Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-03 00:39 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-03 14:01 GMT

హైదరాబాద్: 

- హైదరాబాద్ లో ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న మెట్రో రైలు ప్రయాణాలు

- సెప్టెంబర్ 7 న మొదటి ఫేస్ మియపూర్ నుంచి lb నగర్

- సెప్టెంబర్ 8 నుంచి ఫేస్2 లో నాగోల్ నుంచి రాయదుర్గ్

- సెప్టెంబర్ నుంచి మూడు ఫేస్ లలో మెట్రో రైలు పున ప్రారంభం

- ఉదయం 7 నుంచి 12 వరకు సాయంత్రం 4 నుంచి 7 వరకు

- కంటైన్మెంట్ జోన్ లో ఉన్న స్టేషన్ లు గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసపెట్, ముషీరాబాద్, యూసఫ్ గూడ స్టేషన్లు మూసివేత

2020-09-03 13:52 GMT

- 7న టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం

- ఈ నెల 7న సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది.

- దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మరణానికి టిఆర్ఎస్ ఎల్పీ సంతాపం తెలుపుతుంది.

- ఆయనకు నివాళి అర్పిస్తుంది.

- అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.

- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

2020-09-03 13:52 GMT

- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఐ జి. నాగిరెడ్డి, ఎస్పీ, విష్ణు ఎస్ వారియర్, ట్రైనింగ్ ఐపీఎస్, అధికారి అక్షెస్ యాదవ్,

- ఉట్నూర్ డీఎస్పీ కార్యాలయం పరిధిలోని పోలీస్ సిబ్బంది అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం, పాల్గొన్న డిఎస్పీ ఉదయ్ రెడ్డి తో పాటు సీఐ, ఎస్. ఐ ,లు మరియు పోలీసులు..

2020-09-03 13:50 GMT

- నిర్మల్ జిల్లాలో ఐజి నాగిరెడ్డి రహస్య పర్యటన..

- ఖానాపూర్ పోలీస్ స్టేషను సందర్శించిన ఐజి నాగిరెడ్డి..

- ఉత్కంఠ రేపుతున్నా ఐజి నాగిరెడ్డి పర్యటన..

- ఐజి పర్యటన వివరాలు గోప్యంగా ఉంచుతున్నా పోలీసు అదికారులు

2020-09-03 13:48 GMT

- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం...

- కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మూడు ఆర్డినెన్స్ లు రైతు వ్యతిరేకమైనవి.

- వీటిని ఉపాసహరించుకోవాలని ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ లను రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం కి పంపించాలని తెలంగాణ రైతు సంఘం ,వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది...

- కేంద్ర ప్రభుత్వం కరోన కారణంగా పని కోల్పోయిన గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించింది...

- జిఎస్టీ లో రైతుల వాటా ఇవ్వకుండా ఆక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకుంది..

- పశ్య పద్మ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

- ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం విడుదల చేయాలి...

- కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 ఆర్డినెన్స్ లను వెనక్కి తీసుకోవాలి..

1.నిత్యవసర వస్తువుల ఆర్డినెన్స్ సవరణ చట్టాన్ని తొలగించాలి. ఈ చట్టం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమితిని ఈ చట్టం నుండి తొలగిస్తుంది...

2.వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం వాణిజ్యం పై తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర కు చట్ట బద్ధత లేదని వ్యాపారుల వద్దకు బేరమాడే స్థితిలో రైతులు లేరు...

3.ధరల హామీ ,సేవల ఒప్పంద ఆర్డినెన్స్ 2020 ద్వారా రైతులు వ్యాపారులతో నేరుగా కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందం చేసుకోవాలి ..

- కరోన వల్ల పస్తులుంటున్న నిరుపేద కుటుంబాలను నెలకు 7500 చెల్లించాలి...

- 57 సంవత్సరాలు నిండిన రైతులు ,వ్యవసాయ కూలీలు,చేతి వృత్తుల వారికి నెలకు 10 వేల పెన్షన్ కల్పించాలి..

- ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పని కల్పించి రోజుకు 600 చెల్లించాలి...

- కరోన ని అరికట్టడానికి కేరళ తరహాలో సామాన్యులందరికి ఆరోగ్య భద్రత కల్పించాలి...

- ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలి..

2020-09-03 12:23 GMT

కామారెడ్డి జిల్లా :

- తాడ్వాయి మండలం సంతాయి పేట్ గ్రామంలో మద్దికుంట ప్రభు అనే రైతు పై ఎలుగుబంటి దాడి.

- తీవ్రంగా గాయపడ్డ ప్రభును చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.

- పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ తరలింపు.

- ప్రభు తన పొలం వద్దకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన.

2020-09-03 12:22 GMT

వరంగల్ రూరల్ జిల్లా :

- నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు భాగాన కబ్జాకు గురైన ఫారెస్టు ఖాళీ స్థలాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

- అధికార పార్టీ నాయకులు పట్టణంలోని ఖాళీ స్థలాలను కబ్జా చేయడం సిగ్గుమాలిన పని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

2020-09-03 12:12 GMT

- కేసీఆర్ ఉధ్యమం లో గాని ప్రభుత్వం లో గాని ఆయన సెట్ చేసిన అజెండా చుట్టూ అందరినీ తాప్పుకుంటడు

- రాష్ట్రాన్ని ఆరేళ్ళలో అప్పుల తెలంగాణ చేసిండు

- జగన్ తో ఒప్పందాలు అందరం చూస్తున్నాం

- తెలంగాణ లో మరో ఉధ్యమం తేవాలన్న యోచనలో ఉన్నట్టు అర్థం అవుతుంది

- ఉత్తర తెలంగాణ వారు ఆ వాతావరణం ను ఎవరూ కోరుకోరు

- అప్పుల ఊభిలో కూరుకు పోయే రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వ పెద్దలు కృషి చేయరని అర్థమైంది

- కృష్ణజలాలు దక్షణ తెలంగాణ లో ఉపయోగానికి రావాలి

- ఎత్తి పోతల పథకం ప్రారంభించిందే టీడీపీ

- ఎన్టీఆర్ జలదోశిడి చేసారనడాన్ని ఖండిస్తున్నా

- తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన మద్రాస్ కు నీరు ఇవ్వాలని భావించారని అనుకుంటున్నా

- ఈ సమావేశం ఏతీర్మాణం చేసినా మా వంతు సాయం చేస్తాం

రేవంత్ రెడ్డి.. ఎంపీ

- ప్రయొగారకు ప్రోగశాలగా తెలంగాణ ను మార్చారు

- ఆ ప్రభావం ను మార్చాలని ప్రయత్నిస్తే నమ్మలేదు

- తనకోసం అడ్డొచ్చిన వారిని తొలగిస్తూ వచ్చారు

- కేసీఆర్ చేతిలో అణిచివేత కు గురైన వారు గ్రామాల్లో.. తాండాల్లో కనిపిస్తారు

- కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ముసుగు ఉంది కాబట్టి నమస్కారం పెడ్తున్నారు

- సెంటిమెంట్ బొంత తీస్తే ప్రజలే కేసీఆర్ నడ్డి విరగ్గొడతరు

- ప్రతిపక్షం ఉండాలని నేను ఎప్పటినుంచో చెప్పుకుంటూ వచ్చా

- ప్రతిపక్ష పార్టీ లు ఉంటే ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకునే

- సంతలో పశువుల తరహాలో పునరేకీకరణ పేరుతో

- చిన్న చిన్న తాయిలాల కోసం జర్నలిస్టులు కూడా లొంగారు

- ఆరుళ్ళలో ప్రతినామిషం.. ప్రతిక్షణం వంచన చేస్తూ వచ్చారు కేసీఆర్

- రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి లాగనే ఉంటడు

- ఆయన రాయలసీమ కు నీరు ఎందుకు తీసుకుపోరు

- ఆ ప్రాంత ప్రజల ప్రయొజనాలకోసం కృషి చేస్తున్నారు

- అయితే మనం ఏం చేస్తున్నాం

- నేడు ధనాశకు అలవాటు పడ్డారు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి..

- శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా తప్పులను ఒప్పుకున్నరు

- ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి కేసీఆర్ ఇన్ని కథలు చెబుతున్నారు

- పవర్ ప్రాజెక్టులు.. తాగునీరు కోసం రోజూ పదకొండు టీఎంసీ లు నీరు పోతాయి

- జూరాల దగ్గర కనిపించి పోతిరెడ్డిపాడు వద్థ పోయి శ్రీశైలం ఎండిపోతుంది

- విధ్యుత్ ఉత్పత్తి పెరిగింది.. కొనేవారు లేరు

- ఒకప్పుడు విధ్యుత్ ఉత్పత్తి తక్కువ.. వినియోగదారులు ఎక్కువ

- దేశంలో చాల రాష్ట్రాల్లో మిగులు విధ్యుత్ ఉంది అక్కడ ఎవరు తెచ్చారు

- రాజులు గత సంస్కృతిలో ఉన్న అనవాళ్ళు విధ్వంసం చేసి కొత్త సంస్కృతి చొప్పించే వారు

- ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే సంస్కృతి క విధ్వంసం చేస్తున్నారు

- రీ డిజైన్ల పేరుతో తన పేరును రాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు

- నిజాం కట్టిన ఏ కట్టడాన్ని కేసీఆర్ ఉంచదలచు కోలేదు

- కేసీఆర్ ముందు కేసీఆర్ తరువాత అన్నట్టు చూపేందుకు సంస్కృతి పై దాడి చేస్తున్నాడు

- దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

- పదేళ్ళలో రాష్ట్రానికి ఎన్ని పంగనామాలు పెట్టారు

- ఉధ్యమం చేసిన వారు ఎవరు ఇప్పుడు కనిపించడం లేదు

- ఉధ్యమంలో ఉన్న వారిని బూతద్దం పెట్టి వెతికి మరీ అణగదొక్కి పెట్టుబడులు పెప్టేవారిని పంచన చేర్చుకున్నారు

2020-09-03 12:10 GMT

- అఖిలపక్షం తీర్మానాలు...

- పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ..జాతీయ ప్రాజెక్టు గా గుర్తించాలి.

- పోతిరెడ్డిపాడు ను నిలువరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఫేలయింది..

- కృష్ణా నది జలాల వాటా సాదించడం..

- ప్రజా ప్రతినిధుల పై ఓత్తిడి తీసుకురావడం..

- ప్రాజెక్ట్ ల సందర్శించి..వర్క్ షాప్ లు నిర్వహించడం..

- జిల్లా లలో సమావేశాలు ఏర్పాటు చేయడం..

2020-09-03 11:19 GMT

జాతీయం

*  ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల : కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

- ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది

- రోజువారీ కరోనా మరణాల్లో 4.5 శాతం తగ్గుదల ఉంది

- ఏపీలో ఆగస్ట్ 13-19 తేదీల మధ్య 1,12,714 కేసులు ఉంటే, 20-26 తేదీల మధ్య 88,612 కేసులు ఉన్నాయి, ఆగస్టు 27- సెప్టెంబర్ 2 మధ్య 97272 కేసులు ఉన్నాయి

- దేశం మొత్తం కరోనా మరణాలలో ఏపీలో 6.12 శాతంగా ఉంది

- కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నా రికవరీ రేట్ లో ఏపీ ముందంజ

- కరోనా మరణాల రేటును గణనీయంగా తగ్గించిన ఆంధ్ర ప్రదేశ్

- ఐదు రాష్ట్రాలలో 62% కరోనా కేసులు ఉన్నాయి

- మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో ఆరు శాతం కేసులు ఉన్నాయి

- మిగిలిన రాష్ట్రాల్లో 37 శాతం కేసులు ఉన్నాయి

* మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల 6.9 శాతంగా ఉంది

- మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 37.39 శాతంగా ఉంది

- కరోనా మరణాల్లో ప్రతిరోజు ఢిల్లీలో 50 శాతం పెరుగుదల ఉంది

- అధిక జనాభా పరీక్షల వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది

- కరోనా పరీక్షలు పెరిగిన కొద్దీ, అదే స్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది

- యాక్టీవ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య మూడు రెట్ల పైనే ఉంది

* ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 3359 కరోనా కేసులు ఉంటే భారత్లో 2792 కేసులు ఉన్నాయి

- అమెరికాలో ప్రతి మిలియన్కు 18926 కేసులు ఉన్నాయి

- ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్కు 111 మంది చనిపోతుంటే భారత్లో 49 మంది చనిపోతున్నారు

- కరోనాతో అమెరికాలో ప్రతి మిలియన్కు 611 మంది చనిపోయారు

👆కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

Tags:    

Similar News