Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11
ఈరోజు తాజా వార్తలు
అమరావతి
మంత్రి కన్నబాబు కామెంట్స్
ఎన్సిఆర్బి ప్రకారం 1029 మంది రైతులు గత ఏడాది చనిపోయారు.
అందులో 401 మంది రైతు కూలీలు అని చెప్తున్నారు
రైతులు అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వెంటనే అందరికీ పరిహారం అందిస్తున్నాం
రైతు భరోసా అమలు చేస్తున్న తీరు అందరూ చూస్తున్నారు
2020-21 లో 49.45 లక్షల కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించాం
ఇప్పటి వరకు 10200 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం
రైతులకు అనేక పథకాలు అందిస్తున్నాం
పొగాకు కొనుగోళ్లు సైతం మొదటి సారి చేపట్టాం
ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో అనేక పంటలు కొనుగోలు చేసింది
త్వరలోనే రైతు భరోసా కేంద్రాలు నుండి కొనుగోలు కార్యక్రమాలు జరగనున్నాయి
ప్రతిపక్ష నాయకులు రెచ్చిపోయి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు
2019 లో టిడిపి పరిపాలన కూడా సాగింది.... వారి తప్పిదాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయి
2020 లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించాం
ఇప్పటివరకు 2020 లో 157 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
గ్రామ స్థాయి లో విత్తనాలు అందించాం అసలు క్యు లైన్లు లేకుండా చూసాం
క్యు లైన్లో ఉండి గుండెపోటు వచ్చే చనిపోతున్నారు అని చంద్రబాబు ఆరోపించడం దారుణం
తూర్పుగోదావరి
- జిల్లా- కలెక్టరు మురళీధర్ రెడ్డి కామెంట్స్
- రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
- రాజమండ్రి- రూరల్ తొర్రేడులో డిజిటల్ పేమెంట్ మిషన్ ప్రారంభించిన కలెక్టర్
- రైతు సాగు చేసే వివిధ రకాల పంటల కోసం అవసరమైన విత్తనాలు, రసాయనిక ఎరువులను రైతులకు సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తాం
- డిజిటల్ పేమింట్ యంత్రం ద్వారా అవసరమైన ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడంతోపాటు, ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఎరువు వ్యాపారికి ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం
- రైతు నరుకుల అన్నవరంచే డిజిటల్ పేమెంట్ యంత్రంను ఉపయోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్న. కలెక్టర్
- జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి..
తూర్పుగోదావరి :
- తాళ్ళరేవు మం. కోరింగ మడ అడవుల్లో సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు..
- సుమారు 10 లక్ష రూపాయలు విలువ చేసే 46,000 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం..
- 1400 లీటర్ల నాటుసారా స్వాధీనం..
అమరావతి
- టీడీపీ హయాంలో జరిగిన పనులపై కాగ్ ఆడిట్ చేయాలని దాఖలైన పిటిషన్ ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
- ఆడిట్ చేయాలని కాగ్ కు వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్ కు సూచించిన ఏపీ హైకోర్టు
విజయవాడ
- మహిళ కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
- కృష్ణ జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో జరిగిన దారుణాలు కండిస్తునం.
- ఆడవారి పై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.విమెన్ ఎంప్లాయిస్ కు అన్యాయం జరిగితే ఉపేక్షించం.
- డిపార్ట్మెంట్ లో జెండర్ డీస్క్రిమినేషన్ ప్రస్తావన లేవనెత్తాడం హేయమైన చర్య.
- మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలి.
- మహిళ లపై జరుగుతున నేరాల మహిళ కమిషన్ దృష్టికి వచ్చాయి వాటి పై చర్యలు చేపడతాం.
- రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ లోని మహిళ ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం .
- బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో వార్డెన్ సైతం కొంత మంది వేధిస్తున్నారని మా దృష్టికి వచ్చింది
- ముఖ్యమంత్రి జగన్ మహిళలకు రక్షణ కల్పించాలని సంకల్పించారు.
