Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-02 01:30 GMT
Live Updates - Page 2
2020-10-02 12:12 GMT

Vizianagaram district updates: విజయనగరం జిల్లాలో గాంధీ విగ్రహానికి అవమానం..

విజయనగరం..

-గాంధీ జయంతి రోజున చెత్తకుప్పల్లో దర్శనమిచ్చిన బాపూజీ విగ్రహం.

-గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని న్యూలైఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో పడేసిన వైనం

-దేశమంతా బాపూజీకి పూజలు చేస్తుంటే గుమ్మలక్ష్మీపురంలో దీనా స్థితిలో పడిఉన్న బాపూజీ విగ్రహం

2020-10-02 11:59 GMT

East godavari updates: వాలంటీర్ల సేవలను అభినందించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి...

తూర్పుగోదావరి :

-వాలంటీర్ల సేవలకు ఏడాది పూర్తవుతున్న నేపధ్యంలో ప్రజలు వారి సేవలను అభినందించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

-ఈ రోజు సాయంత్రం 7 గం.లకు ప్రజలు తమ ఇళ్ల ముందు నిలబడి చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలను తెలియజేయాలని కోరిన జిల్లా కలెక్టర్   డి.మురళీధరరెడ్డి..

2020-10-02 10:09 GMT

మద్యపానం వల్ల ఎన్నో దుష్పరిణామాలు: హోం మంత్రి సుచరిత

గుంటూరు: హోం మంత్రి సుచరిత వ్యాఖ్యలు  

- సమాజంలో మద్యపానం వల్ల ఎన్నో దుష్పరిణామాలు జరుగుతున్నాయి.

- ఎన్నో కుటుంబాలు ఆర్దికంగా చితికిపోతున్నాయి

- మహిళలు ఎంతో గృహ హింస అనుభవించారు.

- అలాంటి వాటిని అరికట్టేందుకు సీఎం జగన్ మద్య నియంత్రణ చేపట్టారు.

- గతంలో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేశారు.

- మూడు దశలలో మద్యాన్ని పూర్తిగా ఎత్తివేయడం గొప్ప అంశం.

- గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరకు చేర్చారు.

- గుంటూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

- గాంధీ , అంబేద్కర్ కోరుకున్నట్లుగానే జగన్ మద్య నియంత్రణ చేపట్టారు.

- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దశల వారిగా మద్య నియంత్రణ చేపట్టారు.

- ప్రతి పేద వాడికి ఇళ్ళ స్దలం ఇచ్చేందుకు సిద్దం అయ్యాం.

- గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం జగన్ అన్న పాలన లో చూస్తున్నాం.

- కలెక్టర్ వరకు వెళ్లకుండా గ్రామ సచివాలయాల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాం.

- గిరిజన పుత్రులకు పట్టా భూములు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం .

- విద్య కు కూడా జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

- జగన్ పాలన లో ఎస్సీ, ఎస్టీ ,బిసీ, మైనారిటీ లకు

 - చంద్రబాబు కు బుద్ది వచ్చేలా 56 బిసి కులాలకు జగన్ కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు.

2020-10-02 10:03 GMT

వాలంటీర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అమరావతి: టిడిపి నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు 

- మహిళను వేధించిన వాలంటీర్,

- గ్రామస్తుడి పై కత్తితో వాలంటీర్ దాడి, వివాహిత పై వాలంటీర్ అత్యాచారం,

- పెన్షన్ డబ్బు కొట్టేసిన వాలంటీర్, చేయూత లో వాలంటీర్ చేతివాటం... ఇప్పుడు చెప్పండి జగన్ గారు మహిళల్ని వేధిస్తూ, ప్రజల్ని వెంటాడుతున్న వాలంటీర్ల కు చప్పట్లు కొట్టాలా...?

- ఇంత దుర్మార్గపు వ్యవస్థ తెచ్చిన వారిని చెప్పుతో కొట్టాలా?

