Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-05 23:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-06 16:04 GMT

సూర్యాపేట జిల్లా :

- అనంతగిరి మండలం ద్వారకుంట వద్ద జాతీయ రహదారిపై ఆటోను వెనకనుంచి ఢీకొట్టిన కారు.

 -ఒక మహిళ మృతి,ఐదుగురికి తీవ్రగాయాలు.

- కోదాడ ఆసుపత్రికి తరలింపు.

2020-08-06 16:00 GMT

మహబూబాబాద్ జిల్లా:

- జిల్లాలో నేడు 64 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

2020-08-06 15:58 GMT

ఆదిలాబాద్:

- నేరేడిగోండ మండలం చించోలి గ్రామం వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

- ద్విచక్ర వాహనం ,ఆటో ఢీ. ద్విచక్ర వాహనం పై ఉన్న ఇద్దరు యువకుల పరిస్థితి విషమం రిమ్స్ కు తరలిస్తుండగా మార్గ మద్యలో ప్రాణాలు కోల్పోయిన యువకులు...

- ఘటన స్థలం లో తెగిపడ్డ యువకుని చెయి

2020-08-06 14:24 GMT

- వరంగల్ లో సోషల్ మీడియాలో కరోనాకు హోమియోపతి లో మందు అంటూ వచ్చిన అసత్య ప్రచారం పై ఎంక్వేరి చేసాం.

- ఇలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దు.

- హోమియోపతి లో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. కానీ కరోనా అరికట్టే మెడిసిన్ లేదు.

- వరంగల్ డాక్టర్ విఎస్ రెడ్డి చేసింది అంత అసత్య ప్రచారం.

- హోమియోపతి కి వేతిరేకంగా వ్యవహరించాడు.

- దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. అందులో భాగంగానే ఈ రోజు ఎంక్వేరి చేసాం.

- కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.

- ప్రభుత్వం నుండి వచ్చే వరకు విఎస్ రెడ్డి హాస్పిటల్ సీజ్ లోనే ఉంటుంది.

- హోమియోపతి లో కరోనాకు వైద్యం కావాలి అంటే ఎంజిఎం హాస్పిటల్ లో ఆయుష్ వార్డుకి రావాలి.

- రామంతపూర్ లో పాజిటివ్ పేషంట్స్ కి చికిత్స అందిస్తాం..

2020-08-06 14:22 GMT

- పొన్నాల లక్ష్మయ్య మాజీమంత్రి

- రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రాధాన్యత గల అంశాలను విస్మరించారు.

- మంత్రివర్గం సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తప్పుదోవ పట్టించారు.

- జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు అంటూ బొంకుతున్నారు.

- ఉద్యోగ కల్పన అంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు తొలగించారు.

- ఐటీ విస్తరణ అంటున్న కేసీఆర్ .... ఐటీఐఆర్ యానిమేషన్ హబ్ ఏమైందో చెప్పాలి.

- కరోనా పై కెసిఆర్ వన్ని తప్పుడు లెక్కలే.

- వ్యవసాయ అభివృద్ధి అంటున్న కేసీఆర్.. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇచ్చారా..?

- ప్రాజెక్టులపై నాతో బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నారు.

- 24 గంటల విద్యుత్ ఇచ్చిన.... ప్రాజెక్టుల ద్వారా నీరు ఇచ్చినా... ఈ ఐదేళ్లలో పంటల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు..

- వలస కార్మికులు ఆదుకుంటే కేసీఆర్ ను అభినందిస్త.

2020-08-06 14:20 GMT

- గురువారం ఒక్కరోజే వంద కేసులు నమోదు

- ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 108 మంది బాధితులు

- బయటకు రావాలంటే భయపడుతున్న జనం

2020-08-06 14:19 GMT

- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

- ఆసిఫాబాద్ 12, గొలెటీ 15, వ్యక్తులకు కరోనా పాజిటివ్.

-  కరోనా పాజిటివ్ నిర్ధారించినట్లు జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు.

2020-08-06 14:18 GMT

- ఆదిలాబాద్ జిల్లాలో బారీగా పెరుగుతున్న కరోనా కేసులు

- ఒక్కరోజు లో ఇరవై ఆరు కేసులు నమోదు..

- బాదితులను చికిత్స కోసం అసుపత్రికి తరలింపు

2020-08-06 14:15 GMT

కొమురం భీం జిల్లా:

- చింతలమానేపల్లి పోలీసు స్టేషను లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్..

- అక్రమ మద్యం రవాణా ఆటో పట్డుకోని వదిలిపెట్టిన ఆరోపణల పై వేటు వేసిన అధికారులు.

2020-08-06 12:33 GMT

- రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి

- ఆయన భార్య కు టికెట్ ఇస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరినట్టు

- ఉపఎన్నికల ఏకగ్రీవం కావడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో, దామోదర్ రాజనర్సింహ, గీతా రెడ్డి తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తా ....

- రామలింగారెడ్డి ఎమ్మెల్యే ఈవయసులో చనిపోవడం బాధాకరం

- రామలింగారెడ్డి రెడ్డి వివాదరహితుడు ...

- ఎన్నో సందర్భాల్లో మంత్రి హరీష్ రావుని నేను విమర్శించిన్నపుడు వద్దు జగ్గన్న అని చెప్పేవాడు

- గత ఆరునెలల కింద అసెంబ్లీ సమావేశంలో హరీష్ తో సమన్వయం చేసి కూర్చోబెట్టింది రామలింగారెడ్డినే

- సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు ని సన్మానించిన్నపుడు దానికి కూడా రెండోవా సూత్రధారి రామలింగారెడ్డి యే ..

- 2004 నుండి నాకు రామలింగారెడ్డి ఇద్దరం వేర్వేరు పార్టీలైన మంచి సత్సంబంధాలు ఉండేవి

- చావుని ఎవరం ఆపలేము

- ఒకటిమాత్రం నిజం ప్రాణాలకు తెగించి విప్లవ పార్టీలో పని చేసిన వ్యక్తి

- రామలింగారెడ్డి నైతిక విలువలు ఉన్న నాయకుడే

- రామలింగారెడ్డి జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి

- దుబ్బాకలో తప్పనిసరి ఉపఎన్నికలు రావడం ఖాయం

Tags:    

Similar News