నెల్లూరు
తమకు ఐదు నెలలగా వేతనాలు ఇవ్వలేదంటూ ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల వివిధ వాచ్మెన్ లు.
తమకు వేతనాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలంటూ ఆత్మకూర్ ఆర్డీవో కి వినతి పత్రం అందజేసిన వాచ్ మెన్ లు
కరోనా కాలంలో తమకు పూట గడవడం కష్టంగా ఉంది అంటూ ఆర్డీవోను వేడుకున్నా వాచ్మెన్ లు.
నెల్లూరు స్క్రోలింగ్:--
ఆత్మకూరు పట్టణంలో మోడల్ కాలనీ వాసుల ఆందోళన.
ప్రభుత్వగృహాలకు ఇంటి పన్ను విధించడంతో తాము అంత పన్ను కట్టలేమని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన.
కాలనీ వాసుల సమస్య మంత్రి మేకపాటి గౌతం రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వైసీపి నేత డాక్టర్ శ్రావణ్ కుమార్ హామీ
మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకి పరిస్థితిని వివరించి విధించిన పన్నును తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేసిన డాక్టర్ శ్రావణ్ కుమార్.
కృష్ణా జిల్లా:
కంచికచర్ల (మం) గండేపల్లి వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా మధ్యం సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని,ఒక కారు, 650 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న కంచికచర్ల ఎక్సైజ్ పోలీసులు
Vijayawada updates: బెజవాడలో సృష్టి ఆసుపత్రి లింకులు..
విజయవాడ..
-బెజవాడలో సృష్టి ఆసుపత్రి లింకులు
-డాక్టర్ నమ్రత అక్రమాలపై ఆరా తీస్తున్న బెజవాడ పోలీసులు
-డాక్టర్ కరుణ పేరుతో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతున్న డాక్టర్ నమ్రత
-నమ్రతా 'స్ సృష్టి పేరుతో భవనంలో కార్యకలాపాలు
-ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 5 మంది టెస్ట్ ట్యూబ్ బేబీల జననానికి కేంద్రంగా బెజవాడ సెంటర్
-ఇప్పటికే విశాఖ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాల్లో సృష్టి ఆసుపత్రి లీలలు గుర్తించిన విశాఖ పోలీసులు
-తాజాగా హైదరాబాద్ లో సృష్టిపై కేసు నమోదుతో అప్రమత్తమైన బెజవాడ పోలీసులు
-బెజవాడ సృష్టి ఆసుపత్రి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్న బెజవాడ పోలీసులు
Srikakulam District updates: సంతబొమ్మాలి లైంగిక వేధింపులు ఘటన బాధితురాలు కామెంట్స్..
శ్రీకాకుళం జిల్లా..
-సంతబొమ్మాలి లైంగిక వేధింపులు ఘటన బాధితురాలు కామెంట్స్..
-రాజకీయ లబ్ధి కోసం కులపెద్దలు నన్ను పావులా వాడుకున్నారు..
-లక్ష్మణరావు అనే వ్యక్తి నన్ను ప్రేమించి పెళ్లికి నిరాకరించాడు..
-తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు..
-న్యాయం చేయాలని మా కులపెద్దలను ఆశ్రయించాము..
-నాపై ఒత్తిడి తెచ్చి లక్ష్మణరావు పై కేసు పెట్టించారు..
-రాజీ పేరుతో కులపెద్దలు లక్ష్మణరావు నుంచి 18 లక్షల రూపాయలు వసూలు చేశారు..
-మా కుటుంబానికి 8 లక్షలు మాత్రమే ఇచ్చారు..
-మిగిలిన డబ్బులు గురించి అడిగినందుకు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..
-మా కోర్కెలు తీరిస్తే డబ్బులు ఇస్తామని వేధింపులకు గురిచేస్తున్నారు..
-నిస్సహాయ స్థితిలో గ్రామంలో ఉండలేక విశాఖలోని మా బంధువులు ఇంట్లో తలదాచుకున్నాను..
-నా ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు..
-నాకు కులపెద్దలు నుంచి ప్రాణహాని ఉంది..
-అందుకే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసాను..
-కులపెద్దలను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలి..
-ఇప్పుడు నాకు లక్ష్మణరావుకు ఎటువంటి సంబంధం లేదు..
Amaravati updates: ఉచిత విద్యుత్ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం..
అమరావతి..
-ఉచిత విద్యుత్ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం
-దీనిపై కేబినెట్లో చర్చ మంత్రులతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ వ్యాఖ్యలు
-రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే
-ఒక్క కనెక్షన్ తొలగించం, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్‌చేస్తాం
-కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా..
