రామలింగా రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి..
అంచనాల కమిటీ చైర్మన్ ,దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ ,సీఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .
రామలింగా రెడ్డి మరణం తెలంగాణ రాష్ట్రానికి ,టీఆర్ఎస్ పార్టీ కి ,జర్నలిజానికి తీరని లోటనీ ,వ్యక్తి గతంగా తాను ఓ గొప్ప మిత్రుడిని కోల్పోయానని ఆయన తన సంతాప సందేశం లో నివాళులర్పించారు .
నిరాడంబరుడిగా, విలక్షణ రాజకీయ నాయకుడిగా తెలంగాణ సమాజం లో గుర్తింపు తెచ్చుకున్న రామలింగా రెడ్డి అకాల మరణం అందర్నీ కలచి వేసింది.
సుభాష్ రెడ్డి దివంగత నేత కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ,శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిబద్ధత కలిగిన నేతను కోల్పోయాం: మంత్రి జగదీష్ రెడ్డి
- ఉద్యమ మిత్రుడు దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు.
- తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.
- వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభిస్టం నెరవేర్చిన మహనీయుడు అని ఆయన కొనియాడారు.
గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి స్వల్పంగా పెరిగిన వరద ఔట్ ఫ్లో
తూర్పుగోదావరి, రాజమండ్రి:
- గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి స్వల్పంగా పెరిగిన వరద ఔట్ ఫ్లో
- 82వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
- ధవలేశ్వరం వద్ద 10.90 అడుగుల గోదావరి నీటమట్టం
- భారీవర్షాలతో పంటకాల్వలకు తగ్గించిన నీరు విడుదల
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కెసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు..
- ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కెసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
- ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
- ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఆయన ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
నేడు తెలంగాణ భవన్ లో కార్యక్రమాలు రద్దు చేసుకున్న టీఆర్ఎస్
హైదరాబాద్:
ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఈరోజు తెలంగాణ భవన్లో తలపెట్టిన కార్యక్రమాలు రద్దు చేసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రామలింగారెడ్డి అకాల మరణం పట్ల నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి
- దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం పట్ల నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- జర్నలిస్ట్ గా మరియు సీనియర్ ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యల పై రామలింగారెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు.
- సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం టిఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణకు తీరని లోటు అన్నారు.
- ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
రామలింగారెడ్డి మృతి నన్ను ఎంతగానో కలిచివేసింది: ఎమ్మేల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి:
- మిత్రుడు, సోదరుడు, సహచర ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి నన్ను ఎంతగానో కలిచివేసింది.
- జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల పక్షాన నిలబడ్డ రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లా కు తీరని లోటు.
- ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
హైదరాబాద్:
- హైదరాబాద్ నుండి రామలింగ రెడ్డి పార్థివ దేహం దుబ్బాక కు తరలించారు...
- స్వగ్రామం చిట్టపుర్ లో అంతక్రియలు..
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ ఎదురుదెబ్బ
అంతర్జాతీయం:
- ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ ఎదురుదెబ్బ
- 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ లో భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రస్తావించిన పాకిస్థాన్
- పాకిస్థాన్ వాదనను తోసిపుచ్చిన భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలు. భారతదేశ వాదనకు మద్దతు.
- కాశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమన్న భద్రతామండలి
రామలింగారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ సంతాపం
- సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మెన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
- 4 సార్లు సహచర ఎమ్యెల్యేగా పని చేసిన రామలింగారెడ్డి ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని, సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడని అన్నారు.
- ప్రజా ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించిన నాయకుడు రామలింగారెడ్డి.
- ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని అన్నారు.
- ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము..