Khammam District Updates: పవర్ కెనాల్ బ్రిడ్జ్ పై ఆర్టీసీ బస్,డిసియం ఢీ....
ఖమ్మం జిల్లా..
* కూసుమంచి మండలం పాలేరు గ్రామ సమీపంలో పవర్ కెనాల్ బ్రిడ్జ్ పై ఆర్టీసీ బస్,డిసియం ఢీ....
* పలువురికి గాయాలు....
* భారీగా నిలిచిన ట్రాఫిక్...
Sangareddy Updates: చైతన్య నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం!
సంగారెడ్డి
* గుమ్మడిదల (మం)బొంతపల్లి గ్రామంలో చైతన్య నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం తో కిష్టయ్య ( 72 ) అనే వ్యక్తి మృతి.
* కుటుంబ సభ్యులు, బంధువుల తో ఆసుపత్రి ఎదుట ఆందోళన.
* ఆసుపత్రి అద్దాలు ధ్వసం చేసిన బంధువులు.
* ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
Adilabad Updates: రైతులను ముంచిన కాయకుళ్లు తెగులు..
ఆదిలాబాద్...
- బజార్హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామంలో రైతులను ముంచిన కాయకుళ్లు తెగులు..
- సాగు చేసిన 4 ఎకరాల పత్తి పంటకు పూర్తిగా కాయ కుళ్లు తెగులు సోకడం తో ట్రాక్టరు తో దున్ని పూర్తి పంటను తొలగించిన రైతు ఉద్ధవ్ పాలే
- అదుకోవాలని సర్కార్ ను కోరుతున్నా రైతు
Telangana High Court Updates: మళ్ళీ హైకోర్టు కు చేరిన దిశ ఎన్ కౌంటర్ చిత్రం....
టీఎస్ హైకోర్టు......
* నేడు హైకోర్టులో విచారణ
* చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టు లో రిట్ పిటీషన్ దాఖలు చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి
* రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని వెంటనే ఆపేల ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటీషన్
* ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నారు
* వాటిని తొలగించాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
* ఈ నెల 26 న విడుదల కానున్న దిశ ఎన్కౌంటర్ చిత్రం
* ఇప్పటికే సుప్రీం జ్యుడీషియల్ కమిషన్ కు సినిమా ఆపాలని పిర్యాదు చేసిన నిందుతుల కుటుంబ సభ్యులు
* నేడు మరో మారు హైకోర్టులో విచారణ
Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-6 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 98,50 మీటర్లు
-ఇన్ ఫ్లో 11,500 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 21,000 క్యూసెక్కులు
Telangana Updates: రాష్ట్ర వ్యాప్తంగ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన బండి సంజయ్...
* బీజేపీ నేతలను అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసిన పార్టీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి.
* ఆయన మృతికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగ అన్ని మండల కేంద్రాలల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Telangana Weather Updates: తెలంగాణ రాష్ట్రం లో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
* ఉమ్మడి ఆదిలాబాద్ అత్యల్పంగా రికాడ్డైన ఉష్ణోగ్రతలు..
* ఆదిలాబాద్ జిల్లా...
* బేలలో 10.3 డిగ్రీలు.
* నిర్మల్ జిల్లా కుబీర్ లో10.6
* ఆదిలాబాద్ జిల్లా అర్లి టి10.7డిగ్రీలు
* బారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో వణుకుతున్నా ఉమ్మడి ఆదిలాబాద్..
* కాశ్మీర్ ని తలపించేవిదంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అందోళన చెందుతున్నా ప్రజలు..
* చలి నుండి రక్షించుకోవడానికి చలి కాచుకుంటున్నా ప్రజలు..