-ఆఖాతాలో డబ్బులు వేయనున్న ప్రభుత్వం
-వాటిని డిస్కంలకు చెల్లించనున్న రైతు
-పూర్తి బాధ్యత ప్రభుత్వానిది
-మీటర్ల ఖర్చు డిస్కంలు ప్రభుత్వానిదే
-ప్రస్తుతం సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం లేదు
-ఉన్నపథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నాం
-10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింతగా దీర్చిదిద్దుతాం
-వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌పథకానికి ఢోకాలేకుండా చేస్తున్నాం
-పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు
-రబీ సీజన్ నుంచి పూర్తిగా అమలు
-ఉచిత విద్యుత్‌పై పేటెంట్ ఒక్క వైయస్సార్ గారికే
-అందుకే పథకానికి ఆయన పేరు
-చంద్రబాబు ఉచిత విద్యుత్తు సాధ్యంకాదన్నారు
-కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమే అన్నారు
-సుమారు 8వేల కోట్లు ఉచిత విద్యుత్తు బకాయిలుపెట్టారు మనం వచ్చాక బకాయిలు తీర్చాం
-1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రడేషన్ చేశాం
-నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం
-రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిన ఘనత వైయస్సార్‌గారిది
-ఉచిత విద్యుత్ కుదరదు, సాధ్యంకాదని వాదన చేశారు
-ఉచితంగా కరెంటు ఇవ్వడమేంటని అపహాస్యం చేశారు
-చివరకు బషీర్‌బాగ్‌లో కాల్పులకు దిగిన చరిత్ర చంద్రబాబుగారిది
-నాన్నగారు ఈ పథకాన్ని తీసుకురావడమే కాక, రైతులు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేస్తూ ప్రమాణస్వీకారం రోజు ఫైల్‌పై సంతకాలు చేశారు.
-ఆతర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చాయి
-పగటిపూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవు
-మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలన చేస్తే దాదాపు 40శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటలపాటు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవు
-ఈ పరిస్థితులు మార్చడానికి, ఫీడర్లలో ఏర్పాటు, అప్‌గ్రడేషన్ పనులకోసం రూ.1700 కోట్లు కేటాయించాం
-దీనివల్ల నడుస్తున్న ఖరీఫ్ సీజన్‌కు 89శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా ఇస్తున్నాం
-మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తిచేసి రబీనాటికి 9 గంటలపాటు పగటిపూటే కరెంటు ఇస్తాం.
-మార్చి 31, 2019 నాటికి చంద్రబాబుగారు ఉచిత విద్యుత్‌పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8వేల కోట్లు బకాయిపెట్టారు.
-మనం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించాం.
-ఈ డబ్బులు కట్టడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్నిచర్యలూ తీసుకున్నాం.
-అంతేకాదు రైతుల విశాల ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌కోసం ప్రయత్నాలు ప్రారంభించాం.
-తద్వారా యూనిట్ కరెంటు రూ.2.5లకే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
-తద్వారా ప్రభుత్వానికి భారం తగ్గుతుంది, అంతేకాక ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగుతుంది.
-రైతులకోసమే ఈసోలార్ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాం.
-అంతేకాదు కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్తు రూపేణా ఎంత వాడుతున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది.
-ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారు.
-నాణ్యమైన కరెంటు, పగటిపూట 9 గంటల కరెంటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చు. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు.
-దీనివల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి.
-అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది.
-రైతులపై ఒక్కపైసా కూడా భారం పడదు.
-ప్రతినెలా రైతుల ఖాతాలకు డబ్బు చేరుతుంది. అదే డబ్బు నేరుగా డిస్కంలకు వెళుతుంది.
-ఉచిత విద్యుత్ పథకం మరింత మెరుగుపడుతుంది.
-దీనివల్ల చంద్రబాబుగారి ప్రభుత్వంలా బకాయిపెట్టే పరిస్థితులూ ఉండవు. అలాగే స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావు.
-ఉచిత విద్యుత్తకింద డిస్కంలకు బకాయిలుపెట్టే పరిస్థి లేకుండా
-ప్రతినెలా రైతులకు డబ్బులు పడతాయి.. ఈడబ్బులు డిస్కంలకు వెళతాయి. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి.
-ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది అందులో ఉచిత విద్యుత్త పథకంలో సంస్కరణలు ఒకటి.
-మనసున్న ప్రభుత్వం మనది, రైతుల పక్షపాత ప్రభుత్వం మనది. రైతులకు అన్యాయం జరిగే ప్రశ్నే తలెత్తదు. ఒక్క పైసాకూడా నష్టం జరగదు.
-అసలు రైతులకు ఉచిత విద్యుత్తు పథకంమీద ఎవరికైనా పేటెంట్ ఉందంటే.. అది వైయస్సార్‌గారికి ఉంది. అందుకనే ఈపథకానికి వైయస్సార్ ఉచిత విద్యుత్తు పథకంగా పేరు పెడుతున్నాం.
-వైయస్సార్‌గారు రైతులను ఆదుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే... మనం మరో రెండు– మూడు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తున్నాం.
-ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాం.
-రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించం.
-రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారికి రెగ్యులరైజ్ కూడా చేస్తాం.
-ఒక్క కనెక్షన్ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం.
