020-08-14 11:00 GMT

చిరుచానూరు సమీపంలో రోడ్డు ప్రమాదం

తిరుపతి:

- బొలేరో వాహనం బోల్తాపడి గాజులమండ్యం ఎస్ ఐ స్వాతికి గాయలు

- విధులు ముగించుకుని సెల్ఫ్ డ్రైవింగ్ లో ఇంటికి వెళ్తుండగా ఘటన

- వాహనానికి అడ్డంగా ఆవుదూరడంతో బోల్తా

2020-08-14 11:00 GMT

పోలవరం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి

ప.గో:

- ప్రాజెక్ట్ స్పిల్ ఛానెల్ కి చేరుతున్న వరద నీరు..

- ప్రాజెక్ట్ పనులకు తీవ్ర అంతరాయం

- కాపర్ డ్యాం వద్ద 26.9 మీటర్లకు చేరిన గోదావరి

- కొత్తూరు కాజు వై 10 అడుగుల చేరిన గోదావరి వరద

- పోలవరం మండలంలో 19 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..

- కుక్కునూరు-దాచారం కాజ్ వే పై ఉదృతంగా గోదావరి వరదనీరు..

- పలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు...

2020-08-14 10:51 GMT

విశాఖ: 

కరోనా ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు

మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

పోలీస్ లు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని మనందరి రక్షణ కోసం రెయింబవళ్ళు పని చేస్తున్నారు.

ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు కూడా కోల్ఫోయారు.

కరోనా పై అవగాహాన కొరకు ప్రచార రథాలు ప్రారంభించడం సంతోషకరం.

సైబర్ క్రైమ్ ,ట్రాఫిక్ పై ఎప్పుటికపోపుడు ఈ వాహానాల ద్వారా సమాచారం ఇస్తారు.

ప్రెండ్లీ పోలీసింగ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు.

కరోనా పై దోపిడీ చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు.

అటువంటి వారిపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాం.

2020-08-14 10:50 GMT

తిరుపతి:

- చంద్రబాబు పెయిడ్ వర్కర్ రఘురామ కృష్ణరాజు

- కుల ప్రస్తావన తెచ్చి ఆయన మరింత దిగజారిపోయారు.

- చంద్రబాబుకు కొమ్ముకాయాలని ఆ పార్టీ ఎంపిలతో ఉండాలని కుతూహలంతో ఉన్నాడు

- రాజీనామా చేసి మాట్లాడు, ఎంపిగా ఉన్నందువల్లా కనీసం మీడియాలోనైనా కనిపిస్తున్నావ్.అదీ పోతే నువ్వేంటో తెలుస్తుంది.

-హెచ్ ఎం టివితో చిత్తూరు ఎంపి రెడ్డప్ప

Tags:    

Similar News