బీజేపీ మీడియా స్టేట్మెంట్: కె .కృష్ణసాగర రావు.
- కె .కృష్ణసాగర రావు..బీజేపీ
- ముఖ్య అధికార ప్రతినిధి.
- సీఎం కేసీఆర్ ఏక ఛత్రాధిపత్యాన్ని బీజేపీ ఖండిస్తుంది.
- రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిపక్ష పార్టీల శాసన సభాపక్షనేతలను కానీ ఆయా పార్టీల అధ్యక్షులను కానీ పరిగణనలోకి తీసుకోకపోవడం పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
- ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కనీసం ప్రతిపక్షాలను కూడా సంప్రదించకుండా సచివాలయ కొత్త భవనాలను ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది.
- రాష్ట్రంపై,ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం.
- ప్రతిపక్ష పార్టీలను బాగస్వామ్యులను చేయడం వల్ల ప్రజల గొంతుక వినిపిస్తుంది.విస్తృతమైన సలహాలు వస్తాయి.
- కొత్త సచివాలయ భవనం డిజైన్ నిజాం కాలం నాటి కట్టడాలను,నిజాం కాలం నాటి నిర్మాణ శైలిని సూచిస్తోంది.
- ఇది ప్రభుత్వ పరిపాలన భవనంలా కాకుండా ఒక మసీదులా కనిపిస్తోంది.
- ఒక విదేశీ నియంత నిజాం కట్టిన ఐదు వందల ఏళ్ల క్రితం కట్టిన పాతకాలపు భవన్ నిర్మాణ శైలి కట్టడాలను ఇప్పుడు ఆధునిక సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారో ప్రజలకు సీఎం కేసీఆర్ వివరించాలి.
- ప్రస్తుతం బ్రహ్మాండంగా పని చేస్తున్న సచివాలయ భవనాన్ని కూలగొట్టి నాలుగు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ కొత్త సచివాలయ భవనాన్ని కడుతున్న కేసీఆర్ అందులో తన రాజకీయ వారసత్వాన్ని నిలువుకునేలాగా ,ముస్లింల ఓట్ల కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు.
- ప్రభుత్వ పరిపాలన భవనాలు ప్రభుత్వ పనితీరుకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర సచివాలయము ప్రస్తుత తరాన్ని , ప్రస్తుత భారతీయ నిర్మాణ శైలిని అలాగే భారత దేశంలో విలీనమైన స్వతంత్ర తెలంగాణ ఆకాంక్ష లకు చిహ్నంగా ఉండాలి. అంతే కానీ అది విదేశీ నియంత నిజాం నిరంకుశ పాలనను ప్రతిభింబించేలా ఉండకూడదు.
- ప్రస్తుతం సీఎం కేసీఆర్ ,కేబినెట్ ఆమోదించిన కొత్త సచివాలయం భవన నమూనాను బీజేపీ తిరస్కరిస్తుంది. దీనిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ,అఖిలపక్ష సలహాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రత్యామ్నాయ భవన నమూనా పై అఖిలపక్ష సలహాలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.