Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
విజయవాడ:
- విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సీఎస్
- కోవిడ్ నిబంధనల దృష్ట్యా అన్ని జాగ్రత్తలతో ఆగస్టు 15 న వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
- ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న పథకాలతో కూడిన శకటాలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం
- కోవిడ్ దృష్ట్యా ఆహ్వానితుల సంఖ్యను పరిమితం చేయాలని సూచనలు జారీ
- మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేడుకలకు వచ్చే ప్రతీ ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసిన సీఎస్ నీలం సాహ్ని
- విజయవాడ ఎంజీ రోడ్ ను సుందరీకరించాలని నగర మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు
తిరుమల:
- టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు(45) మరణించడంతో శ్రీవారి ఆలయ అర్చకుల్లో భయం భయం
- శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో సమావేశమైన అర్చకులు
- ఉదయం 5 గంటలకు సుభ్రభాత సేవ ప్రారంభించి సాయంత్రం 7 గంటలకు ఏకాంతసేవ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్న అర్చకులు
- కళ్యాణోత్సవ సేవను ఈనెల 31వ తేది వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని సూచిస్తున్న అర్చకులు
- కళ్యాణోత్సవ సేవలో వాహన బేరర్ల ద్వారా కరోనా సోకుతోందని భయ పడుతున్న అర్చకులు
- రేపు టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓలను కలిసి వినతి పత్రం ఇవ్వనున్న అర్చకులు
ప.గో:
- ఓ ఆర్ .ఎమ్. పి డాక్టర్ ద్వారా 16 మందికి సోకిన కరోనా
- తనకి కోవిడ్ లక్షణాలున్నా గ్రామంలో అనేకమంది వైద్యం చేసిన ఆర్.ఎం.పీ..
- ఆర్ .ఎమ్. పి డాక్టర్ నిర్లక్ష్యం తో ఒకరి నుండి మరొకరికి కోవిడ్ వ్యాప్తి..
- మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు
- స్వచ్ఛందగా గ్రామాన్నీ లాక్ డౌన్ చేసుకొని ఇంటికే పరిమితమైన గ్రామస్తులు
అమరావతి:
- రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలట! ఎవరు ప్రయాణం చెయ్యాలన్నా ఇబ్బంది పడకూడదు, దండిగా నీళ్లు ఉండాలి.
- ఇవి జగన్ రెడ్డి గారి ఆలోచనలు...మరి జే టర్న్ వెనుక రహస్యం ఏంటో?
అమరావతి:
- ఏపీ లో స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం
- అన్ని మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
- నగర పంచాయతీ ల్లో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రత్యేక అధికారుల పాలన
- ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ప్రత్యేక పరిస్థితి, ఇతర కారణాల వల్ల ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపూ
నెల్లూరు:
- కలువాయి (మం) దాచూరులో ముగ్గురు అన్నాదమ్ముల మధ్య కుటుంబ కలహాలు...
- మధ్యస్థం చెయ్యడానికి ఇంటికి వెళ్ళిన గ్రామపెద్ద దంపతులపై సుబ్బారెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో దాడి...
- ఇద్దరి పరిస్థితి విషమం.108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు...
నెల్లూరు:
- చేజర్ల (మం) మడపల్లి గ్రామం లో విషాదం..
- కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపంతో ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి..
నెల్లూరు:
- పొదలకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా పెద్దమల్లు రత్నమ్మ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- తొలిసారిగా మహిళకు ఏఎంసి చైర్మన్ గిరి
- రత్నమ్మ పొదలకూరు మండలం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు సిడిసి మాజీ చైర్మన్ పెద్దమల్లు రమణారెడ్డి సతీమణి.
ప.గో:
- ఇనుప బీరువా స్క్రూలు విప్పి చోరీ చేసిన దుండగులు
- 50 లక్షలకు పైగా అపహరించినట్లు సమాచారం..
- సెక్యూరిటీ గార్డుపైనే అనుమానం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన సంస్థ ప్రతినిధులు
తూర్పుగోదావరి:
రాజమండ్రి: స్వర్గీయ జక్కంపూడి జయంతి సందర్భంగా రాజమండ్రి కంబాలచెరువు జంక్షన్ లో జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ నాయకుడు జక్కంపూడి గణేష్