- మహిళ భద్రత పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అని డిపార్ట్మెంట్ మహిళ ఉద్యోగులతో చర్చించాం .
- ఈ రోజు ముప్పై మంది విమెన్ ఆఫీసర్లు విచారించాం.
- మహిళ కమిషన్ కు ప్రతి రోజు ఫిర్యాదులు వస్తున్నాయ్.
- మహిళ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది, స్పెషల్ కోర్టులను ఏర్పటు చేసింది .
- నేరస్థుల ను ఇరవై ఒక రోజు లో శిక్ష పడే విధంగా చర్యలు చెప్పటారు.
- రాష్ట్రంలో మహిళ ఉద్యోగుల భద్రత కు జగన్ ప్రభుత్వం ఏళ్ల వేళలా సిద్దము గా ఉంటుంది.
అమరావతి
- చీప్ లిక్కర్ ధరను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మద్యం ధరలు పెరగడంతో కల్తీ సానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
- పేద వాళ్ళు తాగే చీప్ లిక్కర్ ధర అందుబాటులో ఉంటే శా నిటైజర్ల జోలికి పోర ని భావించిన జగన్ సర్కార్
- కాస్ట్లీ లిక్కర్ పై మరో సారి ధరలు పెంచిన సర్కార్
జాతీయం
* ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల : కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
- ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది
- రోజువారీ కరోనా మరణాల్లో 4.5 శాతం తగ్గుదల ఉంది
- ఏపీలో ఆగస్ట్ 13-19 తేదీల మధ్య 1,12,714 కేసులు ఉంటే, 20-26 తేదీల మధ్య 88,612 కేసులు ఉన్నాయి, ఆగస్టు 27- సెప్టెంబర్ 2 మధ్య 97272 కేసులు ఉన్నాయి
- దేశం మొత్తం కరోనా మరణాలలో ఏపీలో 6.12 శాతంగా ఉంది
- కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నా రికవరీ రేట్ లో ఏపీ ముందంజ
- కరోనా మరణాల రేటును గణనీయంగా తగ్గించిన ఆంధ్ర ప్రదేశ్
- ఐదు రాష్ట్రాలలో 62% కరోనా కేసులు ఉన్నాయి
- మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో ఆరు శాతం కేసులు ఉన్నాయి
- మిగిలిన రాష్ట్రాల్లో 37 శాతం కేసులు ఉన్నాయి
* మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల 6.9 శాతంగా ఉంది
- మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 37.39 శాతంగా ఉంది
- కరోనా మరణాల్లో ప్రతిరోజు ఢిల్లీలో 50 శాతం పెరుగుదల ఉంది
- అధిక జనాభా పరీక్షల వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది
- కరోనా పరీక్షలు పెరిగిన కొద్దీ, అదే స్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది
- యాక్టీవ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య మూడు రెట్ల పైనే ఉంది
* ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు 3359 కరోనా కేసులు ఉంటే భారత్లో 2792 కేసులు ఉన్నాయి
- అమెరికాలో ప్రతి మిలియన్కు 18926 కేసులు ఉన్నాయి
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్కు 111 మంది చనిపోతుంటే భారత్లో 49 మంది చనిపోతున్నారు
-కరోనాతో అమెరికాలో ప్రతి మిలియన్కు 611 మంది చనిపోయారు
👆కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
రమేష్ ఆసుపత్రి అంశంలో సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం.
హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో పిటిషన్.
హైకోర్టు ఇచ్చిన మంధ్యంతర ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం.
దేవినేని ఉమ, మాజీమంత్రి
వసంత కృష్ణప్రసాద్ 1999లో నాపై పోటీచేసి ఓటమి పాలై, హైదరాబాద్ వెళ్లి, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు
కృష్ణప్రసాద్ అతని కుటుంబం ఎక్కడున్నా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు.
సీబీఐ, ఈడీ కేసుల్లో వసంత కృష్ణప్రసాద్ ముద్దాయిగా ఉన్నాడు.
