అమరావతిగ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు

నిర్దేశిత సమయం లోగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షణ

దీని కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌

పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) కాల్‌ సెంటర్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా అప్రమత్తం చేయనున్న పీఎంయూ

నిర్దేశించుకున్న సమయం లోగా పరిష్కారం అయ్యేలా చూడనున్న పీఎంయూ

మొదటగా నాలుగు సర్వీసులు, అక్టోబరు నుంచి 543కి పైగా సేవల అమలు ప్రక్రియను పర్యవేక్షించనున్న పీఎంయూ

గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం

మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ప్రారంభించిన సీఎం

ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఈ సచివాలయాలు అనుసంధానం

ఇంటర్నెట్‌ లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం

ఇందులో 213 సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు

మిగిలిన సచివాలయాలను వచ్చే 2 నెలల్లో అనుసంధానం చేస్తామన్న అధికారులు

తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై సమగ్ర సమీక్ష చేసిన సీఎం

గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు

ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు

వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం

అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం

గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలి

ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి

సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలన్న సీఎం

Update: 2020-08-10 08:25 GMT

Linked news