2020-10-02 09:57 GMT

SHIVA BALAJI: ఆన్లైన్ క్లాసుల పేరిట కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ

- ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ పరీక్షల పేరిట కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ పై మీడియా సమావేశం 

- కరోన టైం లో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని శివ బాలాజీ సినీ నటుడు అన్నారు 

- ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ల ఫీజులు కట్టాలని ఒత్తిడి పెడితున్నారు

- ఫీజులు కట్టకపోతే.. ఆన్లైన్ క్లాసుల ఐడీ లు తొలగిస్తున్నారు

- వ్యక్తిగతంగా వెళ్లినా..మెయిల్స్ పెట్టినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు

- మౌంట్ లితేరా స్కూలు నుండి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయి

- దాంతో మొదలైన ఫీజుల ఒత్తిడి అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి

- స్కూళ్ల సిండికేట్ అయ్యాయి..మీ పరిస్థితి చూస్తే ఇలాగే అనిపిస్తుంది

- ప్రతి పేరెంటుని సపోర్ట్ చేస్తాం.. మీ వెంట నేనుంటా నాకు వేరే పని లేదు ఇదే పని గా పెట్టుకుంటాను

- మధుమిత, శివబాలాజీ సతీమణి..

- ముఖ్యమంత్రి మీద గౌరవం గా అడుగుతున్నాం

- మౌంట్ లితేరా స్కూళ్లు ఫీజులతో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నయి

- ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని మీరు చెప్పిన స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో క్షోభ కు గురిచేస్తున్నాయి

- నేను ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం

- ఫీజు కట్టలేదని ఎక్సమ్ రాయనివ్వటం లేదు

- కంట తడి పెట్టిన మధుమిత

- విద్యార్థుల తల్లి దండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి

2020-10-02 09:50 GMT

MLA CHINNNA RAJAPPA: వైయస్ కుటుంబం తోనే కోన రైతాంగానికి అన్యాయం జరుగుతోంది: పెద్దాపురంఎమ్మెల్యే

తూర్పుగోదావరి.. పెద్దాపురం: మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దాపురంఎమ్మెల్యే చినరాజప్ప కామెంట్స్..

- పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ సెజ్ పారిశ్రామికవాడ కొట్టేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నేసి ఉంచారు.

- యనమల చేసిన ఆరోపణలు వాస్తవం. కోన ప్రాంతాన్ని కబ్జా చేయాలని జగన్ ఏనాడో ప్రయత్నించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దాని గురించి తెలుసుకోవాలి..

- కోన రైతాంగానికి అప్పుడు ఇప్పుడు వైయస్ కుటుంబం తోనే అన్యాయం జరుగుతోంది..

- కాకినాడ సెజ్ విక్రయలావాదేవీల పరంపర కొనసాగుతోంది. ఏదో నాడు కాకినాడ సెజ్ పది వేల ఎకరాలు జగన్ బినామీలకు వెళుతుంది.

- రేపు బందరు పోర్టు కూడా వాళ్ళ బీనామీ లు తో నిండి పోతుంది. విశాఖ నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం కబ్జా కోసం జగన్ కుట్ర గా ఉంది.

- కోన ప్రాంతానికి కాలుష్య ప్రాంతంగా మార్చే ప్రయత్నాలకు జగన్ వ్యూహాలు ఉన్నాయి.

- అదే జరిగితే మొత్తం సముద్రతీర ప్రాంతం అంతా జగన్ బినామీలు చేతుల్లోకి వెళ్లి లక్షలాదిగా పేద ప్రజలు మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

- కాకినాడ సెజ కోనప్రాంతానికి రైతాంగానికి న్యాయం జరగాలి ఆన్న దానికే తమ నేత కట్టుబడి ఉన్నారు.

2020-10-02 09:44 GMT

TDP NARA LOKESH: అవి పోలీస్ స్టేషన్లా? లేక వైసీపీ నాయకుల ఫ్యాక్షన్ డెన్లా...?