జగన్ అక్రమాస్తులకేసుల్లో అతను కూడా ఒకడు.
తనపైఉన్న సీబీఐ, ఈడీ కేసులు వివరాలను కృష్ణప్రసాద్ ఎన్నికల అఫిడవిట్ లో చూపలేదు.
అటువంటి వ్యక్తి సిగ్గులేకుండా శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ వేలట్రిప్పుల గ్రావెల్ ను అమ్ముకుంటున్నాడు.
దాన్ని అడ్డుకున్నాననే నాపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడు.
ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందని ఏసీబీ దాడులతోనే తేలిపోయింది.
ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంపై రెండురోజులుగా ఏసీబీ దాడులు జరుగతున్నందుకు కృష్ణప్రసాద్ సిగ్గుపడాలి.
అతని అవినీతివల్ల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ సూపరిండెంట్ బలికాబోతున్నారు.
వసంత, అతని బావమరిది ముంపు భూములు కొని, వాటిని మెరకచేయడంకోసం అటవీభూమిని కొల్లగొట్టారు.
సజ్జా అజయ్ పై దాడిచేసింది కృష్ణప్రసాద్ గూండాలే.
తాడేపల్లి రాజప్రాసాదానికి వస్తా.. రా నీ అవినీతిపై తేల్చుకుందామంటే కృష్ణప్రసాద్ పత్తాలేడు.
జగన్ తన అవినీతిని పసిగట్టి, ఏసీబీని వదిలాడన్న నిస్పృహతో కృష్ణప్రసాద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
నోట్లు చించి 18వేలమందికి పంచి, గెలిచాక రూ.2వేలు ఇస్తానన్న విషయాన్ని కూడా వసంత, సీబీఐకి లేఖ రాయాలి.
కృష్ణప్రసాద్ బంధువు టీచర్ పొదిల రవి హత్య కేసు విచారణ కూడా సీబీఐకి అప్పగించాలి.
ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్ మిడిసిపడటం మానేసి, తన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలి.
శ్రీకాకుళం జిల్లా..
సంతబొమ్మాళి యువతిపై కుల పెద్దల లైంగిక వేదింపుల కేసులో కొత్త ట్విస్ట్..
కుల పెద్దలని వెనకేసుకు వస్తోన్న యువతి తల్లి దండ్రులు..
సంతబొమ్మాలి లైంగిక వేధింపులు బాధితురాలు తండ్రి కృష్ణా రావు కామెంట్స్..
నా కూతురు విషయంలో నాలుగు సార్లు చర్చలు జరిగాయి..
పెద్దమనుషులు, పోలీసులు కలిసి 18 లక్షలకు రాజీ కుదిర్చారు..
అందులో మా కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు..
కులపెద్దల జోక్యంతో 8 లక్షలు మాకు ఇచ్చారు..
కులపెద్దలు 10 లక్షలు తీసుకున్నారు అనేది వాస్తవం కాదు..
అన్నీ పోలీసుల సహకారంతో నిందితుడు లక్ష్మణరావు, అతని కుటుంబ సభ్యులు చేస్తున్నారు..
మానవ హక్కుల సంఘం ప్రతినిధి డబ్బులు తీసుకున్నారు అనేది అబద్దం..
మేము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు..
కులపెద్దలపైన అన్యాయంగా నా కూతురుతో కేసు పెట్టించారు..
నా కూతురుని నారాయణ, లక్ష్మణ రావు, అతని కుటుంబ సభ్యులు కలిసి కిడ్నాప్ చేశారు..
45 రోజులుగా నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు..
పోలీసులకు ఫిర్యాదు చేద్దామని స్టేషన్ కి వెళ్తే నీ కూతురు మేజర్ కేసు పెట్టడానికి అవకాశం లేదని సమాధానం చెప్పారు..
నా కూతురు కనిపించడం లేదంటే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు..
ఇప్పుడు కులపెద్దల మీద , గ్రామ పెద్దల మీద కేసు పెట్టడం ఏమిటి ?