Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 11 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(ఉ. 6-10 వరకు) తదుపరి అష్టమి; భరణి నక్షత్రం (రా. 11-05 వరకు) తదుపరి కృత్తిక నక్షత్రం, అమృత ఘడియలు (సా.5-47 నుంచి 7-33 వరకు), వర్జ్యం (ఉ. 7-11 నుంచి 8-57 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-42 వరకు) రాహుకాలం (మ.3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-45 సూర్యాస్తమయం సా.6-26
ఈరోజు 'కృష్ణాష్టమి' సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
జాతీయం: మనీలాండరింగ్ కేసులో చైనా సంస్థలు, వారి దగ్గరి సమాఖ్యలు మరియు బ్యాంక్ ఉద్యోగుల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు
షెల్ కంపెనీల ద్వారా కొంతమంది చైనీస్ వ్యక్తులు మరియు వారి భారతీయ సహచరులు మనీలాండరింగ్ మరియు హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు సమాచారం . ఈ సమాచారం ఆధారంగా, ఈ చైనీస్ సంస్థల యొక్క వివిధ ప్రాంగణాలు , వారి సన్నిహిత సమాఖ్యలు మరియు బ్యాంక్ ఉద్యోగుల పై ఆదాయపన్నుశాఖలదాడులు
చైనా వ్యక్తుల ఆదేశాల మేరకు, వివిధ డమ్మీ కంపనీలకు 40 కి పైగా బ్యాంకు ఖాతాలు సృష్టించబడ్డాయి. వీటిలో ఏకకాలంలో 1,000 కోట్ల రూపాయలకు పైగా క్రెడిట్లలోకి ప్రవేశించినట్లు గుర్తించిన ఆదాయ పన్నుశాఖ
జాతీయం: ఆర్ధిక లోటును ఎదుర్కుంటున్న మెుత్తం 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్దిక సహాయం
• 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు నెలవారీగా ఆర్దిక లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక సహాయం
• ఆగస్టు నెలకు గాను ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర సహాయం కింద నిధులు విడుదల.
• ఆంధ్ర ప్రదేశ్ కు 491 కోట్ల 41 లక్షల 66 వేల రూపాయలు విడుదల.
విశాఖ.మల్కాపురం ఐ ఓ సి ఎల్ టర్మీనల్ లారీ పార్కింగ్ యార్డ్ సమీపంలో లారీలో మంటలు
వెంటనే అప్రమత్తమైన లారీ సిబ్బంది మంటలు అర్పివేశారు.
బ్లాక్ ఆయిల్ టెర్మినల్ నుండి వేదాంత పూర్ కు లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్
సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు.
హెచ్ పి సి ఎల్ అగ్నిమాపక సిబ్బంది.
అమరావతి: వైయస్సార్ చేయూత – మారనున్న అక్కచెల్లెమ్మల భవిత
- రేపు క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అర్హులైన మహిళ జీవితాల్లో వెలుగులు
- దాదాపుగా 25 లక్షల మంది మహిళలకు లబ్ధి
- సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా అడుగులేస్తున్నామన్న సీఎం
- దిగ్గజ కంపెనీల సహకారం, భాగస్వామ్యంపై ప్రణాళిక
- ఔత్సాహిక వ్యాపారస్తులుగా అవకాశం
- ఇదివరకే ఆ రంగంలో ఉన్న వారికి బలమైన తోడ్పాటు
- మరింత మెరుగు పడనున్న జీవనోపాథి అవకాశాలు
అమరావతి: పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్ కు వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ టిక్కెట్
మోపిదేవి స్థానంలో సురేష్ ఎంపిక కి నిర్ణయం
ఈ నెల 13న నామినేషన్ దాఖలు చేయనున్న సురేష్
కడప: వల్లూరు మండలం అదినిమ్మాయపల్లె అనకట్ట వద్ద పెన్నా నది నీటిలొ యువకుడు గల్లంతు
స్నేహితులతొ కలిసి సరదాగా ఇతకు వెళ్లిన యువకుడు...
గల్లంతైన యువకుడు కమలాపురానికి చెందిన బాలరెడ్డయ్యగా గుర్తింపు
గజ ఇతగాళ్లతొ గాలిస్తున్న పొలీసులు
తూర్పుగోదావరి: ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 2లక్షల 10వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల
ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 10.75 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
డెల్టా ప్రధాన పంటకాల్వలకు విడుదలవుతున్న 12వేల 250 క్యూసెక్కులు సాగునీరు
రేపు ఉదయానికి మరికొంత పెరగనున్న ఇన్ ఫ్లో
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 22.500 మీటర్ల
చిన్నగొట్టిగల్లు మండలం: శేషాచల అడవులలో అటవీశాఖ అధికారులు కుంబింగ్.
తలకోన అటవీప్రాంతంలోని అడ్డగుట్ట ప్రాంతంలో తారసపడ్డ 27మంది తమిళ స్మగ్లర్లు.
అధికారులను చూసి దుంగలను పడవేసి దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయిన స్మగ్లర్లు.
26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్న భాకరాపేట అటవీశాఖ అధికారులు.
పారిపోయిన స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న కూంబింగ్
తూర్పు గోదావరి జిల్లా:
- కోరుకొండ మం కోటికేశవరం లో బైకును ఢీకున్న కారు
- ఇద్దరికి తీవ్రగాయాలు రాజమండ్రి ఆసుపత్రికి తరలింపు.
- రాజమండ్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి
- మరొకరి పరిస్ధితి విషమం.
- గాయపడ్డ ఇరువురు రాఘవపురం గ్రామస్తులు.
అమరావతి:
- ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
- నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపూర్
- ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే..." జ్ఞానంతో సమానమైనదీ, పవిత్రమైనదీ మరొకటి లేదు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించమని కృష్ణుడు ఉపదేశించాడు.
- యువతకు స్ఫూర్తినిచ్చే ఇటువంటి ఎన్నో సందేశాలను మన సంస్కృతికి అందించిన శ్రీకృష్ణుని జయంతి సందర్భంగా..