Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Amaravati updates: వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు..
అమరావతి..
-వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
-ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి శ్రీ కన్నబాబు పాల్గొంటారు
Guntur updates: సత్తెనపల్లి మండలం భట్లురు గ్రామంలో కరోన పంజా..
గుంటూరు జిల్లా..
-గ్రామంలో స్టడీ అవర్స్ నిర్వహించిన ప్రైవేటు ట్యూషన్ సెంటర్
-ప్రైవేటుఉపాధ్యాయుడుకి కరోన పాజిటివ్
-ఉపాధ్యాయుడి తో పాటు14 మంది విద్యార్థులకు కరోన పాజిటివ్
-ట్యూషన్ సెంటర్లో 50 మంది విద్యార్థులతో స్టడీ అవర్ నిర్వహణ
-విద్యార్థులు అంత ఏడు సంవత్సరలలోపు (చిన్నారులు)
-తల్లిదండ్రులు చిన్నారులకు కరోన పరీక్షలు..పాజిటివ్ గా నిర్ధారణ...
-గుంటూరు యన్ అర్ ఐ శ్రీచైతన్య సాయి సధన్ క్వరెంటైన్ సెంటర్లకు తరలింపు...
-ఒక్కరోజే గ్రామము లో 39 కేసులు
-హుటాహుటిన గ్రామంలో సత్వర చర్యలుచేపట్టిన అధికారులు
-భట్లూరు ఎస్సీకాలనీ ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించిన అధికారులు
-భయం గుప్పెట్లో భట్లూరు గ్రామంలో ప్రజలు.......
Kadapa updates: సీబీఐ అధికారికి కరోనా...
కడప :
-మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా...
-కొద్ది రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న అధికారి...
-నిన్న కరోనా టెస్టు చేయించుకున్న ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
-కొవిడ్ సోకడంతో వ్యక్తిగత ఐసోలేషన్ లో ఉంటున్న ఆ అధికారి..
-నేడు కరోనా టెస్టు చేయించుకోనున్న మిగతా అధికారులు...
Kadapa updates: ఎగువన కురిసిన వర్షాలతో గండికోటకు కొనసాగుతున్న వరద ప్రవాహం...
కడప :
జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 6500, పరివాహక ప్రాంతం నుంచి 15800 క్యూసెక్కుల నీరు రాక...
గండికోట జలాశయంలొ 16.2 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ...
మైలవరానికి 21 వేల క్యూసెక్కులు విడుదల ...
మైలవరం నుంచి 9 గేట్ల ద్వారా 30 క్యూసెక్కుల నీరు విడుదల
దిగివన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అదినిమ్మాయపల్లె నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు పెన్నా ద్వారా సొమశిలకు విడుదల
ప్రభుత్వ తీరును నిరసిస్తూ గండికొట నిర్వాసితులు కొనసాగిస్తున్న నిరసన..
Amaravati updates: ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ..
అమరావతి..
డిప్యూటీ సీఎం అంజాద్ భాషా..
-ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ.
-సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.
-అటువంటి మహనీయుని జయంతి ఈరోజు.
-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు.
Annavaram updates: అన్నవరం సత్యదేవుని దేవస్థానం వెబ్‌సైట్‌లో వ్రత పూజ కోసం ఆన్‌లైన్ ద్వారా రుసుం...
తూర్పుగోదావరి...
-అన్నవరం సత్యదేవుని దేవస్థానం వెబ్‌సైట్‌లో వ్రత పూజ కోసం ఆన్‌లైన్ ద్వారా రుసుం రూ. 1,116 నిర్ణయం
-భక్తులు ఆన్‌లైన్లో స్వామివారి వ్రతం వీక్షించే అవకాశంతో పాటు ఇంట్లో ఆచరించే వీలును అధికారులు యూట్యూబ్ లింక్ ద్వారా కల్పిస్తారు
-నేటి నుంచి ఆన్ లైను సత్యనారాయణ స్వామి వృతాలు ప్రారంభం..
East godavari updates: వివిధ కేటగిరీల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలు భర్తీ...
తూర్పుగోదావరి...
డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వరరావు..
-జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలు భర్తీ
-వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర కేటగిరీల ఖాళీల వివరాలను eastgodavari.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు
-ఈనెల 10లోగా దరఖాస్తులు అందజేయాలనీ, ఈనెల 17న తుది ఎంపిక జాబితా విడుదల
-19న ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తాం
East Godavari updates: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులను రెన్యువల్ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలి!
తూర్పుగోదావరి..
-2020-21 విద్యాసంవత్సరానికిగాను జోన్-1, 2 పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను రెన్యువల్ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలి
-జోన్ 1, 2 పరిధిలోని అధ్యాపకులు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు ఈ నెల 7న ఆయా జిల్లాల్లో ఎంపిక కమిటీ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారర
-8న ఎంపికైన అధ్యాపకులు ఈ ఏడాది విద్యాసంవత్సరానికి ఒప్పందం , చేసుకోవలసివుంటుంది
-ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు ఆర్.డేవిడ్‌కుమార్
Antervedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న పోలీస్ నిఘా...
తూర్పుగోదావరి..
-రథం దగ్ధంపై సిబిఐ అధికారులు విచారణకు వచ్చేలోపు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీషాసులు
-అమలాపురం డీఎస్పీ మాసూం భాషా ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు
Visakha updates: జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం..
విశాఖ...
-పరవాడ మండలం సాలాపువానిపాలేం జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం
-ఆటోను డీకొన్న బోలోరా వాహనం ఇద్దరికి తీవ్రగాయాలు
-అనకాపల్లి ఆసుపత్రికి తరలింపు