సచివాలయం ఎదుట కాంట్రాక్టు హౌస్ కీపింగ్ ఉద్యోగుల ఆందోళన..
అమరావతి:
- తమకు జీతాలు చెల్లించాలని సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన.
- విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ హౌస్ కీపింగ్ కార్మికులు.
- సచివాలయంలో వివిధ విభాగాల్లో హౌస్ కీపింగ్, ఆఫీసు సెక్షన్, కిచెన్, గార్డెన్,ప్లంబింగ్,స్క్రాప్ ట్రాన్స్పోర్ట్ లో పని చేస్తున్న కార్మికులు.
జాతీయం:
గుజరాత్ అహ్మదాబాద్ లోని నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో భారీగా చెలరేగిన మంటలలో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధాని దిగ్భ్రాంతి.
చనిపోయిన వారి బంధువులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారకి 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడి
రావులపాలెం లో కలకలం రేపిన చిన్నారుల అదృశ్యం
త గోదావరి..
- రావులపాలెం మండలం రావులపాడులో ఇద్దరు చిన్నారులు ఆదృశ్యం
- ఆరు ఏళ్లు, అయిదు ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు సాయంత్రం నుంచి కన్పించడం లేదు
- కాలువ గట్టున గుడారంలో ఉంటున్న వలస కుటుంబాలలో పిల్లలు
- పిల్లలు ఆదృశ్యంతో రావులపాలెం పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
- రావులపాలెం మం రావులపాడులో ఇంకా లభ్యం కాని అదృశ్యమైన చిన్నారులు ఆచూకీ
- కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 28 కుటుంబాలు రావులపాడులోని కాలువ గట్టుపై గుడారాలలో కాపురాలు
- గ్రామాల్లో ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించే కుటుంబాలు
- వారిలో రెండు కుటుంబాలకు చెందిన చిన్నారులు ఆడుకుంటూ కార్తీక్(6), నాని(5) నిన్న అదృశ్యం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రావులపాలెం పోలీసులు
తూర్పుగోదావరి - రాజమండ్రి
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
రాజమండ్రిలోని కొవిడ్ ఆసుపత్రికి తరలింపు
కర్నూలు జిల్లా లో కరోనా విజృంభణ
కర్నూల్ జిల్లా..
జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 22063 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
కరోనా నుంచి కోలుకుని 12146 మంది డిశ్చార్జ్..
ప్రస్తుతం 9696 గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య..
ఇక కరోనా బారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు 226 మంది మృతి..
శ్రీశైలం జలాశయంలో తక్కువగా కొనసాగుతున్న వరద ప్రవాహం
కర్నూలు జిల్లా
- ఇన్ ఫ్లో : 28,433 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో : 38,134 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 848.90 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు
- ప్రస్తుతం : 77.6874. టిఎంసీలు
ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
వెదర్ అప్ డేట్
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
- రెండు రోజులలో బలహీన పడే అవకాశం..
- 7.4 కీ.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం...
- వీటి ప్రభావంతో 6,7,8, తేదిలలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు