Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-03 00:36 GMT
Live Updates - Page 4
2020-09-03 04:45 GMT

Guntur district updates: కొల్లిపర మండలం..వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....

గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం,

-వల్లబాపురం గ్రామంలో వైసిపి, టీడీపి మధ్య ఘర్షణ.....

-ఒక్కరిపై ఒక్కరు కర్రలతో దాడులు పలువురికి గాయాలు.

-తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఇరువర్గాలు....

-పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యని ఇరువర్గాలు....

2020-09-03 04:39 GMT

Amaravati updates: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్..

అమరావతి..

-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్.

-మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించనున్న కేబినెట్.

-నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

-కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యల పై కాబినెట్ లో చర్చించే అవకాశం.

-రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం.

-రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా వ్యయానికి ఇకపై నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంత్రివర్గలో చర్చ

-రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీడీవో) లు. దీనిపైనే కేబినెట్ లో చర్చ

-ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులుకు ఆమోదం తెలిపే అవకాశం.

-రాష్ట్రం లో కోవిడ్ కేస్ లు విజృంభిస్తుండడం మంత్రులకు కోవిడ్ ఇప్పటికే సోకడం తో దానిపైన చర్చ వచ్చే అవకాశం.

-రాష్ట్రం లో తీసుకుంటున్న కోవిడ్ నియంత్రణ చర్యలు పైన చర్చించే అవకాశం.

-జి ఎస్ టి పరిహారం పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన కాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం.

-గోదావరి, కృష్ణ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అందిన పరిహారం పై చర్చించే అవకాశం.

-వాటిల్లిన నష్టం పై అంచనాలు సిద్ధం చేయడంతో పాటు దానిపై కేంద్రసాయం విషయం లో కేబినెట్ లో చర్చించే అవకాశం.

2020-09-03 03:42 GMT

Amalapuram updates: అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం..

తూర్పు గోదావరి జిల్లా..

అమలాపురం..

-అమలాపురం ఎక్సైజ్ పోలీసులు అత్యుత్సాహం

-అంబాజీపేటలో మద్యం కేసులో కోలా వెంకటరత్నం అనే వృద్దుడుతో పాటు తొమ్మిదేళ్ల మనవడిని నిర్బంధించిన ఎక్సైజ్ పోలీసులు

-అంబాజీపేటలో దివ్యాంగుడైన వెంకటరత్నం ఇంటిలో సోదాలు చేసి 20 మద్యం సీసాలు ,ఒక వాహనం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

-వెంకటరత్నం నుంచి ఇరవై వేలు నగదు, నాలుగు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారని బంధువులు ఆరోపణ

-వెంకటరత్నం తో 9 ఏళ్ల బాలుడ్ని ఎక్సైజ్ సిబ్బంది నిర్బంధించడం పై గ్రామస్తులు ,బంధువులు ఆగ్రహం

-వృద్దుడు తోపాటు బాలుడు తోడుగా స్టేషన్ కు వచ్చాడని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు

-బాలుడికి కరోనా లక్షణాలున్నాయని ఆస్పత్రికి తరలిస్తామంటున్న అధికారులు..

2020-09-03 03:37 GMT

East Godavari district: జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 52 మంది వైద్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..

తూర్పుగోదావరి..

-జిల్లా లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 52 మంది వైద్యులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

-నిన్ననే విధుల్లో చేరిన 16 మంది డాక్టర్లు

2020-09-03 03:32 GMT

Rajahmundry updates: రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి..

తూర్పుగోదావరి -రాజమండ్రి..

-రాజమండ్రి వద్ద పెరుగుతున్న వరద గోదావరి

-ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 గేట్ల నుంచి 8లక్షల ఐదు వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

-ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 10.30 అడుగులకు చేరిన వరదనీటిమట్టం

-గోదావరిలో భద్రాచలం వద్ద క్రమేణా పెరగనున్న వరద ఉధృతి ..

-42.30 అడుగులకు చేరిననీటిమట్టం

-పోలవరం కాఫర్ డ్యాం ప్రభావంతో మూడోసారి జలదిగ్భంధంలో చిక్కుకున్న దేవీపట్నం ...

-36 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

-బోట్లపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న వరద బాధితులు

-ధవలేశ్వరం దిగువన కోనసీమలో వరదతో పొంగుతున్న వశిష్ట, వైనతేయ ,గౌతమీ నదులు

-తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య చాకలిపాలెం, కరకాయలంకల వద్ద మునిగిపోయిన కాజ్వేలు..

-భయం గుప్పిట్లో కోనసీమ లంకగ్రామాల ప్రజలు..

2020-09-03 03:22 GMT

Guntur District updates: తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....

గుంటూరు...

-తెనాలి శివాజీ చౌక్ లో దుండగుల దుశ్చర్యం....

-భగత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు...

-చత్రపతి శివాజీ చౌరస్తా వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహం తల భాగం వరకు ధ్వంసం...

-శివాజీ చౌక్ వద్ద ఆందోళనకు దిగిన బిజెపి ఇతర ప్రజాసంఘాల నాయకులు...

-రోడ్డుపై బైఠాయించి నిరసన.....

-స్వతంత్ర కోసం పోరాడిన మహనాభావులకు అవమానకరం...

-దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..

-దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన గొప్ప నేత భగత్ సింగ్...

-అటువంటి నేత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం బాధాకరమని

-ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్...

-వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే అంతవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదంటున్న బిజెపి నేతలు...

-బిజెపి నేత పాటిబండ్ల కృష్ణ...

2020-09-03 02:45 GMT

Visakhapatnam updated: సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు

విశాఖ..

-సింహాంద్రి అప్పన్న హుండీ ఆదాయం 35 రోజులకు గాను 47 లక్షల నగదు, 22 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి అప్పన్నకు భక్తులు కానుకగా సమర్పించారు.

-భక్తుల రాక పెరగడంతో స్వామి వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది.

-స్వామి వారి పూజలు ఆన్​లైన్​లో పెరుగుతుండటంతో.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

2020-09-03 02:36 GMT

Anantapur updates: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.

అనంతపురం:

-శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం హుండీ ఆదాయం రూ 26.16 లక్షలు.

-కరోనా తో మార్చి నుంచి ఆలయం మూసివేత. ఇటీవలే దర్శనాలకు అనుమతి.

-160 రోజుల తరువాత హుండీ లెక్కింపు.

2020-09-03 02:33 GMT

Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

కర్నూలు జిల్లా.....

-శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

-ప్రస్తుతనీటి మట్టం:885 అడుగులు

-పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు

-ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు

-ఇన్ ఫ్లో:37,297 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో:40,869క్యూసెక్కులు

-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

2020-09-03 02:26 GMT

Anantapur updates: జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు..

అనంతపురం:

-అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు

-ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుంపు.

-మొత్తం పరీక్షలు రాయనున్న వారు 20,100 మంది.

Tags:    

Similar News