బీజేపీ మీడియా స్టేట్మెంట్: కె .కృష్ణసాగర రావు.
- కె .కృష్ణసాగర రావు..బీజేపీ
- ముఖ్య అధికార ప్రతినిధి.
- సీఎం కేసీఆర్ ఏక ఛత్రాధిపత్యాన్ని బీజేపీ ఖండిస్తుంది.
- రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిపక్ష పార్టీల శాసన సభాపక్షనేతలను కానీ ఆయా పార్టీల అధ్యక్షులను కానీ పరిగణనలోకి తీసుకోకపోవడం పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
- ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కనీసం ప్రతిపక్షాలను కూడా సంప్రదించకుండా సచివాలయ కొత్త భవనాలను ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది.
- రాష్ట్రంపై,ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం.
- ప్రతిపక్ష పార్టీలను బాగస్వామ్యులను చేయడం వల్ల ప్రజల గొంతుక వినిపిస్తుంది.విస్తృతమైన సలహాలు వస్తాయి.
- కొత్త సచివాలయ భవనం డిజైన్ నిజాం కాలం నాటి కట్టడాలను,నిజాం కాలం నాటి నిర్మాణ శైలిని సూచిస్తోంది.
- ఇది ప్రభుత్వ పరిపాలన భవనంలా కాకుండా ఒక మసీదులా కనిపిస్తోంది.
- ఒక విదేశీ నియంత నిజాం కట్టిన ఐదు వందల ఏళ్ల క్రితం కట్టిన పాతకాలపు భవన్ నిర్మాణ శైలి కట్టడాలను ఇప్పుడు ఆధునిక సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారో ప్రజలకు సీఎం కేసీఆర్ వివరించాలి.
- ప్రస్తుతం బ్రహ్మాండంగా పని చేస్తున్న సచివాలయ భవనాన్ని కూలగొట్టి నాలుగు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ కొత్త సచివాలయ భవనాన్ని కడుతున్న కేసీఆర్ అందులో తన రాజకీయ వారసత్వాన్ని నిలువుకునేలాగా ,ముస్లింల ఓట్ల కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు.
- ప్రభుత్వ పరిపాలన భవనాలు ప్రభుత్వ పనితీరుకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర సచివాలయము ప్రస్తుత తరాన్ని , ప్రస్తుత భారతీయ నిర్మాణ శైలిని అలాగే భారత దేశంలో విలీనమైన స్వతంత్ర తెలంగాణ ఆకాంక్ష లకు చిహ్నంగా ఉండాలి. అంతే కానీ అది విదేశీ నియంత నిజాం నిరంకుశ పాలనను ప్రతిభింబించేలా ఉండకూడదు.
- ప్రస్తుతం సీఎం కేసీఆర్ ,కేబినెట్ ఆమోదించిన కొత్త సచివాలయం భవన నమూనాను బీజేపీ తిరస్కరిస్తుంది. దీనిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ,అఖిలపక్ష సలహాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రత్యామ్నాయ భవన నమూనా పై అఖిలపక్ష సలహాలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
మంచిర్యాల జిల్లా:
నస్పూర్ మున్సిపల్ కో అప్షన్ సభ్యులుగా టీఆరెస్ కు చెందిన ముత్తె రాజేశం,భాగ్యలక్ష్మి, నాసర్, హజూర్నిశ బేగం ఏకగ్రీవంగా ఎన్నిక
గాంధీ భవన్ ఎదుట ఉల్లి గడ్డ లోడ్ తో వెళ్తున్న మిని డీసీమ్ బోల్తా..
నాంపల్లి:
- గాంధీ భవన్ ఎదుట ఉల్లి గడ్డ లోడ్ తో వెళ్తున్న మిని డీసీమ్ బోల్తా..
- నేలమట్టం అయిన ఉల్లి గడ్డల వాహన..
- భారీగా ట్రాఫిక్ జామ్..
- ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు..
- వాహనాన్ని పక్కకు జరిపి పోలీసులు..
- అధిక బరువు లోడ్ తో వెళ్లడం
- డ్రైవర్ ఒక్క సారిగా కుడి వైపు తిప్పడం బొలతా పడ్డ వాహనం..
సిద్దిపేట :
ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సిద్దిపేట జెడ్పి చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్.
ప‌్రొఫెసర్ జయశంకర్ సార్, సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిది: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్:
- ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సార్‌కు ఘన నివాళుర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
- ప‌్రొఫెసర్ జయశంకర్ సార్, సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిది.
- ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరకాలకు మార్గదర్శకాలు
- జయశంకర్ సార్ ఆజన్మాంతం బ్రహ్మచారిగా, తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారు.
- యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు.
- జయశంకర్ సార్ ఆశయాలనే ఆదేశిక సూత్రాలుగా, సీఎం కెసిఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు.
- తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలవడానికి సిఎం కెసిఆర్ గారికే స్ఫూర్తిగా జయశంకర్ గారు నిలిచారు.
- ఆచార్య జయశంకర్ సార్ తో నాకున్న అనుబంధం కొన్ని దశాబ్దాల నాటిది
- జయశంకర్ సార్, నడుస్తున్న తెలంగాణ చారిత్రక గ్రంథంగా ఉండే వారు
- జయశంకర్ సార్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తి దాయకం
సిద్దిపేట :
ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
వేములవాడ పట్టణంలో విజృంభిస్తున్న కరోనా
రాజన్నసిరిసిల్ల జిల్లా:
- బిజెపి రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ
- తనకు వైరస్ నిర్ధారణ అయినట్లు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించిన రామకృష్ణ
- వైద్యుల సూచన మేరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడి
- తనతో సన్నిహితంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచన
చాడా వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
- ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు" నినాదంతో రేపు ప్రగతి భవన్ వద్ద నిరసన తెలపుతాం
- కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది
- నిరసన కార్యక్రమంలో కమ్యూనిస్టులు, టీజేఎస్, టీటీడీపీ, ప్రజా సంఘాలు పాల్గొంటాయి
- ఎల్.రమణ టిటిడిపి అధ్యక్షుడు
- ప్రభుత్వాన్ని మేల్కపటానికే ప్రగతి భవన్ వద్ద నిరసన తెలపాలని నిర్ణయించాం
- కరోనా నియంత్రణపై క్యాబినెట్ లో చర్చించకపోవటం బాధాకరం
- ప్రజా సమ్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి
- ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయారు
- కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
- ప్రొ.కోదండరాం
- జనసమితి అధ్యక్షుడు
- ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రేపు ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతాం
- 9గంటల క్యాబినెట్ సమావేశంలో కరోనా గురించి చర్చించకపోవటం బాధాకరం
- పేదలకు ఆరు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలి
- కరోనా సమయంలో మంత్రుల పుట్టినరోజు వేడుకులకు అనుమతి ఇవ్వటం దౌర్భాగ్యం
- పనులు లేక పేదలు, వివిధ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
- 4 శాతం వద్దే రెపో రేటు, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగింపు.
- రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయం.
- ఆర్థిక వ్యవస్థకు కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు సమాచారం.
- అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడి.