Congress MLA Jaggareddy Comments కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే రైతు సమస్యలు ఉండేవి కావు: జగ్గారెడ్డి ఎమ్మెల్యే
- తెలంగాణ రాష్ట్రం వస్తే రైతులకు బంగారు జీవితం ఉంటుందని చెప్పిన కేసీఆర్.
- తెలంగాణ వచ్చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆరేళ్ళ పాలనలో కూడ రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు.
- దేశంలో రైతు చావుల్లో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది.
- ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత.
- రైతులు, ప్రజలు కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు నమ్మి ఓట్లు వేయించుకున్నాడు.
- మళ్ళీ ఎన్నికల ముందు రైతుల కోసం కొత్త స్కీం ప్రకటించి ఓట్లు దండుకుంటాడు.
- రైతు బంధు వలె... కొత్త స్కీం ప్రకటించి ఎన్నికల తరువాత అమలు చేస్తా అని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు కేసీఆర్.
- తెలంగాణ ప్రజలు , రైతులు కేసీఆర్ ఓట్ల జిమ్మిక్కులు గమనించాలి.
- రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం ఐదవ స్థానం లో ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి.
- రైతు సమస్యల పై అఖిల పక్షం నిర్వహించి రైతు సమస్యల పై చర్చించాలి.
- రైతులకు భరోసా కల్పించడానికి వచ్చే అసెంబ్లీలో ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వబోతోంది.
- రైతులను మభ్యపెట్టడంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఎక్స్పర్ట్.
- వచ్చే అసెంబ్లీ సమావేశాలలో రైతుల సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.
- ప్రభుత్వ సభలో అకాశం ఇవ్వకపోయినా బయట నిరసన వ్యక్తం చేస్తాం.
- కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే రైతు సమస్యలు ఉండేవి కావు.
- రైతుల పక్షాన కాంగ్రెస్ పోరడుతోంది.
- రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్న.
ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సి.యస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
శాసన మండలి, శాసన సభ లో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు.
వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.
శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు.
సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్ ను అధికారులు సిద్ధం చేసుకొని ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో స్పెషల్ సి.యస్ శ్రీమతి రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, శ్రీ వికాస్ రాజ్, శ్రీ రజత్ కుమార్, శ్రీ సునీల్ శర్మ, శ్రీ రవిగుప్త, శ్రీ సంతోష్ రెడ్డి, లా సెక్రటరీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్ ఈరోజు మంత్రి కే. తారకరామారావు ను ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, రాజేందర్ కు అభినందనలు తెలిపారు.
చాడ వెంకట్ రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి...
భూముల క్రమబద్ధీకరణ పేరుతో భూ ఆక్రమనదారుల భూముల క్రమబద్ధీకరణ చేయడం అన్యాయం.
ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకుని దానికి కూడా ఫీజు కట్టి ఆక్రమించుకున్నారు..
నిజాం కాలం నాటి సర్ఫె ఖాస్ భూములు అనేకమంది అక్రమాలకు పాల్పడి, రాజకీయ నాయకుల అండదండలతో రికార్డులు తారుమారు చేసి నిజాం వారసులుగా చలామణి అవుతున్నారు...
ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించాలి.
భూముల క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణ దరఖాస్తు ఫీజు ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే, ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది..
వెంటనే వ్యాప్తంగా నిష్పక్షపాతంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్..
HMTV చేతిలో నిందితుల ఏసీబీ కస్టడి వాగ్మూలం ...
