Amaravati updates: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్..
అమరావతి..
-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం లో ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో సమావేశం కానున్న కేబినెట్.
-మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించనున్న కేబినెట్.
-నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యల పై కాబినెట్ లో చర్చించే అవకాశం.
-రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం.
-రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి ఇకపై నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంత్రివర్గలో చర్చ
-రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీడీవో) లు. దీనిపైనే కేబినెట్ లో చర్చ
-ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులుకు ఆమోదం తెలిపే అవకాశం.
-రాష్ట్రం లో కోవిడ్ కేస్ లు విజృంభిస్తుండడం మంత్రులకు కోవిడ్ ఇప్పటికే సోకడం తో దానిపైన చర్చ వచ్చే అవకాశం.
-రాష్ట్రం లో తీసుకుంటున్న కోవిడ్ నియంత్రణ చర్యలు పైన చర్చించే అవకాశం.
-జి ఎస్ టి పరిహారం పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన కాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం.
-గోదావరి, కృష్ణ వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అందిన పరిహారం పై చర్చించే అవకాశం.
-వాటిల్లిన నష్టం పై అంచనాలు సిద్ధం చేయడంతో పాటు దానిపై కేంద్రసాయం విషయం లో కేబినెట్ లో చర్చించే అవకాశం.