Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26
ఈరోజు తాజా వార్తలు
జాతీయం: రాహుల్ గాంధీతో సమావేశం అయిన సచిన్ పైలెట్ , ఆయన వర్గం శాసన సభ్యులు
[సీఎం అశోక్ గెహ్లాట్ తో తనకున్న విభేదాలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారు .
రాజస్థాన్ లో పార్టీ బలోపేతం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను .
నాపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానం వచ్చింది
నేను లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముగ్గురు సభ్యులు ప్రియాంక గాంధీ , అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ ల తో కమిటీ ఏర్పాటు చేసారు .
సోనియా గాంధీ కి కృతజ్ఞతలు - సచిన్ పైలెట్
విజయవాడ: కంప్యూటర్ ఆపరేటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాంచారయ్యపై వేటు
కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సూపరిండెంట్ నాంచారయ్య ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జనరల్ సర్జరీ professor డా.శివశంకర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: 2018-19 ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుకి సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ
కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
తదుపరి విచారణ రెండువారాలకు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం
తూర్పుగోదావరి -రాజమండ్రి: రాజమండ్రి బొమ్మూరు క్వారెంటైన్ నుండి పారిపోయిన దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన వ్యక్తి గోకవరం ఆర్టీసీ కాంప్లెక్ వద్ద పట్టుకున్న అధికారులు
తిరుపతి: ఎస్వీబీసీ సీఈఓగా కేంద్ర సమాచార శాఖ డెప్యూటీ డైరెక్టర్ సురేష్ కుమార్ గెదెలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.
ప్రస్తుతం విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న సురేష్ కుమార్.
కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషనుపై రాష్ట్ర సర్వీసులోకి చేరిన సురేష్ కుమార్.
అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సవాల్ చేస్తూ హైకోర్టు మరో పిటిషన్
పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ రామకృష్ణ
బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు
చైర్మన్ ఆదేశాలు పాటించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధం
శాసన మండలి సభ్యుడిగా మా హక్కులను ప్రభుత్వం కాలరాసింది
చట్టాలు చేసేటప్పుడు ద్విసభలు ఉన్నటువంటి రాష్ట్రాలో శాసన మండలి అభిప్రాలను కూడా తీసుకోవాలి.
ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులను ఆమోదించుకున్నందున్న వాటిని రద్దు చేయాలని కోరిన పిటిషనర్
అమరావతి: వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా పథకాలు భేష్
మహిళలకు ఈ పథకాల ద్వారా మంచి సహాయం అందుతోంది
ఆర్థిక రంగానికి చోదకంగా మారుతాయి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు తోడ్పాటునందిస్తాయి
సహకరిస్తామన్న బ్యాంకింగ్ దిగ్గజాలు
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వివిధ బ్యాంకుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీ: (ఢిల్లీ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల)
• దేశ రాజధానిలో 1 లక్ష 46వేలు దాటిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య.
• దేశ రాజధానిలో గడచిన 24 గంటలలో 707 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు.
• గడచిన 24 గంటలలో డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1070
• గడచిన 24 గంటలలో “కరోనా” కారణంగా 20 మంది మృతి.
• దేశ రాజధానిలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 1,46,134 మొత్తం మృతుల సంఖ్య 4,131
• ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,31,657
• ఢిల్లీ లో “యాక్టివ్” కేసుల సంఖ్య 10346
• ఢిల్లీ లో ఈరోజు నిర్వహించిన “కరోనా” RTPCR టెస్ట్ ల సంఖ్య 3311
• ఢిల్లీ లో ఈ రోజు నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ ల సంఖ్య 9,012
• దేశరాజధానిలో ఇప్పటి వరకు నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 12,04,405
• ప్రతి పదిలక్షల జనాభాకు నిర్వహిస్తున్న కరోనా వైరస్ టెస్ట్ ల సంఖ్య 63,389
• దేశ రాజధాని లో హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 5,637
• ఢిల్లీ లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 477
• ఢిల్లీ లో ప్రభుత్వ / ప్రైవేట్ హాస్పటల్స్ లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 13,527
జాతీయం: హర్యానా క్యాంపు నుండి జైపూర్ కు బయలు దేరిన సచిన్ పైలెట్ వర్గం శాసనసభ్యులు
- సచిన్ పైలెట్ తో వివాదం ముగిసిందని ప్రకటించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
- కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయడానికి సచిన్ పైలెట్ అంగీకరించారని ప్రకటించిన కేసీ వేణుగోపాల్
- సచిన్ పైలెట్ ప్రకటన కోసం వేచిచూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం
- సీఎం అశోక్ గెహ్లాట్ తో సమావేశం అయిన సచిన్ పైలెట్ వర్గం శాసన సభ్యులు భన్వర్ లాల్ శర్మ
పాలకొల్లులో ఆర్థిక ఇబ్బందులతో ఓ పురోహితుడు ఆత్మహత్య ..
లాక్ డౌన్ నేపధ్యంలో పురోహిత్యం లేక ఆర్ధిక ఇబ్బందులు భరించలేక
పవన్ కుమార్ అనే పురోహితుడు చించినాడ వద్ద గోదావరి లో దూకి ఆత్మహత్య
గాలిస్తున పోలీస్,రెవిన్యూ సిబ్బంది..