Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-10 01:04 GMT
Live Updates - Page 3
2020-08-10 13:33 GMT

ప్రైవేట్‌ ఆసుపత్రుపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

విజయవాడ: నగరంలో కోవిడ్ ప్రవేట్ ఆసుపత్రుపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

బాధితుల నుంచి భారీగా రమేష్ హాస్పిటల్ డబ్బులు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు..

లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు విచారణ లో వెల్లడి..

2020-08-10 10:57 GMT

అమరావతి-


ఫోటో ఓటర్ల జాబితా సవరణ, పేర్ల నమోదు , మార్పులు, అభ్యంతాల స్వీకరణకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన ఎన్నికల సంఘం


2021 జనవరి 1 నాటికి సవరించిన ఫోటో ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూలు ప్రకటించిన ఈసీ


పోలింగ్ కేంద్రాల పునర్వవస్థీకరణకు, ఓటర్ల జాబితాలో వ్యక్తమైన అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబరు 31 వరకూ గడువు ఇచ్చిన ఈసీ


సవరించిన ఓటర్ల జాబితా తో కూడిన ముసాయిదా ను నవంబరు 16న ప్రకటించనున్న ఈసీ


దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబరు 15 తేదీ వరకూ సమయం ఇచ్చిన ఎన్నికల సంఘం


2021 జనవరి 15 ఫోటో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్న ఎన్నికల సంఘం


2020-08-10 10:57 GMT

కర్నూలు జిల్లా


ఆదోని..టేట్కొ క్వరంటెన్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి


ఆదోని టెట్కో క్వారంటైన్ లోని కరోనా బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్ ఎల్ ఏ


ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే సమస్యను పరిష్కరిస్తామని కరోనా బాధితులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు


2020-08-10 10:56 GMT

శ్రీకాకుళం జిల్లా..


జిల్లాలో 11,441కి చేరిన కరోనా కేసుల సంఖ్య..


గడిచిన 24 గంటల్లో 354 పాజిటివ్ కేసులు నమోదు..


కరోనా నుంచి కోలుకుని తాజాగా 295 మంది డిశ్చార్..


2020-08-10 10:56 GMT

అమరావతి

ఏపీ హైకోర్టును రెడ్ జోన్ గా ప్రకటించాలని దాఖలైన పిటీషన్ విచారించిన ఏపీ హైకోర్టు

న్యాయమూర్తి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఇంప్లీడ్ పిటిషన్ పై వాదనలు పూర్తి..

మంగళవారానికి వాయిదా వేసిన ధర్మాసనం..

న్యాయమూర్తి రామకృష్ణ ప్రతిరోజు మీడియాలో మాట్లాడుతున్నారని

కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పిటిషనర్ తరఫు న్యాయవాది

రామకృష్ణ సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఆయన జడ్జ్ అని సర్వీస్ రూల్స్ ప్రకారం మీడియాతో మాట్లాడకూడదని వాదనలు

హైకోర్టు కంటోన్మెంట్ జోన్..

రిజిస్టర్ జనరల్ రాజశేఖర్ మరణం పై వేసిన పిటిషన్ కు జడ్జి రామకృష్ణకు సంబంధం లేదని వాదించిన న్యాయవాది

కేంద్రానికి పిటిషన్ తో సంబంధం లేదన్న అదనపు సోలిసిటర్ జనరల్

రాష్ట్ర ప్రభుత్వానికి, జడ్జి ఈశ్వరయ్య కు సంబంధం ఉందని ఇంప్లీడ్ పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు

ఇది వాస్తవం కాదని వాదించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది

హైకోర్టు ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకే ఈ పిటిషన్ వేశారన్న రామకృష్ణ తరపు న్యాయవాది..

కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి వేణుగోపాల గౌడ్ ఈశ్వరయ్య ఆడియో టేపులను జత చేశామన్న రామకృష్ణ తరపు న్యాయవాది

ఆయన వాయిస్ కూడా నిజమేనని తేలిందన్న రామకృష్ణ తరఫు న్యాయవాది..

ఈశ్వరయ్యకు ఈ పిటిషన్ తో సంబంధం ఉందని ఆయన కుట్రలను చేధించేందుకు తాము ఇంప్లీడ్ అవుతున్నామని వాదనలు

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి లతో విచారణ జరిపించాలని కోరిన జడ్జి రామకృష్ణ తరఫు న్యాయవాది

2020-08-10 09:32 GMT

ప.గో..


ఏలూరు కోవిడ్ సెంటర్ నుండి పరారైన రిమాండ్ ఖైదీలు అరెస్ట్


మరో ముగ్గురు సాయంతో దొంగతనాలు చేసిన రిమాండ్ ఖైదీలు..


ఇద్దరు రిమాండ్ ఖైదీ లు పందిరి వెంకట నారాయణ,పొలవరపు సత్య నాగ దుర్గ వరప్రసాద్


వారికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పశ్చిమ పోలీసులు.


ఏలూరు లోని మోతే వారి తోట లో విజిలెన్స్ ఎస్పీ ఇంట్లో..


భీమవరం వద్ద చిన్న రంగంపాలెంలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.


