Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Amaravati updates: గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ...
అమరావతి....
-డిప్యూటీ సీఎం అంజాద్ భాషా..
-ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ.
-సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.
-అటువంటి మహనీయుని జయంతి ఈరోజు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు.
Kadapa district updates: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...
కడప :
-ప్రొద్దుటూరులో వెలుగుచూసిన సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసును సీఐడీకి అప్పగించిన పొలీసులు...
-నకిలీ చెక్కులు సమర్పించి ఎస్‌బీఐకి చెందిన మూడు శాఖల్లో మొత్తం రూ.9.95 లక్షలు నగదు ఉపసంహరించిన ముగ్గురు వ్యక్తులు...
-బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదుతో గత నెల 23వ తేదీన నమోదైన కేసులు...
-ఈ కేసులో ప్రధాన నిందితుడు భాస్కర్‌రెడ్డి గత నెల 24నే పోలీసుల ఎదుట లొంగుబాటు...
-తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి స్నేహితుడితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం...
-ఈ వ్యవహారంలో ఏడుగురిని సీఐడీ అధికారుల ఎదుట హాజరుపరిచిన పోలీసులు...
Kadapa updates: ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...
కడప :
-ఎర్రగుంట్ల ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...
-ఓ బెల్టు షాపుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు...
-విచారించి నివేదికను ఆబ్కారీ కమిషనర్‌కు పంపించిన జిల్లా అధికారులు...
-కమిషనర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులను జారీ...
Srisailam project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..
కర్నూలు జిల్లా....
-9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 1,61,365 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 2,89,180 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.30 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 211.4759 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Kurnool district updates: వైఎస్ జగన్ శ్రీశైలంలో గిరిజనులకు పట్టాల పంపిణీ...
కర్నూలు జిల్లా...
-గాంధీ జయంతి సందర్భంగా నేడు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో చెంచు గిరిజనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్ జగన్ శ్రీశైలంలో గిరిజనులకు పట్టాల పంపిణీ
-శ్రీశైలం ఐటిడిఎ గిరిజనుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
-శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో 1315 మంది లబ్ధిదారులకు సుమారు 2400 ఎకరాల భూముల పట్టాలు పంపిణీ చేయనున్న అధికారులు
Amaravati updates: ఎన్నో పోరాటాలకు ఊపిరిపోశాయి గాంధీజీ సిద్ధాంతాలు: నారా లోకేష్...
అమరావతి..
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
-ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికవేత్తల్లో ప్రేరణ కలిగించి...
-వివక్ష, నిరంకుశత్వాలపై జరుగుతున్న ఎన్నో పోరాటాలకు ఊపిరిపోశాయి గాంధీజీ సిద్ధాంతాలు.
-గాంధీ జయంతివేళ రైతు సౌభాగ్యం, సమాజ సమానత్వం సాధించేందుకు ఆ మహాత్ముడు సూచించిన మార్గంలో నడుద్దాం.