-విద్యుశ్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్‌సెంటర్ కూడా పెడతాం. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.
-ఉన్న ప్రతి కనెక్షన్ కూడా కొనసాగుతుంది.
-రైతులు ఎన్నియూనిట్లు కాలిస్తే.. అన్ని యూనిట్లరూ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది.
-మనం మేనిఫెస్టోలో 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు పగటిపూట ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ మాటను అక్షరాల అమలు చేస్తాం. నాణ్యమైన కరెంటు ఇస్తాం.
-ప్రస్తుత సంస్కరణల వల్ల కౌలు రైతులకూ ఎలాంటి ఇబ్బందీ లేదు.
-ఎవరికి కనెక్షన్ ఉంటే.. వారి పేరుమీద ఖాతా తెరుస్తాం. వారికి డబ్బు నెలానెలా ఇస్తాం. ఆడబ్బు డిస్కంలను చేరుతుంది కాబట్టి కౌలు రైతులకు ఎలాంటి సమస్యా ఉండదు.
-ఉచిత విద్యుత్తు పథకం కింద ప్రభుత్వం బదిలీచేసే నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోలేవు.
-మీటర్లకయ్యే ఖర్చును డిస్కంలు, ప్రభుత్వం భరిస్తాయి. రైతులకు ఎలాంటి భారం ఉండదు.
-గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమిటీలు ఉంటాయి.
-ఏడాదికి దాదాపు రూ.8వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్తుకోసం ఖర్చు అవుతుంది. దీనికయ్యే పూర్తిబాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.
-ప్రతి ఏటా రైతుకు దాదాపు రూ.49,600లకుపైగా ఉచిత విద్యుత్తు కింద ఖర్చు అవుతుంది.
-ఉచిత విద్యుత్తు పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం.
-గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచమని చెప్పాం.
-శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ప్రాజెక్టుగా అమలు, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.
Anantapur district updates: కూడేరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉద్రిక్తత..
అనంతపురం..
-కూడేరు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉద్రిక్తత
-కొద్ది రోజులుగా లోవోల్టేజీ వస్తుండడంతో పైర్లు ఎండిపోతున్నాయని ఆందోళన.
-రైతులకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు.
-విద్యుత్ సబ్ స్టేషన్ లో ఫోళ్ళు ఎక్కి పట్టుకోవడానికి యత్నించిన రైతులు.
-వారించి అడ్డుకున్న పోలీసులు కొనసాగుతోన్న ఉద్రిక్తత.
Kadapa district updates: కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులో గండికొట నిర్వాసితుల అందొళన ...
కడప :
-కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులో గండికొట నిర్వాసితుల అందొళన ...
-గండికోట రిజర్వాయర్ లో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు.
-ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ అధికారుల ఒత్తిడి..
-ముంపు గ్రామాల్లో మకాం వేసి గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్న రెవిన్యూ అధికారులు..
-పరిహారం అందించాకే ఇళ్లు ఖాళీ చేస్తామంటూ నిర్వాసితుల నిరసన..
-పోలీసుల ప్రమేయంతో నిర్వాసితులను ఖాళీ చేయించే యత్నం..
-అధికారులు, పోలీసులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగిన నిర్వాసితులు..
-పరిహారం పూర్తిగా చెల్లించాకే ఖాళీ చేస్తామంటున్న నిర్వాసితులు..
Amaravathi updates: కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ...
అమరావతి..
-కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ...
-రైతులకు విద్యుత్ నగదు బదిలీ పథకానికి క్యాబినెట్ ఆమోదం..
-ఇప్పటికే నగదు బదిలీ పథకానికి సంబంధించి విధివిధానాలు జారీ చేసిన ప్రభుత్వం...
Amaravathi updates: Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
అమరావతి...
-Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
-ఆంధ్రప్రదేశ్ కు చాలా రోజుల తర్వాత చంద్రబాబు వచ్చారు..
-చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రవాస నేతగా తయారయ్యారు..
-అవినీతి, హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు..
-ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారు..
-టీడీపీ దొంగలు దేవినేని ఉమా అసత్య ప్రచారం చేస్తున్నారు..
-దేవినేని ఉమా దొంగ ఉమాగా తయారయ్యాడు..
-చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం రాష్ట్రానికి ఏమి ఉపయోగపడింది...?
-చంద్రబాబు అనుభవం రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి ఉపయోగ పడింది..
-చంద్రబాబు అనుభవం తన కుమారుడుని కూడా గెలిపోయించు కోలేకపోయింది..
-పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు..
-పేదలకు మంచి చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు..
-జగ్గీవాసు దేవన్ కు 400 ఎకరాలు అటవీ భూమి ఇవ్వాలని చూశారు..
-దేవినికి ఉమ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం..
-మైలవరం నడిబొడ్డున చర్చకు రమ్మంటే ఉమా పారిపోయాడు..
-దేవినేని ఉమా నాపై చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధం..
-టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమా సిబిఐ విచారణకు సిద్ధమా...?