East Godavari Updates: మాస్కులు ధరించడం పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాం: జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
తూర్పుగోదావరి :
- జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాస్కులు ధరించడం పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాం..
- కోవిడ్ బాధితులు, వైద్యులు సిబ్బంది వినియోగించిన మాస్కులు నిర్ణీత పద్ధతిలో నాశనం చేయాలి..
- చాలా మంది సరైన మాస్కులు ధరించడం లేదు.. కొంత మందు ఇప్పటికి మాస్కులు వినియోగించడం లేదు..
- జిల్లాలో ఇప్పటి వరకు 416598 టెస్టులు చేశాం.. 67382 పాజిటివ్ కేసులు, 422 మంది కోవిడ్ తో మరణించారు.. 53,267 మంది కోలుకున్నారు..
- ప్రస్తుతం 2471 మంది కరోనా బాధితులు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.. 2603 హాస్పిటల్స్ 8619 హోం ఐసోలేషన్ లో ఉన్నారు..
- 650 మంది ప్లాస్మా దాతలు ముందుకు వచ్చారు.. ప్లాస్మా దానం వారికి పూర్తి అవగాహన కల్పించాము..
- ముగ్గురు జేసిలు ఇద్దరు మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు..
- కోవిడ్ ట్రీట్మెంట్ కు వసూలు చేసే చార్జీల వివరాలు ఆస్పత్రుల బయట నోటిస్ బోర్డులో ప్రదర్శించాలి..
- కరోనా బారిన పడినవారు భయంతోనే లక్షణాలు లేకపోయినా ఆస్పత్రుల్లో చేరుతున్నారు..