అమరావతి: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

- దళితులపై జగన్ రెడ్డి గారి దమనకాండ పరాకాష్టకు చేరింది.

- విచారణ అని పిలిచి విజయవాడ, కృష్ణలంక కు చెందిన దళిత యువకుడు అజయ్ ని కొట్టి చంపేశారు.

-  అనారోగ్యంతో చనిపోయాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

-  వాస్తవాలు బయట పడతాయనే భయంతో కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారు.

- దుర్గగుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఒక న్యాయమా...?

- మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారు.

- ఇసుక అక్రమ రవాణాకి అడ్డొచ్చాడని వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసారు.

- ఇప్పుడు విచారణ పేరుతో అజయ్ ని బలితీసుకున్నారు.

-

2020-10-02 09:40 GMT

కాంగ్రెస్ బలోపేతం కోసమే చేరుతున్నా: మాజీ ఎంపీ జివి హర్షకుమార్

తూర్పుగోదావరి: 2014లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణ తర్వాత పార్టీ వద్దకు వెళ్ళలేదు

ఏమీ ఆశిఁచికాదు.. పార్టీ బలోపేతం కోసమే చేరుతున్నా

తన నిర్ణయం వెల్లడించా..ఇక అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలి

దళితులపై దాడుల ఆగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలలో దళితులపై దమనకాండ కొనసాగుతుందని మాజీ ఎంపీ జివి హర్షకుమార్ అన్నారు. 

2020-10-02 09:34 GMT

AMARAVATHI: పోలీసు కస్టడీలో యువ‌కుడి మృతిపై నిజనిర్ధారణ కమిటీ

  అమరావతి:  కిమిడి.కళా వెంకటరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు

- పోలీసు కస్టడీలో డి.అజయ్ మృతిపై నిజనిర్ధారణ కమిటీ

- విజయవాడ కృష్ణలంకకు చెందిన డి.అజయ్ కృష్ణ లంక పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు

- ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని నివేదిక రూపొందించి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరుగుతుంది.

- పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం మాఫియా వెనుక ఉన్న తిమింగళాలను వదిలిపెట్టి సామాన్యులను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది.

- అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారు.

- వైసీపీ నాయకులు, వాలంటీర్లు మద్యం తరలిస్తూ పట్టుబడితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులను వేధించడం దుర్మార్గం.

- అక్రమ మద్యం సరఫరా కేసులో ప్రధాన నిందితులను వదిలేసి దళిత వర్గానికి చెందిన అజయ్ ను ప్రభుత్వం వేధించడం దుర్మార్గం.

- నిజనిర్థారణ కమిటీ సభ్యులు, కె.ఎస్.జవహార్, మాజీ మంత్రి', ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యే, వాసం మునియ్య, కృష్ణాజిల్లా ఎస్.సి.సెల్ ప్రెసిడెంట్

దోమకొండ జ్యోతి, విజయవాడ మాజీ కార్పోరేటర్

2020-10-02 04:39 GMT

Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

అమరావతి..

-మానవాళి చరిత్రలో ఒక సమున్నత శిఖరం గాంధీ మహాత్ముడు.

-ఆయన నమ్మి ఆచరించి చూపిన సిద్ధాంతాలు కాలానికి అతీతమైనవి.

-సమసమాజం గురించి తపించారు గాంధీజీ.

-కానీ ఈరోజు దళితులపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే ఏపీ ముందుండటం దురదృష్టకరం. 

-కుల రాజకీయాలను, దళితుల అణచివేతను గాంధీ చూపిన అహింసాయుత మార్గంలోనే ఎదిరిద్దాం.

-సమాజంలో సమానత్వాన్ని సాధించి చూపడమే గాంధీజీకి మనం అందించగలిగే అసలైన నివాళి.

-గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరిత్రను స్మరించుకుందాం

Tags:    

Similar News