Live Updates: ఈరోజు (సెప్టెంబర్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 05 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-తదియ (మ.2-09 వరకు) తదుపరి చవితి, రేవతి నక్షత్రం (రా.1-08 వరకు) తదుపరి అశ్విని, అమృత ఘడియలు (రా.10-29 నుంచి 12-15 వరకు) వర్జ్యం (ఉ.11-52 నుంచి 1-38 వరకు) దుర్ముహూర్తం (ఉ.5-49 నుంచి 7-27 వరకు) రాహుకాలం (ఉ.9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-09
ఈరోజు తాజా వార్తలు
కర్నూలు జిల్లా
- శ్రీశైల జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 885 అడుగులు చేరిక
- గరిష్ట నీటి మట్టానికి అధికంగా వరద నీరు రావడం తోనే నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపిన అధికారులు
- ఒక క్రస్ట్ గేట్ ను తెరిచి 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు
- దిగువ ప్రాంత మత్స్యకారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైరన్ ద్వారా అప్రమత్తం చేస్తున్న నీటి పారుదల శాఖ అధికారులు
జాతీయం: అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధం.
సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటన.
ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభం.
తూర్పుగోదావరి :
- జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాస్కులు ధరించడం పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాం..
- కోవిడ్ బాధితులు, వైద్యులు సిబ్బంది వినియోగించిన మాస్కులు నిర్ణీత పద్ధతిలో నాశనం చేయాలి..
- చాలా మంది సరైన మాస్కులు ధరించడం లేదు.. కొంత మందు ఇప్పటికి మాస్కులు వినియోగించడం లేదు..
- జిల్లాలో ఇప్పటి వరకు 416598 టెస్టులు చేశాం.. 67382 పాజిటివ్ కేసులు, 422 మంది కోవిడ్ తో మరణించారు.. 53,267 మంది కోలుకున్నారు..
- ప్రస్తుతం 2471 మంది కరోనా బాధితులు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.. 2603 హాస్పిటల్స్ 8619 హోం ఐసోలేషన్ లో ఉన్నారు..
- 650 మంది ప్లాస్మా దాతలు ముందుకు వచ్చారు.. ప్లాస్మా దానం వారికి పూర్తి అవగాహన కల్పించాము..
- ముగ్గురు జేసిలు ఇద్దరు మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు..
- కోవిడ్ ట్రీట్మెంట్ కు వసూలు చేసే చార్జీల వివరాలు ఆస్పత్రుల బయట నోటిస్ బోర్డులో ప్రదర్శించాలి..
- కరోనా బారిన పడినవారు భయంతోనే లక్షణాలు లేకపోయినా ఆస్పత్రుల్లో చేరుతున్నారు..
యాదాద్రి-భువనగిరి :
- చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం.
- ఆవును తప్పించబోయి సడెన్ బ్రేక్ వేసిన కాన్వాయ్ లోని ముందు వాహనం.
- ఒక్కసారిగా కాన్వాయ్ లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.
- తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమం.
- దెబ్బతిన్న వాహనం ముందు భాగం, స్వల్పగాయాలతో మరో వాహనంలో వెళ్లిన భద్రతా సిబ్బంది.
- అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం.
గుంటూరు:
- తెలంగాణా నుండి ఏపికి భారీగా తరలిస్తున్న తొమ్మిది వేల మద్యం బాటిళ్ళ ను సీజ్ చేసిన రూరల్ పోలీసులు....
- వాటర్ ట్యాంకర్ ద్వారా మద్యం తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులు.
- 21లక్ష విలువైన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులు.
- అమరావతి,తుళ్ళూరు ప్రాంతాలలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- తెలంగాణా నుండి మద్యం తెచ్చేవాళ్ళతో పాటు వైన్ షాపుల యజమానుల పై కూడా కేసులు నమోదు చేస్తున్నాం.
- మద్యం తరలించే వాటర్ ట్యాంకర్,కారు సీజ్ చేశాం.
- రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ...
అమరావతి
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018- 2019కి సంబంధించి ఏపీకి మొదటి ర్యాంకు రావటం చంద్రబాబు గారి కృషికి నిదర్శనం
- వ్యాపార సంస్కరణల కార్యాచరణను సమర్ధవంతంగా అమలు చెయ్యడం వలనే ఇది సాధ్యమైంది
- 2018-19 సంవత్సరానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో నిలిచి ఎపి మళ్లీ మొదటి ర్యాంక్ సాధించినందుకు అభినందనలు.
