Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-11 00:36 GMT
Live Updates - Page 2
2020-08-11 10:03 GMT

కృష్ణాజిల్లా కలెక్టర్ దుర్గగుడి ఫ్లైఓవర్ ను సందర్శించారు

విజయవాడ:

- కృష్ణాజిల్లా కలెక్టర్ దుర్గగుడి ఫ్లైఓవర్ ను సందర్శించారు

-  ఈనెల 20కి దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తయ్యే అవకాశం

- ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇచ్చేలా కోరిన ఆర్ అండ్ బి అధికారులు

2020-08-11 10:02 GMT

జాతీయం

- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు

- తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ .

- రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలను చేర్చారని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు .

- ‘‘40వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు మార్చారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారు. ఏపీ ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చింది’’ అని పిటిషనర్‌ ఆరోపణ

- దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటరమణి స్పందిస్తూ... రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని వివరణ.

- తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని తెలిపారు.

- కమిటీ నివేదిక కూడా ఏపీకి అనుకూలంగా ఉన్నందున కేసును ముగించాలని కోరారు.

- రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌ ద్వారా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం

- తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వివరణ.

- రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఖరేంటో వారం రోజల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశం.

- తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం వెల్లడి.

2020-08-11 10:01 GMT

రోడ్డు ప్రమాదం లో మహిళా ఏ ఆర్ కానిస్టేబుల్ మృతి

కర్నూలు:

- రోడ్డు ప్రమాదం లో మహిళా ఏ ఆర్ కానిస్టేబుల్ మృతి

- నగర సమీపంలోని పంచాలింగల హైవే పైతుంగభద్ర నదీ వద్దనున్న ద్విచక్ర వాహనాన్ని ధీ కొట్టిన డీసీయం లారీ

- ఏ అర్ కానిస్టేబుల్ మాధవి అక్కడికక్కడే మృతి.. మరో వ్యక్తి కి స్వల్పగాయాలు.

- మృతి చెందిన కానిస్టేబుల్ మాధవికి నాలుగు రోజుల క్రితం వివాహం నిశ్చితార్థం

- ఇంతలోనే మృతి చెందడంతో కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు

2020-08-11 10:01 GMT

కర్నూలు జిల్లా:

- లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు మరియు ఇతర వ్యక్తులు మొత్తం 7 మందిపై 05 కేసులు.

- వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ఎం.వి కేసులు మొత్తం 988 నమోదు.

- రూ.2,18,444/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.

- జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు, అరెస్టులతో పాటు రూ.38,395/- ల నగదు, 2564 లిక్కర్ బాటిల్స్ (282.32 లీటర్లు) , 117 లీటర్ల నాటు సారా స్వాధీనం.

- మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు మొత్తం 1210 నమోదు.

- రూ.88,333/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.

2020-08-11 09:59 GMT

నెల్లూరు :

- తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ సంగం తాసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు.

- మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కూడా తమకు న్యాయం జరగలేదు నిరసన.

- మంత్రి చెప్పినా అధికారులు మాట వినట్లేదంటూ ఆరోపణలు.

2020-08-11 08:33 GMT

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స సురేష్‌ బాబు!

అమరావతి: మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు పేరును ఖరారు చేసే అవకాశం

సోమవారం కన్నుమూసిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు.

జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో వైసీపీతోనే ఉంటూ వచ్చిన పెనుమత్స సాంబశివరాజు .

పెనుమత్స మరణంతో ఆయన కుటుంబసభ్యులను జగన్‌మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శ

ఆ సందర్భంగా డాక్టర్‌ సురేష్‌ బాబును ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ

ఈ నేపథ్యంలోనే పెనుమత్స సురేష్‌ బాబు పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసే యోచన.

నేడు అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం

ఈ నెల 13 న నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్

2020-08-11 06:10 GMT

చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద టిడిపి నేతల ఆందొళన

చిత్తూరు: చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద టిడిపి నేతల ఆందొళన

టిఎస్ఎన్వీ మండల అధ్యక్షుడు రాకేష్ చౌదరి అక్రమ అరెస్టును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

వైకాపా నాయకులకు ప్రభుత్వ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు

సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న రాకేష్ చౌదరిని భూతగాదాల నెప్పంతో అరెస్ట్ చేశారు.

