Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
వరంగల్ అర్బన్...
- హన్మకొండ లోని సుబేదారి లో ఐ పి ఎల్ క్రికెట్ బెట్టింగ్ టీమ్ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.
- 15 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
సూర్యాపేట జిల్లా....
- సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతుల ఆందోళన.
- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై ధాన్యం ట్రాక్టర్లు అడ్డుపెట్టి రైతుల నిరసన..
- నల్గొండ కోదాడ రహదారి పై భారీగా నిలిచిపోయిన వాహనాలు.
- సిఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం...
మహబూబ్ నగర్ జిల్లా :
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
- చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు యధావిధి గానే కొనసాగుతాయి..
- కరోనా నేపథ్యంలో ప్రజలు తక్కువ సంఖ్యలో పాల్గొనాలి.
- జాతరలో ఎలాంటి షాప్స్ గూడరాలు అనుమతి అనుమతి లేదు..
నల్గొండ
- ఎలాంటి లక్షణాలు లేవిని ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపిన ఎమ్మెల్యే ..
- తనతో పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న వారు కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని కోరిన ఎమ్మెల్యే రవీంద్ర నాయక్..
- త్వరలో బీజేపీ లో చేరబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ మేయర్ , మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.
- ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు. నేను టీఆరెస్ పార్టీలోనే ఉంటున్న అంటున్న తీగల.
- రేపు సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష.
- సమావేశానికి హాజరుకానున్న వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో .
- నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.
-రేపు మధ్యాహ్నం కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష.
-2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .
-కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.
-ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.
-సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.
టీఎస్ హైకోర్టు....
- డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ..
- గతంలో ఫామ్ 18, అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా అప్లికేషన్ చేసుకునేల చేస్తామన్న ఈసీ..
- గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని హైకోర్టుకు తెలిపిన ఈసీ..
- అవసరమైతే డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని కోర్టుకు తెలిపిన ఈసీ..
- ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపిన ఈసీ..
- ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణ ముగించిన హైకోర్టు
- పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలన్న హైకోర్టు ఆదేశాల ను అమలు చేస్తామన్న ఈసీ.
- డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఓటు హక్కు నమోదు కల్పిస్తామన్న ఈసీ.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
* జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య.
* తల్లి సంగరి లాస్య(25) రెండున్నరేళ్ల పాప మహితి తో సహా ఉరివేసి ఆత్మహత్య.
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
సంగారెడ్డి జిల్లా...
-పఠాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి పై పఠాన్ చెరు వైపు వెళ్తూ అదుపుతప్పి కారు భీభత్సం..
-రహదారి పక్కన కూరగాయల షాప్ పై దూసుకెళ్లి విద్యుత్ స్తంబానికి ఢీ కొని కారు బోల్తా...
-షాప్ వైపు వెళ్తున్న మహిళను కారు ఢీ కొనడం తో విప్పల గడ్డ తాండకు చెందిన దేవి అనే మహిళకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం ,ఆసుపత్రి కి తరలింపు.