విచారణలో వెలుగులోకి ఉన్నతాధికారుల పాత్ర
నిందితుల వాగ్మూలంలో కలెక్టర్, కీసర ఆర్డీవో మరో ఎమ్మార్వో పేర్లు
కీసర ఎమ్మార్వో కేసులో కీలక పరిణామాలు
వరంగల్ హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారనే ఆర్డీవో రవి తో ఒప్పందం: A3 శ్రీనాథ్
కీసర ఆర్డీవో రవి ద్వారనే ఎమ్మార్వో నాగరాజు తో ఒప్పదం : శ్రీనాథ్
దాయరలోని 614, మరికొన్ని సర్వేనెంబర్స్ లోని 61ఎకరాల 20గుంటల భూమి A 2 , విఆర్యే సాయిరాజ్ A4 , అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్: A 3శ్రీనాథ్
మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుండి భూమి అగ్రిమెఃట్ చేశాను: A 3
కలక్టర్ తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటా మన్నారు: A3
కోటి పదిలక్షలు వరంగల్ నుండి తీసుకొచ్చాను: A3
కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల తోనే భూ వివాదం పై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్ కి వెల్లాను: A1 ఎమ్మార్వో నాగరాజు
కాని శ్రీనాథ్ కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదు: A1
కీసర తహసీల్దార్ నాగరాజు విచారణ లో మాకు ఏ మాత్రం సహకరించలేదు: ఏసీబీ
నాగరాజు ఇంట్లో దొరికిన లాకర్ కీ, డాక్యుమెంట్లు, చెక్కుల పై నోరు మెదపలేదు: ఏసీబీ
గతంలో తన తండ్రి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేశాడు: A 1
తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు తెలిపిన ఎమ్మార్వో నాగరాజు నాగరాజు
1995 లో టైపిస్టు గా రెవెన్యూ శాఖలో జాయిన్ అయినట్టు తెలిపిన నాగరాజు..
అక్కడి నుండి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్,ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేసిన నాగరాజు
తన పేరు మీద బారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్న నాగరాజు
2011 సంవత్సరం లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ.
ప్రభుత్వ లెక్కల ప్రకారం10కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ
బ్యాంకు లాకర్ లో 55లక్షల బంగారు ఆభరణాలు స్వాదీనం చేసుకున్న ఏసీబీ
బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెంట్స్ పై విచారిస్తున్న ఏసీబీ
Jayashankar Bhupalpally updates: పురుగుల మందు డబ్బాతో రైతు కుటుంబం హల్ చల్ .
బ్రేకింగ్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
-భూపాలపల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో రైతు కుటుంబం హల్ చల్ .
-గొర్లవేడు గ్రామానికి చెందిన మామిడి వెంకులు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బాతో నిరసన...
Telangana updates: రాజసింగ్.. బీజేపీ ఎమ్మెల్యే..
రాజసింగ్.. బీజేపీ ఎమ్మెల్యే..
-తన పేరు పై అక్రమంగా ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ల ను మూసివేసినందుకు ఫేస్ బుక్ అధికారులకు ధన్యవాదాలు.
-నా అనుమతి లేకుండా నా పేరు పై ఫేస్ బుక్ అకౌట్ల నడవడం సరైనది కాదు.
-2018 లో నా వ్యక్తిగత ఉన్న ఫేస్ బుక్ వాకౌట్ హ్యాక్ అయింది. దానిని అధికారులు రద్దు చేశారు.
-మళ్ళీ నా వ్యక్తిగత ఫేస్ బుక్ వాకౌట్ కు అధికారులు అనుమతి ఇవ్వాలిని కోరుతున్న.
-వెంటనే నా వ్యక్తిగత అకౌట్ కి అనుమతినివ్వాలి..
Telangana updates:కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ వీడియో కాన్ఫరెన్సు..
-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర గిరిజన, స్త్రీ –శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
-తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6.5 నుంచి 10 శాతానికి పెంచాలి..
-జీవో 3ని అమలు చేసేవిధంగా కేంద్రం నుంచి మద్దతు ఇవ్వండి
-గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి
-తెలంగాణకు మరిన్ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వండి
-మిని గురుకులాల రెన్యువల్ చేసి, కొత్తవి మంజూరు చేయండి
-మిని గురుకులాలను ఎన్జీవోలకు ఇవ్వడం కంటే ప్రభుత్వంతోనే నడిపంచడం మంచిది
-సిఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం
-రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేసే కార్యక్రమాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ణప్తి..
Telangana latest updates: ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం....
-ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం....
-దేవికారాని 10 కోట్ల నగల పై ఏసీబీ అధికారుల విచారణ వేగవంతం..
-దేవికారాని ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేస్తున్న ఏసీబీ..
-10 కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసిన డాక్యుమెంట్ల ను పరీశీలిస్తున్న ఏసీబీ..
-ఇటీవల బిల్డర్ కు ఇచ్చిన 4కోట్ల 47 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చింది అన్న అంశాలపై ఏసీబీ విచారణ..
-మరోసారి దేవికారాని కి నోటీసులు ఇచ్చి వివరణ కొరనున్న ఏసీబీ.
latest telangana news: రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
-రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
-కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
-ఆగస్టు నెలాఖరు నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులు
-2020 - 21 వానాకాలానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కేటాయించింది 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 11.80 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులతో కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్ టన్నులు
-రాష్ట్రానికి అవసరమైన ఎరువులను అంచనా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంతో స్వయంగా మాట్లాడారు
-నేను, వ్యవసాయ శాఖ కార్యదర్శితో కలిసి రెండు సార్లు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం, పలు మార్లు ఈ విషయంలో లేఖలు రాయడం జరిగింది
-ఇతర ఎరువుల విషయంలో ఎలాంటి సమస్య లేదు
-యూరియా సరఫరాలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి
-ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 31 వరకు స్వయం కేంద్రం చేసిన కేటాయింపులు 8.69 లక్షల మెట్రిక్ టన్నులు
-ఆగస్టు 31 నాటికి వాస్తవంగా సరఫరా చేసింది 6.15 లక్షల మెట్రిక్ టన్నులు
-2.54 లక్షల మెట్రిక్ టన్నుల బకాయితో ఆగస్టు నెల ముగిసింది
-సెప్టెంబరు నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
-సెప్టెంబరు 30, 2020 ఈ వానాకాలం సీజన్ ముగిసే నాటికి రావాల్సిన బకాయి 2.54 లక్షల మెట్రిక్ టన్నులతో పాటు సెప్టెంబర్ నెల కేటాయింపు 2.10 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి కేంద్రం నుండి ఇంకా 4.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది
-గత ఏడాది వానాకాలం సీజన్ లో తెలంగాణలో కోటీ 3 లక్షల ఎకరాలు సాగయింది
-ఈ ఏడాది వానాకాలం సీజన్ లో ఇప్పటివరకు దాదాపు కోటీ 40 లక్షల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేశారు
-గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పంటలు సాగుచేశారు
-కేంద్రం కేటాయింపుల ప్రకారం ఏప్రిల్ నెలలో తెలంగాణకు రావాల్సింది 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది 0.69 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.37 లక్షల మెట్రిక్ టన్నులు
-మే నెల కేటాయింపు 1.63 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.09 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.54 లక్షల మెట్రిక్ టన్నులు
-జూన్ కు సంబంధించి కేంద్రం కేటాయించిన యూరియా 1.38 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.29 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.09 లక్షల మెట్రిక్ టన్నులు
-జులై నెలకు సంబంధించి తెలంగాణకు కేటాయించిన యూరియా 2.06 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.27 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.79 లక్షల మెట్రిక్ టన్నులు
-ఆగస్టు నెలకు కేటాయించింది 2.56 లక్షల మెట్రిక్ టన్నులు, సరఫరా చేసింది 1.81 లక్షల మెట్రిక్ టన్నులు, బకాయి 0.75 లక్షల మెట్రిక్ టన్నులు
-మొత్తం ఆగస్టు వరకు 8.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉండగా 6.15 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసింది.
-ఇంకా 2.54 లక్షల మెట్రిక్ టన్నుల బకాయి రావాల్సి ఉంది
-గత వానాకాలానికి, ఈ ఏడాది వానాకాలానికి పెరిగిన సాగును కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి
-తెలంగాణకు కేటాయించిన మేరకు మొత్తం యూరియా కోతలు లేకుండా కేంద్రం సరఫరా చేయాలి..