- చంద్రబాబు గారు తీసుకొచ్చిన సంస్కరణలు జగన్ రెడ్డి గారు
- కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ ఆయన పారిశ్రామిక విధానాన్ని బ్రష్టు పట్టించారు
శ్రీకాకుళం జిల్లా:
- ప్రభుత్వ ఆలోచనలకు ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి సాద్యం అవుతుంది..
- భావనపాడు నిర్మాణం పై ఆ ప్రాంత ప్రజలు ఆచరణ యోగ్యం అయిన ఆలోచనలు చేయాలి..
- మన అదృష్టం కొద్ది మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నారు..
- ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోటి రూపాయలు పరిహారం ఎవరూ అడగకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు..
- తెలుగుదేశం పార్టీ 25 లక్షలు ఇస్తే చాలు అని అనుకుంది..
- కమ్యూనిస్టులు ఎంతో కొంతతో సరిపెడితే చాలు అనుకుంది..
- బాధితులకు న్యాయం చేయాలని సీఎం జగన్ పట్టుబట్టారు..
- ముఖ్యమంత్రికి రాష్ట్రం పై పూర్తి అవగాహన ఉంది..
- అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరూ అడ్డంకులు సృష్టించవద్దు..
- భావనపాడు నిర్మాణానికి సహకరించండి.. ఆ ప్రాంత అభివృద్ధికి దోహద పడండి..
- నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం, అధికారులు మీకు అండగా ఉంటాం..
- పోర్టు నిర్మాణ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణం చేస్తాం..
నిర్వాసితులకు ప్రయోజనం జరిగిలా ప్రభుత్వ రేటుకు నాకున్న పరిమితితో మరొక 25 శాతం అదనంగా ఇచ్చేందుకు ప్రతిపాదన పెడుతున్నాను..
- ప్రజలు దీనికి సహకరించాలి..
అమరావతి: అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబు గారిలో మార్పు రాలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అవ్వాళ తాసిల్డార్ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్ ను వెనకేసుకొచ్చాడు.
ఇప్పుడు 150 కోట్ల ఇఎస్ఐ స్కామ్ సూత్రధారి అచ్చెన్నాయుడు, హంతకుడు కొల్లు రవీంద్రకు ధైర్యం చెబుతున్నాడు.
తూర్పుగోదావరి - పిఠాపురం: పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా పాజిటీవ్
ఈరోజు ఉదయం కొవిడ్ టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యే దొరబాబు
గత ఇరవై రోజుల క్రితం నుంచి ముందు జాగ్రత్తకోసం హోం క్వారంటైన్ లో వున్న దొరబాబు
ఈరోజు పాజిటీవ్ రావడంతో హోం ఐసోలేషన్ కు వెళ్ళిన ఎమ్మెల్యే దొరబాబు
అమరావతి: వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు....
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శంకర నారాయణ, వెల్లంపల్లి, కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ.
సజ్జల రామకృష్ణరెడ్డి ప్రభుత్వ సలహాదారు
గురువు లేని విద్య ఉండదు..
తల్లి తండ్రులు తరువాత స్థానం గురువుదే..
జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధ్యాయులకు మంచి రోజులు వచ్చాయి..
ప్రభుత్వం పాఠశాలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వర్ణ యుగంగా మారింది..
విద్య వైద్య రంగానికి నాడు నేడు కింద పెద్ద పీట వేశారు..
పాఠశాలలను దేవాలయాలుగా సీఎం జగన్ తీర్చు దిద్దుతున్నారు..
పిల్లలు కోసం ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టారు..
95 శాతం మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం కోరుకుంటున్నారు..
స్కూల్స్ కు పూర్వవైభవం సీఎం జగన్ తీసుకువచ్చారు..
పిల్లలకు యనిఫాంతో సహా అన్ని మౌలిక సదుపాయాల సీఎం జగన్ కల్పిస్తున్నారు..
ప్రజలు చేసుకున్న అదృష్టం జగన్మోహన్ రెడ్డి రాష్టానికి సీఎం కావడం..
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎన్నికైన ఉపాధ్యాయులకు మెమోంటో ఇచ్చి సత్కరించిన మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి, శంకర్ నారాయణ..