మద్యపానం వల్ల ఎన్నో దుష్పరిణామాలు: హోం మంత్రి సుచరిత
గుంటూరు: హోం మంత్రి సుచరిత వ్యాఖ్యలు
- సమాజంలో మద్యపానం వల్ల ఎన్నో దుష్పరిణామాలు జరుగుతున్నాయి.
- ఎన్నో కుటుంబాలు ఆర్దికంగా చితికిపోతున్నాయి
- మహిళలు ఎంతో గృహ హింస అనుభవించారు.
- అలాంటి వాటిని అరికట్టేందుకు సీఎం జగన్ మద్య నియంత్రణ చేపట్టారు.
- గతంలో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేశారు.
- మూడు దశలలో మద్యాన్ని పూర్తిగా ఎత్తివేయడం గొప్ప అంశం.
- గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరకు చేర్చారు.
- గుంటూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- గాంధీ , అంబేద్కర్ కోరుకున్నట్లుగానే జగన్ మద్య నియంత్రణ చేపట్టారు.
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దశల వారిగా మద్య నియంత్రణ చేపట్టారు.
- ప్రతి పేద వాడికి ఇళ్ళ స్దలం ఇచ్చేందుకు సిద్దం అయ్యాం.
- గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం జగన్ అన్న పాలన లో చూస్తున్నాం.
- కలెక్టర్ వరకు వెళ్లకుండా గ్రామ సచివాలయాల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాం.
- గిరిజన పుత్రులకు పట్టా భూములు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం .
- విద్య కు కూడా జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
- జగన్ పాలన లో ఎస్సీ, ఎస్టీ ,బిసీ, మైనారిటీ లకు
- చంద్రబాబు కు బుద్ది వచ్చేలా 56 బిసి కులాలకు జగన్ కార్పోరేషన్ లు ఏర్పాటు చేశారు.