మండలంలో వైకాపా అరాచకాలను త్వరలో సాక్ష్యాలతో బయటపెడుతాం...

ఇసుక,మద్యం మాఫియాతో వైకాపా నాయకులు పెట్రేగిపోతున్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని.

2020-08-11 05:55 GMT

గోదావ‌రిలో యువ‌కుడి గ‌ల్లంతు

తూర్పుగోదావరి: ఆలమూరు మం. జొన్నాడ సమీపంలో గోదావరి నదిలో స్నానానికి దిగి వ్యక్తి గల్లంతు..

గోదావరి లో కొట్టుకువస్తున్న వ్యక్తి ని చూసి రావులపాలెం బ్రిడ్జి వద్ద తాళ్ళ సహాయం తో రక్షించిన స్థానికులు..

స్థానికుల సహాయం తో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వ్యక్తి..

2020-08-11 05:51 GMT

మాజీ మంత్రి పైడికొండకు బిజెపి నివాళి

విజయవాడ: ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు కు బిజెపి నివాళి

ప్రాణాలు కోల్పోయిన జవాన్లు, ఫైర్ ప్రమాదంలో కరోనా పేషెంట్ ల మృతికి సంతాపంగా నిమిషం మౌనం పాటించి నివాళి అర్పించిన బిజెపి నేతలు

ఎపి రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యత స్వీకార సభ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాంమాధవ్

దగ్గుబాటి పురంధరేశ్వరి

సంస్థాగతంగా చేసే మార్పులలో భాగంగా సోము వీర్రాజు ఎపి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు

కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున కొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం

యూట్యూబ్ లింక్ ద్వారా లక్షల మంది అభిమానులు వీక్షించే ఏర్పాట్లు చేశాం

కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు

2018 మే 13న బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించారు

పది మాసాలే గడువు ఉన్నా కమిటీలు వేసుకుని ఎన్నికలకు వెళ్లాం

మళ్లీ సంస్థాగత ఎన్నికలు రావడంతో.. బూత్ కమిటీ లు ఏర్పాటు చేశాం

ఇప్పుడు కొత్త అధ్యక్షులు గా సోము వీర్రాజు బాధ్యత తీసుకున్నారు

ఎపి లో బిజెపి బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేశాను

నాకు ఎంతోమంది నేతలు సహకరించారు.. వారందరకీ నా ధన్యవాదాలు

నా చర్యల వల్ల కొంతమందికి కష్టం, నష్టం కలిగించినా... అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

పార్టీ కోసం పని చేసే క్రమంలో బిజెపి ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తా

కొత్త అధ్యక్షులు సోము వీర్రాజు కు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి

బిజెపి జాతీయ నాయకుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ను సోము వీర్రాజు కు అధికారికంగా అప్పగించిన కన్నా లక్ష్మీనారాయణ

2020-08-11 05:48 GMT

కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తిన యనమల

అమరావతి : యనమల రామకృష్ణుడు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత

కొత్త పారిశ్రామిక విధానంపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు

నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు

ఉపాధి కల్పనకు, భవిష్యత్ తరాలకు ప్రయోజనం లేదు

ఈ పాలసీ కోసమా 14నెలల విలువైన కాలం వృధా చేసింది..?

వైసిపి నిర్వాకాల వల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ది

తయారీ రంగం, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే..

ఈ 14నెలల్లో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు

చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సగం జీతాలే...

క్రెడిట్ రేటింగ్ పడిపోయింది-పెట్టుబడులు వెనక్కి పోయాయి

ఏపి బ్రాండ్ ఇమేజ్ ను వైసిపి నాయకులు నాశనం చేశారు

టిడిపి ఏడాదికి సగటున రూ 1066కోట్లు కేటాయిస్తే, వైసిపి పెట్టింది రూ 852కోట్లే..

బలహీన వర్గాల వారికి, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం కాలరాశారు

దీనికి తగిన మూల్యం వైసిపి చెల్లించక తప్పదు

Tags:    

Similar News