Live Updates: ఈరోజు (సెప్టెంబర్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-05 01:42 GMT
Live Updates - Page 2
2020-09-05 07:37 GMT

వినియోగదారుల వద్దకే సర్వీసు : సెంట్రల్ డిస్కమ్ సిఎండి పద్మ జనార్థన రెడ్డి

గుంటూరు:  వినియోగదారుల వద్దకే సర్వీసు అందివ్వాలనే ఉద్దేశంతో ఈఆర్ వో ఆఫిస్ ను డీసెంట్రలైజేషన్ చేశాం.

ఉచిత విద్యుత్ లో భాగంగా రైతుల వ్యవసాయ కనెక్షన్లుకు మీటర్లు పెడతాం.

పది వేల మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

రైతులందరికి ఉచిత విద్యుత్ అందించేందుకు సిఎం ఆదేశాలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం...

సిడిపిఎల్ పరిధిలో 4 50 000 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.

అనధికార కనెక్షన్లును రెగ్యులరైజ్ చేస్తాం..

రైతుకి ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్న వాటిపై ఈఆర్సీ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

పగటి పూటే రైతులందరికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.

2020-09-05 07:22 GMT

Save Private Teachers: ప్ర‌యివేట్ టీచ‌ర్ల‌ను ఆదుకోవాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

 అమరావతి: గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పూజలందుకోవాల్సిన గురువులు జీతాలు, ఆదరణ లేక తట్టాబుట్టా పట్టుకొని కూలీలుగా మారారు.

పీహెచ్డీ చేసి కూలీలుగా, తాపీ మేస్త్రి లుగా, హాకర్స్ గా దుర్భర జీవనం గడుపుతున్నారు.

ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
 

 రామకృష్ణ.

2020-09-05 03:07 GMT

Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

- శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతనీటి మట్టం:885.00 అడుగులు

- పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు

- ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

- ఇన్ ఫ్లో:72,350 క్యూసెక్కులు

- ఔట్ ఫ్లో: 62,350క్యూసెక్కులు

- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

2020-09-05 02:38 GMT

Kurnool Updates: ప్రధానమంత్రి ఇన్నొవేటివ్‌ అవార్డుకు ఎంపికైన కర్నూలు జిల్లా కలెక్టర్‌

కర్నూలు

- ప్రధానమంత్రి ఇన్నొవేటివ్‌ అవార్డుకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఎంపిక..

- దేశవ్యాప్తంగా ఎంపికైన 12 మందిలో కర్నూలు కలెక్టర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం.

- ఈ నెల 9న వీర పాండియన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

- వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ బృందానికి ప్రజెంటేషన్‌ ఇస్తారు.

- కర్నూలు జిల్లాలో జీవనోపాధి కార్యక్రమాలకుగాను అవార్డుకు ఎంపికయిన కలెక్టర్ వీరపాండియన్‌

2020-09-05 02:35 GMT

Weather Updates: ఏపీలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్ వాతావరణం 

- ఆగ్నేయ అరేబియా సముద్రము మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రము ప్రాంతాలలో 4.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం...

- కోస్తా, రాయలసీమ లో అక్కడ అక్కడ తేలికపాటి వర్షాలు..

- మిగిలిన ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

2020-09-05 02:33 GMT

MLC Madhav Letter to center: బొమ్మలు తయారీకి ఏటికొప్పాక అనువైనది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కు లేఖ రాసిన బిజేపి నేత, ఏమ్మేల్సీ మాధవ్..

- బొమ్మలు తయారీకి ఏటికొప్పాక అనువైనది...

- పర్యావరణ హితమైన, సంప్రదాయ హస్త కళను ప్రోత్సహించాలి..

- జాతీయ టాయ్ పాలసీ ని రూపొందించాలి...


Tags:    

Similar News