వారి వద్ద నుండి 96 కాసుల బంగారాన్ని స్వాధీనం


2020-08-10 09:32 GMT

విజయవాడ


స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం:-


డాక్టర్ రమేష్ బాబు:-


6 నెలలుగా అత్యవసర చికిత్సలు మాత్రమే అందిస్తున్నాం


టెలీ మెడిసిన్ ద్వారా హోం క్వారం టైన్ చికిత్స చేస్తున్నాం


కోవిడ్కే సులు పెరుగుతున్న దృష్ట్యా కలెక్టర్, DMHO ఇన్ పేషేంట్స్ చేర్చుకోవలని ఆదేశాలు ఇచ్చారు


ఆసుపత్రి బెడ్స్ ఫుల్ అవటంతో 10 శాతం బెడ్స్ కూడా కేటాయించలేక పోయాం


2 నెలల నుంచి కొన్ని కేసులు మాత్రం హోటల్ ఐసోలేషన్ సెంటర్లలో చేస్తున్నాం


రెండు హోటల్స్ లో రమేష్ ఆసుపత్రి వీటిని నిర్వహిస్తోంది


హోటల్ నిర్వహణ హోటల్ యాజమాన్యం, మెడికల్ ఫెసిలిటీ మాత్రం రమేష్ ఆసుపత్రి చేసేలా ఒప్పందం


ప్రాణాలు కోల్పోవడం బాధాకరం


5 గంటలకు ప్రమాదం జరిగింది


ఫైర్, పోలీస్, రెస్క్యూ టీమ్ సేవలు అభినందనీయం


2020-08-10 09:32 GMT

అమరావతి....


జీ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్


స్వర్ణ ప్యాలెస్ జరిగిన సంఘటన దురదృష్టం..


సీఎం జగన్ జరిగిన ప్రమాదంపై స్పందించిన తీరు అద్భుతం..


ప్రమాదం జరిగిన వెంటనే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు..


బాధితులకు 50 లక్షల పరిహారం సీఎం జగన్ ప్రకటించారు..


స్వర్ణ ఫ్యాలస్ సంఘటనపై చంద్రబాబు ఎందుకు నోరుమీదపలేదు..


రమేష్ చౌదరి టీడీపీకి చెందిన నేత..


చంద్రబాబు నిర్వహించిన జూమ్ కార్యక్రమంలో రమేష్ చౌదరి పాల్గొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు..


కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిసింది..


రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే కమిటీలు వేసే చంద్రబాబు నిన్న జరిగిన ప్రమాదంపై ఎందుకు కమిటీ వేయలేదు..


కరోనా రోగులను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి ప్రభుత్వం అనుమతినిస్తే దాన్ని కొన్ని హాస్పిటల్స్ దుర్వినియోగం చేస్తున్నాయి..


పాలన బాగోలేదని విమర్శలు చేసే రమేష్ చౌదరి కరోనా పెసెంట్స్ నుంచి వేలకు వేలు లక్షలకు లక్షలు వసూళ్ళు చేస్తున్నారు..


రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది చనిపోయారు అని ప్రాధమికంగా తేలింది..


రాజధాని నడి బొడ్డున భారీ అగ్ని ప్రమాదం జరిగితే ఎందుకు చంద్రబాబు మాట్లాడం లేదు..


ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన బాధ్యలపై కఠిన చర్యలు తీసుకుంటాము...


దోచుకోవడం కోసమే అమరావతిని చంద్రబాబు నిర్మిస్తున్నారు..


వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన అవసరం మాకు లేదు..


మాకు ఏ ప్రాంతంపైన దురుద్దేశ్యం లేదు..


రాయలసీమ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు..


గతంలో పవన్ కళ్యాణ్ రాజధాని కర్నూల్లో పెట్టాలని మాట్లాడారు..


కర్నూలు ల్లో న్యాయ రాజధాని వద్దని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రజలకు చెప్పాలి..


న్యాయ రాజధాని రాయలసీమకు వస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు


ప్రతి అంశాన్ని చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు


జేసీ ప్రభాకర్ రెడ్డి దళిత పోలీస్ అధికారిపై దాడి చేస్తే ఎందుకు నోరు మెడపలేదు


2020-08-10 09:31 GMT

అమరావతి...

ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అలుపెరుగని రాజకీయ పొరాట యోధుడు పెనుమత్స సాంబశివరాజు గారు మన మధ్య ఇక లేరు అన్నమాట నమ్మశక్యంగా లేదు.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక తెలుగు నాయకుడు.

ఆయన మరణం పార్టీకీ, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.

2020-08-10 08:25 GMT

అమరావతి

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు

నిర్దేశిత సమయం లోగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షణ

దీని కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌

పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) కాల్‌ సెంటర్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా అప్రమత్తం చేయనున్న పీఎంయూ

నిర్దేశించుకున్న సమయం లోగా పరిష్కారం అయ్యేలా చూడనున్న పీఎంయూ

మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబరు నుంచి 543కి పైగా సేవల అమలు ప్రక్రియను పర్యవేక్షించనున్న పీఎంయూ

గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం

మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ప్రారంభించిన సీఎం

ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఈ సచివాలయాలు అనుసంధానం

ఇంటర్నెట్‌ లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం

ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు

మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానం చేస్తామన్న అధికారులు

తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై సమగ్ర సమీక్ష చేసిన సీఎం

గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు

ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు

వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం

అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం

గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలి

ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి

సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలన్న సీఎం

Tags:    

Similar News